2017 – 2018 శ్రీ హేమలంబ నామ సంవత్సర తులా రాశి ఫలితాలు

02017 – 2018 శ్రీ హేమలంబ నామ సంవత్సర తులా రాశి ఫలితాలు

  • చిత్త 3,4 పాదములు, స్వాతి 1,2,3,4 పాదములు , విశాఖ 1,2,3 పాదములులో జన్మించినవారు తులా రాశికి చెందును.
  • శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో తులా రాశి వారికి ఆదాయం – 02 వ్యయం – 08 రాజపూజ్యం – 01 అవమానం – 05

tula_rasiశ్రీ హేమలంబ నామ సంవత్సరంలో తులా రాశి వారు చక్కటి అనుకూలమైన ఫలితాలను పొందును. గృహ సౌఖ్యం , సంతాన సౌఖ్యం, వ్యాపార – ఉద్యోగ వ్రుత్తలయండు విజయం, సంతోషం పొందును. విహార యాత్రలు, పుత్ర సంతానం వలన వృద్ధి, శుభకార్యములు. వ్యవహార విజయం. వృత్తిలో పేరు, గౌరవం. ధనాదాయం పెరుగును. ప్రజాదరణ , బంధు గౌరవములు, సర్వ సౌఖ్యములు ప్రాప్తించును.

శ్రీ హేమలంబ నామ సంవత్సరమో తులారాసి వారికి గురువు మిశ్రమ ఫలితాలు కలుగచేయును. వృధా వ్యయమును కలుగచేయును. మధ్య మధ్య జాతకుడు అనారోగ్యంచే బాధపడును. శత్రువ్రుద్ధి ఏర్పడును. వడ్ది వ్యాపారము , సినీ ఫైనాన్సు చేయు వారికి ఈ సంవత్సరం గురువు కలసి వచ్చును. వీరికి వ్యాపార పరంగా లాభములు ఏర్పడును.

శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో తులా రాశి వారికి శని వలన ఆదాయ వ్యయములు సమానంగా ఉండు పరిస్థితులు ఏర్పడును. ఎంత ధనము ఆర్జించినా సమానముగా వ్యయం ఎదురగును. శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో సంవత్సరం అంతా రాహువు అనుకూలమైన ఫలితాలనే కలిగించును. భూ సంబధమైన వ్యాపారములు లాభించును. ప్రయానములను ఏర్పరుచును. కేతువు విద్యార్ధులకు తీవ్ర శ్రమను కలిగించును. విద్యార్ధులు పోటీతత్వం కలిగి శ్రమించవలెను. స్త్రీ సంతానానికి ఆరోగ్య సమస్యలను ఏర్పరచును. తల్లిగారికి లేదా మాతృ వర్గీయులకు మంచిది కాదు.

ఏప్రిల్ 2017 తులా రాశి ఫలితాలు / April 2017 Tula Rasi Phalitalu:

ఈ మాసంలో జ్ఞాతుల వైరము, చేయుచున్న వృత్తి వ్యాపారాలలో , ఉద్యోగ ప్రయత్నాలలో జయము ప్రాప్తించును. ఒక ఆకస్మిక సంఘటన. సోదర వర్గం వారికి సహాయం చేయుదురు. గృహ సంతోషాలు. శుభకార్యములు జరుగును. సంతోష సమయం. ఈ మాసంలో 4, 13, 22 తేదీలు మంచివి కావు.

మే 2017 తులా రాశి ఫలితాలు / May 2017 Tula Rasi Phalitalu:

ఈ మాసంలో అధికారుల వలన, పెద్దల వలన కొద్దిపాటి భయం , ఆందోళన కలుగు సూచన. తోటి ఉద్యోగులతో లేదా యజమానితో అభిప్రాయ భేదాలు. వ్యాపార రంగంలోని వారికి ధనాదాయం సామాన్యం. 20 వ తేదీ తదుపరి చేయవలసిన ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. మాసాంతంలో కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు.

జూన్ 2017 తులా రాశి ఫలితాలు / June 2017 Tula Rasi Phalitalu:

ఈ మాసంలో ఆత్మీయుల వియోగ వార్త వినవలసి వచ్చును. కొట్టిపాటి కష్టం మీద వ్యవహార విజయాలు. పుత్ర సంతాన ప్రాప్తి. బంధు సమాగములు. వారసత్వ భాగ్యం ప్రాప్తించును. స్త్రీ ధనం వలన సౌఖ్యం.ఆర్ధికంగా బలపడుదురు. ఇతరులను విమర్శించకుండా ఉండుట మంచిది. ఈ నెలలో 6, 27 తేదీలు మంచివి కావు.

జూలై 2017 తులా రాశి ఫలితాలు / July 2017 Tula Rasi Phalitalu:

ఈ నెలలో అజాగ్రత్త వలన మాటపడు సంఘటనలు. 6,7,8 తేదీలలో వాహన ప్రమాదమునకు అవకాశం. ద్వితియ వారం అంత మంచిది కాదు. అననుకూలమైన ఫలితాలు. మిత్రులతో విభేదాలు. దూర ప్రాంత ప్రయాణాలు. తృతీయ వారం నుండి గతంలో ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమగును. మాసాంతంలో జీవిత భాగస్వామితో సౌఖ్యం. 10, 14, 26, 27 తేదీలు వివాహ ప్రయత్నములకు మంచిది.

ఆగస్ట్ 2017 తులా రాశి ఫలితాలు / August 2017 Tula Rasi Phalitalu:

ఈ మాసంలో విశేష సంతోషములు, సుఖములు . నూతన కార్యములు లాభించును. ధన లాభం. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం. ప్రభుత్వ ఉద్యోగం ఆశిస్తున్న వారికి శుభవార్త. సమాజంలో పేరు ప్రఖ్యాతలు. 3,9 తేదీలు సంతాన సంబంధ ప్రయత్నములకు అనుకూలం. 10, 14, 29 తేదీలు నూతన వ్యాపార వ్యవహారాలకు మంచివి కావు.

సెప్టెంబర్ 2017 తులా రాశి ఫలితాలు / September 2017 Tula Rasi Phalitalu:

గత మాసంలో వాలే ఈ మాసంలో కూడా శుభ ఫలితాలు కొనసాగును. ఆలోచనలు కార్య రూపం దాల్చును. దైవ సందర్శన. కుటుంబంలోని పిల్లల వలన వ్యయం. ఉద్యోగ జీవనంలో ఆశించిన మార్పులు. 7, 9 , 16 తేదీలు వ్యాపార రంగం లోని వారికి మంచిది. చివరి వారం నుండి దారితప్పే ఆలోచనలతో మనఃశాంతి లోపించును. అపార్ధాలు ఏర్పడును.

అక్టోబర్ 2017 తులా రాశి ఫలితాలు / October 2017 Tula Rasi Phalitalu:

ఈ మాసంలో కొద్దిపాటి చికాకులు, గృహ లేదా భూ సంబంధమైన నష్టం. ద్వితియ వారంలో కుటుంబ సభ్యులలో ఒకరికి శస్త్ర చికిత్స లేదా అనారోగ్యం వలన ఆందోళన. తదనుకూల ధన వ్యయం. శ్రమ అధికమగును. కళత్ర వర్గం వారివలన చికాకులు. మిత్రుల సహకారం.22, 23 తేదీలు మరియు 28, 29 తేదీలు అనుకూలం కాదు. ఈ రోజులలో నవ గ్రహ స్తోత్రములు చదువుకొనుట మంచిది.

నవంబర్ 2017 తులా రాశి ఫలితాలు / November 2017 Tula Rasi Phalitalu:

ఈ మాసంలో గృహ సంబంధమైన సంతోషములు. గృహ మార్పిడికి మంచి సమయం. కొద్దిపాటి వ్యతిరేకతతో పనులు పూర్తి. విద్యార్ధులకు మంచి కాలం. 9,10.16.25 తేదీలు విదేశీ ప్రయత్నములకు, ఉద్యోగ ప్రయత్నములకు అనుకూలమైనవి. 4, 28 తేదీలలో శ్రమ అధికంగా ఉండును.

డిసెంబర్ 2017 తులా రాశి ఫలితాలు / December 2017 Tula Rasi Phalitalu:

ఈ మాసంలో కొద్దిపాటి మానసిక ఆందోళన. నమ్మిన వారి వలన మోసం, ధన వ్యయం.విరోధములు. జీవిత భాగస్వామి నుండి ఆశించిన సహకారం లభించదు. తృతీయ వారంలో ఆరోగ్య సమస్యలు. శారీరక పీడ. 22 వ తేదీ తదుపరి నూతన ఆలోచనలు కార్యరూపం. 28, 29 తేదీలలో శుభం.

జనవరి 2018 తులా రాశి ఫలితాలు / January 2017 Tula Rasi Phalitalu:

ఈ మాసంలో శరీర ఆరోగ్యం బాగుండును. మనసు ఉల్లాసంగా ఉండును. విందు వినోదాలలో పాల్గోనేదురు. 10, 14, 15 తేదీలలో ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ద్వితియ వారంలో సంతాన అనారోగ్యం. ఇష్టమైన వారి నుండి అశుభ వార్త. 21 వ తేదీ తదుపరి కార్య సిద్ధి. ప్రయత్న విజయములు. దూర స్నేహితుల కలయిక. నెల మొత్తం ధనాదాయం సామాన్యం. నూతన దంపతుల సంతాన ప్రయత్నములు లాభించును.

ఫిబ్రవరి 2018 తులా రాశి ఫలితాలు / February 2017 Tula Rasi Phalitalu:

ఈ నెలలో వృత్తి , ఉద్యోగ , వ్యాపార వ్యవహారాలలో సామాన్య ఫలితాలు. వివాహ సంబంధ సంతోషాలు. వాహన సౌఖ్యం. తృతీయ వారం నుండి కార్య విఘ్నతలు. శ్రమించవలెను. ఉద్యోగస్తులకు చికాకులు. స్త్రీలకు అనారోగ్యం అదృష్టం కలసిరాదు. 19, 20, 29 తేదీలలో సమస్యలు. పెద్దవారితో వ్యవహార చిక్కులు.

మార్చి 2018 తులా రాశి ఫలితాలు / March 2017 Tula Rasi Phalitalu:

ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు. గృహ సంతోషములు. ధన వ్యయం. కుటుంబంలో నూతన వ్యక్తుల చేరిక. తలవంపు కలిగించును సంఘటనలు. మాట జాగ్రత్త అవసరం. 17, 18 తేదీలలో అనవసర తగాదాలు. నాలుగవ వారంలో మానసిక ప్రసాంతత. కార్య సిద్ధి. ఈ నెలలో 3, 11, 20 తేదీలు ఉద్యోగ ప్రయత్నములకు మంచిది. ఆశించిన ఉద్యోగ ప్రాప్తి.