2017లో శనిదేవుడి ప్రభావం ఏ రాశిపై ఎలా ఉంటుంది ??

0Shani-dev2017 సంవత్సరం రాబోతోంది. ఈ ఏడాది జ్యోతిష్యం చాలా ప్రత్యేకంగా తీసుకోవాల్సి వస్తోంది. ఈ ఏడాది శని ప్రభావం ఏ రాశులపై ఎలా ఉండబోతోంది ? 30ఏళ్ల పాటు శని ఇలా అన్ని 12 రాశులపై ప్రభావం చూపిస్తోంది. అలా శని ప్రభావం ఒకటిన్నర ఏడాది ఒక రాశిపైనే ఉంటుంది. ఆ తర్వాతే.. మరో రాశివైపు ప్రభావం చూపుతుంది.

ఇప్పటివరకు శని ప్రభావం వృశ్చిక రాశిపై ఉండేది. 2017 జనవరి 26 నుంచి శని ధనస్సు రాశిపై ప్రభావం చూపించబోతోంది. ఆ తర్వాత 2020లో మకర రాశిలో శని ప్రభావం చూపించనుంది. ఇప్పుడు 2017లో ఏ రాశిపై శని ప్రభావం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. అలాగే 2017లో ఏ రాశి వాళ్లకు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు, సక్సెస్ ని ఎలా పొందుతారో తెలుసుకుందాం..

మేషరాశి
2017లో మేషరాశి వాళ్లకు ఆర్థికంగా లాభాలు, ప్రొఫెషనల్ గా గ్రోత్ పొందుతారు. అలాగే కొన్ని మంచి బిజినెస్ డీల్స్ అందుకుంటారు. అయితే మిమ్మల్ని వెనక్కి లాగాలని భావించే వాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి.

వృషభ రాశి
వృషభ రాశివాళ్లకు కాస్త కోపం ఎక్కువ. 2017లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. మీరు చేసే ప్రతి పనీ, చెప్పే ప్రతి విషయంపై ఆలోచించి, ఆచితూచి వ్యవహరించాలి.

మిధున రాశి
మిధున రాశి వాళ్ల కష్టానికి, హార్ట్ వర్క్ కి తగిన ఫలితం, గుర్తింపు 2017లో పొందగలుగుతారు. మీరు కోరుకున్న లక్ష్యాన్ని నేర్చుకునే దిశగా అడుగులు వేస్తారు. మీ బంధులు, బ్రదర్స్, సిస్టర్స్ తో మీ బంధం మరింత బలపడుతుంది. అయితే ఎలాంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.

కర్కాటక రాశి
2017 కర్కాటక రాశివాళ్లకు మంచి ఎంప్లాయిమెంట్ ఆఫర్స్ తీసుకొస్తోంది. మీరు మీ కెరీర్ లో దూసుకుపోతారు. అయితే లీగల్ మ్యాటర్స్ లో చాలా కేర్ ఫుల్ గా ఉండటం చాలా అవసరం. అలాగే చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న కోర్ట్ కేసులు క్లియర్ అవుతాయి.

సింహరాశి
పెళ్లికాని సింహరాశి వాళ్లకు పెళ్లి చేసుకోవడానికి 2017 మంచి సమయం. అలాగే 2017లో తులారాశివాళ్లు రొమాంటిక్ రిలేషన్ లోకి ఎంటర్ అవడం లేదా పెళ్లి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశివాళ్ల వ్యక్తిగత జీవితం చాలా బాగుంటుంది. అలాగే మీ తల్లిదండ్రులను చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది.

కన్యారాశి
కన్యారాశి వాళ్లు 2017లో చాలా బిజీగా ఉంటారు. వీళ్లు ప్రొఫెషనల్ లక్ష్యాలు నెరవేర్చుకోవడానికి చాలా కష్టపడతారు. దీనివల్ల వ్యక్తిగత జీవితం చాలా డిస్ట్రబ్ అవుతుంది. కాబట్టి మీ కుటుంబంపై ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఉద్యోగానికి ఇచ్చేంత ప్రాధాన్యత కుటుంబానికి ఇవ్వాల్సి ఉంటుంది.

తులారాశి
ఇప్పటివరకు శని ప్రభావంతో బాధపడిన తులారాశివాళ్లకు ఈ ఏడాది 2017లో పూర్తవబోతోంది. తులారాశివాళ్లపై ఇప్పటివరకు ప్రభావం చూపిన శని 2017లో తప్పుకోబోతున్నాడు. శని ప్రభావం నుంచి విముక్తి పొందబోతున్నారు. అయితే రాత్రికి రాత్రే మ్యాజిక్ జరిగిపోతుందని భావించకూడదు. మీ కెరీర్, వ్యక్తిగత జీవితం మెరుగవడానికి కొంత సమయం ఇవ్వాలి.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశివాళ్లపై శని ప్రభావం ఉండే చివరి రోజులు. ఈ సమయం వీళ్లకు చాలా కష్టంగా ఉంటుంది. కానీ వీళ్లు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. నెమ్మదిగా జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోతున్నాయన్న ఫీలింగ్ 2017లో కలుగుతుంది. మీకోసం కొత్త జీవితం ఎదురుచూస్తూ ఉంటుంది.

ధనస్సు రాశి
ధనస్సు రాశిలో పుట్టిన వాళ్లు 2017లో శని ప్రభావాన్ని చూడాల్సి ఉంటుంది. చాలా సంక్షోభాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రొఫెషనల్, పర్సనల్ రెండు రకాలుగానూ శని ప్రభావం ఉంటుంది. అయితే జీవితాన్ని నెట్టుకురావడానికి ఆ దేవుడు మీకు ధైర్యాన్ని, బలాన్ని ఇస్తారు.

మకర రాశి
మకర రాశివాళ్లపై శనిప్రభావం 2017లో మొదలవుతుంది. అయితే ఈ ఏడాది మీకు విదేశాలకు వెళ్లే అవకాశాలను తీసుకొస్తుంది. అలాగే కొన్ని అద్భుతమైన వ్యాపార డీల్స్ ని అందుకుంటారు.

కుంభరాశి
కుంభరాశి వాళ్లకు 2017లో ఆర్థికంగా చాలా మంచి ఇయర్. వీళ్లకు బాగా కలిసొస్తుంది. అలాగే ప్రొఫెషనల్ గా కూడా.. సంపద పొందుతారు. మంచి అవకాశాలు అందుకుంటారు.

మీన రాశి
మీనరాశి వాళ్లు రీలొకేషన్ కావాలి అనుకుంటే.. 2017 మంచి సమయం. మీరు ఏం చేస్తున్నారు అనేది తెలుసుకోవడం, ఎంత వరకు ప్రయోజనకరం అనే దానిపై ఆలోచించడం చాలా అవసరం.

2017లో పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన పరిష్కారాలు

హనుమాన్
2017లో అందరూ హనుమాన్ ని ప్రతిరోజూ పూజించడం చాలా అవసరం. హనుమాన్ చాలీసాను చదవాలి. ఆంజనేయస్వామి దేవాలయాన్ని ప్రతి మంగవారం దర్శించుకోవాలి.

శని దేవుడు
హనుమాన్ తో పాటు శనిదేవుడిని పూజించడం చాలా అవసరం. ప్రతి శనివారం శని ఆలయానికి వెళ్లడం వల్ల మెరుగైన ఫలితాలు పొందుతారు.

దానం
నలుపు వస్తువులు జాకెటలు, నల్ల ధాన్యాలు, రగ్గులను దగ్గరలో ఉన్న అవసరమైన వాళ్లకు, పేదవాళ్లకు ప్రతి శనివారం దానం చేయడం మంచిది.

ఉద్ది పప్పు
ఆలయ పూజారికి లేదా పేదవాళ్లకు ఉద్ది పప్పు దానం చేయడం మంచిది. ఇలా ప్రతిరోజూ చేస్తే.. మీకున్న సమస్యలు నెమ్మదిగా తొలగిపోతాయి.