2017 – 2018 శ్రీ హేమలంబ నామ సంవత్సర వృషభ రాశి ఫలితాలు

02017 – 2018 శ్రీ హేమలంబ నామ సంవత్సర వృషభ రాశి ఫలితాలు

vrushabha_rasiమీ జన్మ నక్షత్రం కృత్తిక 2,3,4 పాదములు, రోహిణి 1,2,3,4 పాదములు, మృగశిర 1,2 పాదములలో ఒకటి ఐయిన మీది వృషభ రాశి.

శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో వృషభ రాశి వార్కి ఆదాయం – 02 వ్యయం – 08 రాజపూజ్యం – 07 అవమానం – 03.

శ్రీ హేమలంబ నామ సంవత్సరం వృషభ రాశి వారికి అంత అనుకూలంగా వుండదు. కార్యమార్గంలో కష్టనష్టాలు, ఆరోగ్య భంగములు, చేపట్టిన ఉద్యోగ వృత్తి వ్యాపారాలలో చికాకులు, అవాంచిత స్థానచలనము, సంసార జీవనంలో కలతలు, కోర్టు తగాదాలు, మానసిక అశాంతి బాధించును. విదేశీ ప్రయత్నాలు లాభించును. ప్రభుత్వ రంగంలో వ్యాపారములు చేయువారికి లాభించును. గతంలో వాయిదా పడిన దూరప్రాంత ప్రయాణములు పూర్తి అగును. ఈ సంవత్సరం ఇతరులకు హామీలు ఇచ్చుట , భాగస్వామ్య వ్యాపారములు చేయుట మంచిది కాదు. వ్యసనముల వలన దీర్గకాళిక సమస్యలను ఎదుర్కొండురు.

శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో వృషభ రాశివార్కి గురువు సంవత్సర ప్రారంభం నుండి 12-సెప్టెంబర్-2017 వరకూ అనుకూలమైన ఫలితాలను కలిగించును. సంతాన సంబంధ శుభమును, సంతానం వలన సౌఖ్యతను , అభివృద్దిని కలుగచేయును. ఎదిగిన సంతానం చక్కటి స్థితిలో స్థిరపడును. 13- సెప్టెంబర్ – 2017 తదుపరి గురువు శుభ ఫలితాలను ఇవ్వడు. ఆర్ధికంగా తీవ్ర వ్యయమును, ఋణములను, స్వ ఆరోగ్య సమస్యలను , కుటుంబ కలహములను కలుగచేయును.

సంవత్సర ప్రారంభం నుండి 20-జూన్-2017 వరకూ వృషభ రాశి వారికి శని వలన వృధా వ్యయము ఎదుర్కొందురు. తమ కష్టార్జితాన్ని బందువులకు, స్నేహితులకూ వినియోగించెదరు. ఖర్చు విషయంలో జాగ్రత్త వహించాలి. 21-జూన్-2017 నుండి 26-అక్టోబర్-2017 వరకూ శని వృషభ రాశి వారికి వైవాహిక జీవనంలో అపసవ్యతలు ఏర్పరచును. జీవిత భాగస్వామితో తగాదాలు, భాగస్వామి తరపు బందువుల వలన సమస్యలు ఎదుర్కొందురు. ధనాదాయం బాగుండును.

సంవత్సర ప్రారంభం నుండి 17- ఆగష్టు-2017 వరకూ వృషభ రాశివారు రాహువు వలన భూసంబంధ లేదా గృహ సంబంధ వ్యయమును మాతృ వర్గీయులకు నష్టమును, అధిక శ్రమను కలుగచేయును. శరీర సౌఖ్యం తక్కువగా ఉండును. 18- ఆగష్టు-2017 నుండి రాహువు వృషభ రాశి వారికి మంచి ఫలితాలను ఇచ్చును. భాతృ వర్గం వలన సహకారమును , వారి వలన అభివృద్ది ఏర్పడును. సంవత్సరం అంతా కేతువు వృషభ రాశి వారికి అనుకూలమైన ఫలితాలనే కలిగించును. సంవత్సరం చివరి 6 నెలలలో పితృ వర్గీయులకు ఆరోగ్య సమస్యలను , తన్మూలక ఆర్ధిక వ్యయమును ఏర్పరచును.

ఏప్రిల్ 2017 వృషభ రాశి ఫలితాలు / April 2017 Vrushabha Rasi Phalalu:

ఈ నెలలో ధనాదాయం బాగుండును. వృత్తి వ్యాపారములలో ఉత్సాహం. లాభపూరిత వాతావరణం. జీవిత భాగస్వామి మూలకంగా లాభములు ఉండును. ప్రధమ వారంలో గృహంలో మార్పులు, పుణ్యక్షేత్ర సందర్శన. ద్వితియ మరియూ తృతీయ వారంలో ఆకస్మిక వివాదములు, సమయం వృధా, అనవసర ఖర్చులు. వృత్తి వ్యాపారాలలో ఆదాయం సామాన్యం. తీసుకొన్న నిర్ణయాలలో మార్పులు. ఉద్యోగ జీవనం సామాన్యం. ఈ నెలలో 28,29,30 తేదీలు మంచివి కావు.

మే 2017 వృషభ రాశి ఫలితాలు / May 2017 Vrushabha Rasi Phalalu:

ఈ నెలలో ధనాదాయం సామాన్యం. గృహంలో సంతోషములు. స్త్రీ సంతోషములు, బంధువులు మిత్రుల వలన సహకారములు. ఆశించిన కార్యములందు విజయం. శుభకార్య సంబంధ వ్యయం. 20వ తేదీ తదుపరి జీవిత భాగస్వామి సహాయ సహకారములు. సంతాన ప్రయత్నాలలో విజయం. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో విజయం. ఈ నెలలో 3,8,9,16 తేదీలు నూతన ప్రయత్నాలకు అనుకూలమైనవి. 2,11,19, 21, 29 తేదీలు మంచివి కావు. కష్టంతో కార్యములు పూర్తి.

జూన్ 2017 వృషభ రాశి ఫలితాలు / June 2017 Vrushabha Rasi Phalalu:

ఈ నెలలో కుటుంబంలో కొద్దిపాటి ఘర్షణలు. కుటుంబ సభ్యుల మధ్య మాట కలవదు. స్త్రీ సంబంధ వివాదాములలో చిక్కుకుందురు. వృత్తి వ్యాపారములు బాగుగానే ఉండును. దూరప్రాంత ప్రయాణములు. కోర్టు వ్యవహారములలో అననుకూలత. నిరుద్యుగులకు ఈ మాసం అంత అనుకూలమైనది కాదు. శ్రమతో కూడిన అభివృద్ధి ఉండును. మయా మొహాముల వలన నష్టపోవు సూచన. ఈ నెలలో 7 నుండి 13వ తేదీ మధ్య ప్రయాణములు చేయుట మంచిది కాదు.

జూలై 2017 వృషభ రాశి ఫలితాలు / July 2017 Vrushabha Rasi Phalalu:

ఈ నెలలో ఆశించిన స్థాయిలో లాభములు ఏర్పడును. నూతన వాహన లేదా గృహ ప్రయత్నములు లాభించును. స్తంభించిన వ్యాపార వ్యవహారములు తిరిగి ప్రారంభం అగును. నూతన స్థల సందర్శన. ద్వితియ వారంలో కార్యగతి అనుకూలంగా ఉండును. మంచి మాటలతో వ్యవహారములు పూర్తి చేయుదురు. తృతీయ వారంలో మాతృవర్గం సహకారంతో వివాహ ప్రయత్నములు లాభించును. 18 నుండి 24వ తేదీల మధ్య ఉద్యోగ మార్పు ప్రయత్నాలు ఫలించును.

ఆగష్టు 2017 వృషభ రాశి ఫలితాలు / Augsut 2017 Vrushabha Rasi Phalalu:

ఈ నెలలో ఉద్యోగ జీవనంలో స్థాన చలనం. పితృ వర్గీయుల ఆదరణ ప్రేమ పొందుదురు. మిత్రుల వలన లాభం. ప్రధమ వారంలో భాగస్వామ్య వ్యాపారములు విజయవంతమగును. నూతన కాంట్రాక్టులు , పనులు లభించును. అవివాహితులకు శుభవార్త. తృతీయ వారంలో ధైర్య సాహసములు పెరుగును. ఇతరులకు ఇచ్చిన ముఖ్య వస్తువు లేదా ధనం తిరిగి వచ్చుట కష్టం. ఈ నెలలో 4, 9, 17, 20, 26 తేదీలు మంచివి కావు.

సెప్టెంబర్ 2017 వృషభ రాశి ఫలితాలు / September 2017 Vrushabha Rasi Phalalu:

ఈ మాసంలో వ్యాపారాదులలో జయం , ధన ప్రాప్తి. ఉద్యోగ జీవనంలో అనుకూలమైన మార్పులు. వృత్తి వర్గం వారికి ధన లాభం. ద్వితియ వారం సామాన్యం. తృతీయ వారంలో కుటుంబంలో మానసిక అశాంతి. జీవిత భాగస్వామితో ప్రతికూలత. అనారోగ్యములకు ధనవ్యయం. దూరప్రాంత లేదా విదేశీ నివాస ప్రయత్నములు ఫలించును. ఈ మాసంలో బంధు మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించుట మేలు. ఈ నెలలో ప్రధమ ద్వితియ వారములు మంచివి.

అక్టోబర్ 2017 వృషభ రాశి ఫలితాలు / October 2017 Vrushabha Rasi Phalalu:

ఈ నెలలో ఆదాయంలో తగ్గుదల. ఆశించిన స్థాయిలో ధన లాభం ఏర్పడదు. వ్యాపార రంగంలో ధననష్టములకు అవకాశములు కలవు. మిత్ర వర్గమునకు సంభందిచిన ఒక అశుభ వార్త. ఉద్యోగ జీవనంలో మార్పులకు అవకాశం లభించదు. సంతాన ప్రయత్నములు మాత్రం కలసి వచ్చును. చక్కటి సంతాన ప్రాప్తి. 10వ తేదీ తదుపరి నూతన శిక్షణలు పొందు అవకాశం. మాసాంతంలో నూతన వ్యవహారములు వాయిదా వేసుకొనుట మంచిది. ఒక పర్యాయం శనికి తైలాభిషేకం జరిపించిన మంచిది.

నవంబర్ 2017 వృషభ రాశి ఫలితాలు / November 2017 Vrushabha Rasi Phalalu:

ఈ మాసంలో గత మాసములోని బాధలు తొలగును. ఒత్తిడి తగ్గును. ప్రధమ మరియు ద్వితియ వారములలో శత్రువిజయం. జీవనంలో ఉన్నతిని ఆశించవచ్చు. స్త్రీ సంతాన సంభందమైన చికాకులు. శుభకార్య ప్రయత్నాలు లాభించును. మాసాంతంలో స్థిరమైన ఆలోచనలు చేయుట కష్టముగా ఉండును. ముఖ్యంగా 13 నుండి 22వ తేది మధ్య కాలం అనుకూలంగా లేదు. 23వ తేదీ నుండి పరిస్థితులలో అనుకూలమైన మార్పులు. ఈ మాసంలో నిత్యం నవగ్రహ స్తోత్రములు చదువుట మంచిది.

డిసెంబర్ 2017 వృషభ రాశి ఫలితాలు / December 2017 Vrushabha Rasi Phalalu:

ఈ మాసంలో కళత్ర వర్గం వారితో సంతోషకరమైన వాతావరణం. నూతన వ్యక్తుల పరిచయాలు. లేదా నూతన వస్తువల అమరిక. వివాహాది ప్రయత్నాలలో కదలిక. ఆదాయం సామాన్యం. రాజకీయవర్గంలోనివారికి అవమానములు. భూసంబంధ లావాదేవీలు లాభించును. తృతీయ వారం నుండి గృహంలో శుభకార్య సంభదమైన వ్యయం. వ్యయములకు అవసరమగు ధనం లభించును. మసంతములో చేయు ప్రయాణాలు లాభించును. విందు వినోదములు.

జనవరి 2018 వృషభ రాశి ఫలితాలు / January 2018 Vrushabha Rasi Phalalu:

మాస ప్రారంభంలో సొంత మనుష్యులతో వివాదములు. అనారోగ్య సూచన. రక్తసంభండ దోషములు. తలచిన కార్యములు అటంకములను కలిగించినా చివరికి పూర్తి అగును. వృధా వ్యయములు. 16వ తేదీ నుండి పరిస్థితి అనుకులించును. విద్యార్ధులకు , విదేశీ విద్య కొరకు ప్రయత్నించు వారికి తృతీయ వారం నుండి మంచి కాలం ప్రారంభం అగును. కార్యమార్గంలో చిన్న చిన్న ఆటంకములు ఉన్నప్పటికీ వ్యవహార విజయం ఉండును. మాసాంతంలో ఆనందమయ సమయం.

ఫిబ్రవరి 2018 వృషభ రాశి ఫలితాలు / February 2018 Vrushabha Rasi Phalalu:

ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఎదురగును. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి నష్టములు. ద్వితియ వారంలో దూరప్రాంతము నుండి ఒక అశుభ వార్త. గృహ వాతావరణం అశాంతిని కలిగి ఉండును. మాస మధ్యంలో ఖర్చులు అధికంగా ఉండును. కోర్తువ్యవహరములలో అనుకూల ఫలితాలు. చివరి వారంలో దైవదర్శన, ఒంటరితనం. కళాకారులకు లాభించును. విద్యార్దులు శ్రమించవలెను. అన్యకార్యములపై శ్రద్ధ చూపించును. ఈనెలలో 2,6,7,15,29 తేదీలు మంచివి కావు.

మార్చి 2018 వృషభ రాశి ఫలితాలు / March 2018 Vrushabha Rasi Phalalu:

ఈ మాసంలో కూడా కొద్దిపాటి కష్టములు ఎదురగును. ఒకపర్యాయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొనుట మంచిది. ఆరోగ్య మందగమనం ఆందోళన కలిగించును. తృతీయ వారం నుండి ఆహార అలవాట్లు , వ్యసనాల పట్ల జాగ్రత్త అవసరం. ఈ నెలలో 23,24, 27,29 తేదీలలో నూతన కార్యములు, వివాహము కొరకు చేయు ప్రయత్నములు లాభించును.