రాశి ఫలాలు- జూన్ 14 2018

0రాశి ఫలాలు- జూన్ 14 2018

మేషం
ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. ఎదుటివారితో సంభాషించేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగులకు స్థానచలనం ఉంటుంది. జీవితభాగస్వామి నుంచి సహాయసహకారాలు అందుతాయి. క్రయవిక్రయాలలో స్వల్ప ధనలాభం పొందుతారు.

వృషభం
అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. ఆర్ధిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకుంటారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. విలువైన వస్తువులు, వస్త్రాలను కొనుగోలు చేస్తారు.

మిథునం
దూరప్రాంతాల నుంచి అందిన ఓ వార్త ఆనందం కలిగిస్తుంది. ముఖ్యమైన పనులు పూర్తిచేస్తారు. ఆకస్మిక ప్రయాణాలలో నూతన మిత్రులు పరిచయమవుతారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

కర్కాటకం
బంధువులతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకుంటారు. ప్రయాణాలలో ఆటంకాలు ఎదురయ్యే ఆస్కారం ఉంది. అనారోగ్య సమస్యలను అధిగమిస్తారు. సంతానం నుంచి ధనలాభం పొందుతారు.

సింహం
రుణ ఒత్తిడి నుంచి కొంతవరకు బయటపడతారు. ఆర్ధిక ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందుతారు. బంధువులతో కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కన్య
వాక్చాతుర్యంతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. విలువైన వస్తువులు, వస్త్రాలను కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి, వాహనాలు కొనుగోలు చేయాలనే కోరిక నెరవేరుతుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు.

తుల
ఆర్ధిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఊహించని ప్రయాణాలు లాభిస్తాయి. సన్నిహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు. అనుకోని అతిథుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వస్తులాభం పొందుతారు.

వృశ్చికం
వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు.

ధనుస్సు
కుటుంబంలో ఎదురైన సమస్యలను అధిగమిస్తారు. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. జీవితభాగస్వామి నుంచి ధనలాభం పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

మకరం
రుణాలు తీరి ప్రశాంతంగా ఉంటారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. భూ, ధనలాభాలు పొందుతారు. పాతమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. నూతన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది.

కుంభం
వృత్తి, వ్యాపారాలలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. సన్నిహితులతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకుంటారు. స్వల్ప ధన, వస్తులాభాలు పొందుతారు. ఎవరైనా ఇద్దరికి అన్నదానం చేయండి.

మీనం
దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు. అనుకోని ధనలాభం పొందుతారు. విందువినోదాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు.