రాశి ఫలాలు- 18 జూన్ 2018

0రాశి ఫలాలు- 18 జూన్ 2018

మేషం
ముఖ్యమైన కార్యక్రమాలలో ఎదురైన ఆటంకాలను అధిగమిస్తారు. శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆరోగ్యం, వాహనాల నడిపే విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

వృషభం
రుణాలు కొంతవరకు తీరుస్తారు. మిత్రులతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకుంటారు. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. వృత్తి, వ్యాపారాలలో ప్రోతాహం లభిస్తుంది. పూజలలో సుగంధ సిద్ధ గంధాక్షితలు ఉపయోగించండి.

మిథునం
ఆర్థిక లావాదేవీలలో లాభాలు పొందుతారు. కొత్తమిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

కర్కాటకం
రుణ ప్రయత్నాలు చేస్తారు. శ్రమ అధికంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. కుటుంబసభ్యుల నుంచి సహాయసహకారాలు అందుతాయి. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది.

సింహం
చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. కొత్త కార్యక్రమాలను చేపట్టి సకాలంలో పూర్తిచేస్తారు. విలువైన వస్తువులు, వస్త్రాలను పొందుతారు. భూముల క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు.

కన్య
వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు.

తుల
దూరపు బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. కొత్త విషయాలను తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి-వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. వస్తులాభం పొందుతారు. సర్పదోషాలు ఉన్నవారు నిత్యం సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయండి (తలస్నానం చేయరాదు).

వృశ్చికం
సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. ధన, వస్తులాభాలు పొందుతారు. గృహనిర్మాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మానసిక ప్రశాంతత పొందుతారు. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

ధనుస్సు
వృత్తి-వ్యాపారాలలో ఎదురైన ఒడిదొడుకులను అధిగమించి ముందుకు సాగుతారు. బంధువులతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలలో నూతన మిత్రులు పరిచయమవుతారు.

మకరం
రుణ ఒత్తిడి ఏర్పడినా జీవితభాగస్వామి సాయం పొందుతారు. సోదరులతో ఏర్పడిన వివాదాలు తీరి ఊరట చెందుతారు. ముఖ్యమైన పనులలో సన్నిహితుల సాయం అందుతుంది.

కుంభం
పాతమిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. బాకీలు వస్తూలవుతాయి. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. మనశ్శాంతి పొందుతారు. వాహనయోగం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు.

మీనం
కుటుంబ సమస్యలు తీరుతాయి. ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. దూరప్రాంతాల నుంచి విలువైన సమాచారం అందుతుంది. ఆస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు.