రాశి ఫలాలు- జులై 2 2018

0రాశి ఫలాలు- జులై 2 2018

 

మేషం
సంఘంలో గౌరవం పెరుగుతుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడటంతో ఊరట చెందుతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. బంధువుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.

వృషభం
దూర ప్రయాణాలు ఉంటాయి. నూతన మిత్రులు పరిచయమవుతారు. రుణబాధల నుంచి విముక్తి పొందడంతో ప్రశాంతంగా ఉంటారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. వాహన సౌఖ్యం ఉంది. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు.

మిథునం

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. శ్రమతప్ప ఫలితం ఉండదు. జీవిత భాగస్వామి నుంచి ధనలాభం ఉంది. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

కర్కాటకం
స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. కీలక వ్యవహారాల్లో స్వీయ నిర్ణయాలే శ్రేయస్కరం. సోదరులతో ఏర్పడిన విభేదాలు సమసిపోతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. అనుకోని విధంగా అవకాశాలు లభిస్తాయి. చాలాకాలంగా ఎదురుచూస్తోన్న అవకాశం అందుకుంటారు.

సింహం
స్థిరాస్థి వివాదాలు తీరి లబ్ది పొందుతారు. కొత్త మిత్రులు పరిచయమవుతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. విలువైన వస్తువులు, వస్త్రాలను కొనుగోలు చేస్తారు. రుణ ఒత్తిడి నుంచి బయటపడతారు.

కన్య
బంధువులతో ఏర్పడిన ఆస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. కొత్త ఒప్పందాలను కుదుర్చుకుంటారు. ముఖ్యమైన పనులలో జాప్యం జరిగినా చివరకు పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.

తుల
మిత్రుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. విందు వినోదాలలో పాల్గొంటారు. విలువైన వస్తువులు, నగలు కొనుగోలు చేస్తారు. వస్తులాభం ఉంది.

వృశ్చికం
వృత్తి, వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు తొలగిపోతాయి. ఊహించని విధంగా ఎదురైన చికాకులు అధిగమిస్తారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. సోదరుల నుంచి ధనలాభం ఉ:ది. కుటుంబసభ్యులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు.

ధనుస్సు
ప్రముఖలను కలుసుకుంటారు. విందు, వినోదాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.కాంట్రాక్టులు దక్కుతాయి. సంతానానికి కొత్త ప్రయత్నాలు కలిసివస్తాయి. శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.

మకరం
రుణ విముక్తులవుతారు. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. బంధువులతో కలిసి సంతోషంగా గడుపుతారు. సభలు, సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. ఊహించన ఆహ్వానాలు ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతలు దక్కుతాయి. చేపట్టిన పనిలో జాప్యం జరిగినా పూర్తిచేస్తారు.

కుంభం
చేపట్టిన పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కీలక సమయంలో కుటుంబ సభ్యుల నుంచి సహాయసహకారాలు అందుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలు లభిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.

మీనం
ప్రారంభించిన కార్యక్రమాలలో ఎదురైన ఆటంకాలను అధిగమిస్తారు. సోదరులతో వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కాంట్రాక్టులు లాభిస్తాయి. వస్తులాభం ఉంది. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు.