పుట్టిన వారాన్ని బట్టి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు..

0astrologyమీరు జన్మించిన వారాన్ని బట్టి మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉందా. అయితే శాస్త్రవేత్తలు ఏడు వ్యక్తిగత సర్వేల ద్వారా కొన్ని విషయాల్ని వెలుగులోకి తెచ్చారు. ఆ సర్వే ప్రకారం మీరు ఏ వారం జన్మించారో చూసుకొని మీరు ఎలాంటివారో తెలుసుకోండి.

సోమవారం – ఈ వారంలో జన్మించిన వారు అందర్ని అమితంగా ఆకర్షిస్తారు. అంతేకాదు కుటుంబ వ్యవహారాల్లో సమయస్పూర్తిని చాటుతుంటారు. మీరు విజయం కోసం కృషి మరియు మీరు కలిగి ఉంటే నాయకత్వం పదవి కనిపిస్తుంది వ్యక్తి.

మంగళవారం – ఈ వారంలో జన్మించిన వారు అన్నింట్లో విజయం సాధిస్తారు. విమర్శలకు సున్నితంగా సమాధానం చెబుతారు. జీవితంలో ఉన్నత లక్ష్యాల్ని చేరుకోవడానికి కష్టపడతారు. నిజాయితీగా ఉంటారు.

బుధవారం – ఈ వారంలో పుట్టిన వారు కోట్లాటలకు దూరంగా చాలా మృదువుగా ఉంటారు. అందరితో కలుపుగోలుగా ఉంటారు. కష్టపడేతత్వం ఉంటుంది.

గురువారం – ఈ వారంలో జన్మించిన వారు అందరూ ప్రశంసించే లక్షణాలు ఉంటాయి. ఆకర్షణీయంగా, కష్టపడేతత్వంతో మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుంటారు. సాహాసాలు, స్వతంత్ర్యంగా జీవించే అంశాలు పుష్కలంగా ఉంటాయి.

శుక్రవారం – ఈ వారం జన్మించిన పిల్లలు చాలా సృజనాత్మకంగా ఉంటారు. స్నేహితులతో, ప్రజల్లో తెలివైనవారిగా గుర్తిస్తారు. గుళ్లు, పూజలు అంటూ అత్యంత ఆధ్యాత్మికతను కలిగిఉంటారు. అంతర్ దృష్టి, అద్భుతమైన జ్ఞానాన్ని కలిగి ఉంటారు. అయితే గతంలో ఎదురు దెబ్బలు భయంకరంగా తగులుతాయి. దీంతో కొంత నిరాశను వ్యక్తంచేస్తారు.

శనివారం – ఈ వారం జన్మించిన వారు చాలా నమ్మకంగా ఉంటారు. కానీ కొన్ని సార్లు సంస్కారం లేని విధంగా ప్రవర్తిస్తారు. అలాంటి వారిని మీరు ఏది అడిగినా మీకు వ్యతిరేకంగా మాట్లాడుతారు. అంతేకాదు గర్వం, ప్రేమని బాధ్యతగా స్వీకరిస్తారు.

ఆదివారం – ఈ వారం జన్మించినవారు అత్యంత శక్తివంతమైన వ్యక్తిత్వం, విశిష్ట లక్షణాలు కలిగి ఉంటారు. అలాంటి వ్యక్తులు ఒంటిరిగా ఉండటానికి ఇష్టపడతారు. అందంగా, సున్నితమైన మనస్తత్వం కలిగిఉంటారు. అలాంటి వారే ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉంటారు.