2017 – 2018 శ్రీ హేమలంబ నామ సంవత్సర మిధున రాశి ఫలితాలు

02017 – 2018 శ్రీ హేమలంబ నామ సంవత్సర మిధున రాశి ఫలితాలు

  • మృగశిర 3 , 4 పాదములు , ఆరుద్ర 1,2,3,4 పాదములు, పునర్వసు 1,2,3 పాదములలో జన్మించిన వారు మిధున రాశికి చెందును.
  • శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో మిధునరాశి వారికి ఆదాయం – 05 వ్యయం – 05 రాజపూజ్యం – 03 అవమానం – 06

midhuna_rasiశ్రీ హేమలంబ నామ సంవత్సరంలో మిధున రాశి వారికి వ్యాపారములందు, వ్రుత్తిజీవనంలోని వారికి మంచి అనుకూలమైన ఫలితాలను , లాభములను కలిగించును. ధనప్రాప్తి, గౌరవం, చక్కటి ఆరోగ్యం. కోరికలు ఫలించుట , బహు విధములైన వైభవములు కలుగును. కొద్దిపాటి శత్రుభయం ఆందోళన కలిగించును.సంతాన ప్రయత్నములు లాభించును.సంతానం మంచి స్థితిని పొందును. రాజకీయ వర్గం వారికి పదవీ లాభం. వివాహ ప్రయత్నములు చేయువారికి చక్కటి జీవిత భాగస్వామి లభించును.తలచిన ప్రతీ కార్యం విజయం పొందుటకు అవకాశం కలదు. బంధు వర్గం నుండి కొంత నిర్లిప్తత. గృహంలో మార్పులు లేదా గృహనిర్మాణం చేపట్టుటకు అవకాశం కలదు. వాయిదా పడిన పనులు తిరిగి ప్రారంభించి పూర్తి చేయగలరు.

శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో మిధున రాశి వారికి గురువు సంవత్సరం అంతా యోగించును. 12- సెప్టెంబర్-2017 వరకూ గృహ నిర్మాణ సంబంధమైన విషయాలలో అనుకూల ఫలితాలను, వాహన లాభమును, భూసంబంధమైన విషయాలలో అనుకూలతను కలిగించును. 13 – సెప్టెంబర్ – 2017 నుండి విశేష భాగ్యమును , ధనమును, పుత్రసంతానమును , స్థిరాస్తి సంపదను ఏర్పరచును.

శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో మిధున రాశి వారికి శని అనుకూల ఫలితాలను ఇవ్వడు. కళత్ర సంబంధ చికాకులను , వివాహ సుఖ లేమి, మధ్య మధ్య యోగమును చివరకి యోగ భంగమును కలిగించును. ఈ సంవత్సరం మిధున రాశి వారికి శని గ్రహ శాంతి అవసరం.

శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో మిధున రాశి వారికి 17 – ఆగష్టు- 2017 వరకూ రాహువు అనుకూల ఫలితాలను కలిగించును. ఉద్యోగ జీవనంలో అభివృద్దిని , విశేష ధనలాభాములను , వంశ వృద్ధిని కలిగించును. 17- ఆగష్టు – 2017 తదుపరి రాహువు అనుకూల ఫలితాలను ఇవ్వడు. అధిక ధన వ్యయమును కలుగచేయును. ఆరోగ్య సమస్యలను కూడా ఏర్పరచును. మిధున రాశి వారికి ఈ సంవత్సరం రాహు శాంతి కూడా అవసరం. కేతువు వలన మిధున రాశి వారు ఈ సంవత్సరంలో అనుకూలమైన ఫలితాలనే పొందును.

ఏప్రిల్ 2017 మిధున రాశి ఫలితాలు / April 2017 Midhuna Rasi Phalitalu:

ఈ మాసంలో చక్కటి సుఖసంతోషాలు ఉండును. భూ లాభం లేదా గృహ లాభం ఏర్పడును. వ్యాపార వ్రుత్తిజీవనంలోని వారికి ఆశించిన లాభములు. నూతన భాద్యతల వలన విశ్రాంతి వుండదు. ప్రధమ ద్వితియ వారములలో నూతన పరిచయాలు, సంఘంలో గుర్తింపు. ధనాదాయం బాగుండును. 18 వ తేదీ తదుపరి ఉద్యోగ లాభములు, నూతన ఉద్యోగ ప్రయత్నములలో జయము. ఉద్యోగ ఉన్నతి కొరకు ప్రయత్నాలు చేయవచ్చు. అందరి మన్ననలు పొందుదురు.

మే 2017 మిధున రాశి ఫలితాలు / May 2017 Midhuna Rasi Phalalu:

ఈ మాసంలో కుటుంబ సభులకు ఆరోగ్య సమస్యలు. జ్వరతత్వం వలన బాధ. కష్టంతో పనులు పూర్తి. నిల్వ ధనము కొంత వ్యయం అగును. మాస మధ్యమం నుండి లాభకరమైన , సంతోషకరమైన పరిస్థితి. ప్రభుత్వ సంబంధ ఆటంకములు. ఆదాయం వ్యయం సమానంగా ఉండగలవు. ప్రతీ వ్యవహారం స్వయంగా పర్యవేక్షించవలసిన పరిస్థితులు ఏర్పడును. శ్రమ అధికమగును. 22 వ తేదీ తదుపరి నూతన ప్రయత్నాలు ఫలించవు. ఈ నెలలో 1,7,9,11,25 తేదీలు మంచివి కావు.

జూన్ 2017 మిధున రాశి ఫలితాలు / June 2017 Midhuna Rasi Phalalu:

ఈ నెలలో చిన్న శస్త్రచికిత్స , గృహంలో చొరభయం. ద్వితియ వారం నుండి కార్యభారం పెరుగుట. దూరప్రాంత ప్రయాణములు, మనోవేదన. తీవ్ర ప్రయాస అనంతరం కార్యములు విజయం పొందును. వ్యాపారాదులు సామాన్యం. అడ్డయంలో పెరుగుదల కొరకు నూతన మార్గములు వెతుకుదురు. సంతనముతో కొద్దిపాటి విరోధములు. ఉద్యోగ జీవనం సామాన్యం. మాసాంతంలో అధికారుల, పెద్దల సహాయ సహకారములు లభించును. ఈ మాసంలో ప్రతీ సోమవారం ఈశ్వర అభిషేకాలు జరిపించుట మంచిది.

జూలై 2017 మిధున రాశి ఫలితాలు / July 2017 Midhuna Rasi Phalitalu:

జీవిత భాగస్వామితో చక్కటి అనుకూలత. సౌక్యం. బంధు వర్గంపై ఆధారపడకుండా ఉండుట మంచిది. వృధా వ్యయం తగ్గును. ద్వితియ వారంలో విందు భోజనం. వాహనముల వలన ఇబ్బందులు. దానములందు ఆసక్తి. విదేశీ లేదా ఉద్యోగ ప్రయత్నములలో కష్టం మీద విజయం. 7,8,9,10 తేదీలలో ప్రయత్నించుట మంచిది. ఈ నెలలో 3, 12, 17, 23, 27 తేదీలు మంచివి కావు.

ఆగష్టు 2017 మిధున రాశి ఫలితాలు / August 2017 Midhuna Rasi Phalitalu:

ఈ మాసం అనుకూలమైన కాలం. సజ్జన సాంగత్యం లభించును.వినోద కార్యక్రమాలలో పాల్గోనేదురు. వస్త్ర, గృహ, ధన లాభములు. ఋణ బాధలు తొలగును.మానసికంగా ఆనందకరమైన వాతావరణం. అవసరమైన ధనం చేతికి సకాలంలో అందును. భవిష్యత్ గురించిన బాటలు ఏర్పడును. ఉద్యోగ స్థిరత్వం. 19 వ తేదీ తదుపరి మాసాంతం వరకూ చక్కటి లాభకరమైన పరిస్థితులు. అవివాహితుల వివాహ ప్రయత్నాలు ఫలించును.

సెప్టెంబర్ 2017 మిధున రాశి ఫలితాలు / September 2017 Midhuna Rasi Phalitalu:

ఈ మాసంలో శరీర ఆరోగ్యం బాగుండును.ఉల్లాసంగా బంధువులతో, మిత్రులతో చేరికలు. సంతాన ప్రాప్తి. కార్యానుకులాత.దూర స్నేహితలతో కలయిక.జీవిత భాగస్వామితో పరుష వాక్కులు. వృత్తి వ్యాపారములు అనుకూలిన్చును. మాసాంతంలో పేరు ప్రఖ్యాతలు, నిల్వధనం, సౌఖ్యత. ఈ మాసంలో 8, 16, 24 మరియు 30 తేదీలు మంచివి కావు.

అక్టోబర్ 2017 మిధున రాశి ఫలితాలు / October 2017 Midhuna Rasi Phalitalu:

ఈ మాసంలో ప్రేమ వ్యవహారములందు అవరోధములు. మానసిక వ్యధ. అకాల భోజనములు. శిరోబాధ. నిద్రలేమి. కష్టం మీద జయం. ఉహించని ఆటంకములు. విరామం లేకుండా పనులు సాగించును. రహస్య సమాచారములు తెలియును. ఈ మాసంలో ఆవేశం తగ్గించుకోనిన మంచిది. శ్రమతో కూడిన ప్రయాణములు. 9,13,15,22 తేదీలు మంచివి కావు.

నవంబర్ 2017 మిధున రాశి ఫలితాలు / November 2017 Midhuna Rasi Phalitalu:

ఈ మాసంలో చికాకులు ఉన్నప్పటికీ చివరకు జయం. స్త్రీ సంబంధ సంతోషం. శత్రు జయం. మీరు చేయు పనులలో గుర్తింపు. పురాణ శ్రవణం.ధనాదాయం సామాన్యం. విదేశీ ఉద్యోగ ప్రయత్నములకు అనుకూలమైన కాలం. కుటుంబ వ్యవహారములు ఆశించిన విధంగా అనుకూలంగా ఉండవు. చివరి వారంలో శ్రమ అధికం, అనిశ్చిత వాతావరణం.

డిసెంబర్ 2017 మిధున రాశి ఫలితాలు / December 2017 Midhuna Rasi Phalitalu:

ఈ మాసంలో జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు. స్త్రీలకు గర్భ సంబంధమైన అనారోగ్య సమస్యలు. ధనాదాయం సామాన్యం. రావలసిన ధనం అందుట కష్టం. మాసం మధ్య నుండి వృత్తి వ్యాపారములలో అనుకూలత. సంతాన ప్రయత్నములు దైవ ఆశీస్శులతో విజయం. ఆర్ధిక విషయాలలో అనుకూలత. స్థానచలనముకు , వసతి ఏర్పాటుకు మంచి కాలం.

జనవరి 2018 మిధున రాశి ఫలితాలు / January 2018 Midhuna Rasi Phalitalu:

ఈ మాసంలో మొదటి వారం తదుపరి నూతన ఆదాయ మార్గములు ఏర్పడును. వ్యాపారములో అభివృద్ధి. పిత్రువర్గీయులతో విరోధములు. తృతీయ వారంలో మిత్రుల వలన ఒక ఆకస్మిక కష్టం. అనుకోని ఖర్చులు. వివాహ ప్రయత్నములలో ఆశాభంగం. ఈ మాసంలో 5,7,25,29 తేదీలు మంచివి కావు. ఈ రోజులలో ఋణములు తీసుకొనుట, ఇతర ఆర్ధిక పరమైన విషయాలలో పాల్గొనుట మంచిది కాదు.

ఫిబ్రవరి 2018 మిధున రాశి ఫలితాలు / February 2018 Midhuna Rasi Phalitalu:

ఈ మాసంలో సమస్యలు తగ్గును. పరిస్థితులు మెరుగుపడును.తగాదాలలో అనుకూలత. బంధువుల కలయిక, సంబంధాలు మెరుగుపడును. వాయిదా పడుతున్న పనులు పూర్తి అగును. స్త్రీల వలన ధనప్రాప్తి. 22 వ తేదీ తదుపరి సంతోషకర వార్తలు, జీవనంలో ఉన్నతి.సంతాన పరంగా శుభం. ఆదాయంలో పెరుగుదల.

మార్చి 2018 మిధున రాశి ఫలితాలు / March 2018 Midhuna Rasi Phalitalu:

ఈ మాసంలో ఆత్మీయులకు సంబంధించిన ఆందోళన. ఆదాయం బాగుండును. ధన సమస్యలు తొలగును. ద్వితియ మరియు తృతీయ వారాలలో ఉత్తమ ఫలితాలు. జీవన ప్రమాణాలు పెరుగును. జీవిత భాగస్వామి తోడ్పాటు. మానసిక ప్రశాంతత. పుత్ర పౌత్రాభివృద్ధి. సువర్ణ లాభములు.