శ్రీ విళంబి నామ సంవత్సర ధను రాశి ఫలితాలు

0శ్రీ విళంబి నామ సంవత్సర ధను రాశి ఫలితాలు

  • మూల 1,2,3,4 పాదములు, పుర్వాషాడ 1,2,3,4 పాదములు, ఉత్తరాషాడ 1 వ పాదములో జన్మించినవారు ధనుర్ రాశికి చెందును.
  • శ్రీ విళంబ నామ సంవత్సరంలో ధనుర్ రాశి వారికి ఆదాయం – 05 వ్యయం – 05 రాజపూజ్యం – 01 అవమానం – 05

ధనుర్ రాశి వార్కి శ్రీ విళంబి నామ సంవత్సరం మంచి చెడుల మిశ్రమంగా ఉండును. నూతన వ్యాపారాలు, వ్యవహారాలు లాభించును. ఉద్యోగ అన్వేషణ చేయువారికి, వలసదారులకు వారి వారి కోరికలు నెరవేరును. వివాహ ప్రయత్నాలు నిష్పలం. యంత్ర తయారీ పరిశ్రమదారులకు లాభాలు. వస్త్ర రంగ పరిశ్రమదారులకు , చేనేత వర్గం వారికి నష్టములు. ఆరోగ్య పరంగా సుఖ వ్యాదుల వలన సమస్యలు.

శ్రీ విళంబి నామ సంవత్సరంలో ధనుర్ రాశి వారు గురు గ్రహం వలన 10-అక్టోబర్-2018 వరకూ మంచి ఫలితాలు పొందును. సక్రమ మార్గంలో విశేష ధనాదాయం ఏర్పడును. ప్రభుత్వా ఉద్యోగులకు అంతగా కలసిరాడు. గౌరవ హాని, అపకీర్తి. బృహస్పతి జాతకులు ధర్మ మార్గంలో నడచునట్లు చేయును. శుభ ఫలితాలు ఏర్పరచును. 10-అక్టోబర్-2018 తదుపరి ఇదే బృహస్పతి కలసిరాడు. వ్యవహర చిక్కులను, ఆరోగ్య సమస్యలను ఏర్పరచును.

శ్రీ విళంబి నామ సంవత్సరంలో ఏలినాటి శని దశ వలన ధనుర్ రాశి వారు అనుకూలమైన ఫలితాలు తక్కువ స్థాయిలో పొందుదురు. శరీర సౌఖ్యం దూరమగును. సులువుగా పూర్తి కావలసిన పనులు కూడా అధిక శ్రమను కలుగచేయును. ఆర్ధిక పరిస్థితులు అదుపులో ఉండవు. కుటుంభ సభ్యులు మరియు సంతాన ప్రవర్తన మానసిక చికాకులు కలుగచేయును. ధనుర్ రాశి వారికి రాహు – కేతువులు ఇరువురు కలసిరారు. శారీరక సమస్యలు, కష్టములు, మానసిక ఆందోళన కలుగచేయును.

మార్చి 2018 ధనుర్ రాశి ఫలితాలు:

ఈ మాసంలో శరీర ఆరోగ్య సంబంధ విషయాలలో అనుకూలత ఏర్పడును. శత్రుత్వములు తొలగును. మానశిక శాంతి. వృత్తిలో ప్రోత్సాహకర వాతావరణం. ద్వితియ వారం, తృతీయ వారములలో చక్కటి పురోగతి. కోర్టు తీర్పులు అనుకూలం. నాలుగవ వారం నుండి చేపట్టిన కార్యములందు స్తబ్ధత. శ్రమ అధికం. ప్రయత్న పూర్వక విజయాలు.

ఏప్రిల్ 2018 ధనుర్ రాశి రాశీ ఫలితాలు:

ఈ మాసం ప్రధమ వారంలో ధనాదాయం బాగుండును. వ్యాపార వ్యవయరాలలో పరిస్థితులు అనుకూలం. పెద్ద వయస్సు వారికి అనారోగ్యం. ద్వితీయ తృతీయ వారాలలో చేపట్టిన పనులు వేగంగా పూర్తి అగును. మంచి అనుకూల ఫలితాలు. బంధువర్గం సహకారం ఆనందాన్ని కలుగచేయును. చివరి వారంలో జూదం వలన ధననష్టనికి అవకాశం. తోటి ఉద్యోగులతో విమర్శ – ప్రతి విమర్శలు. మాట జారకుండా ఉండుట మంచిది.

మే 2018 ధనుర్ రాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో సంతాన ప్రయత్నాలు, సంబందిత విషయాలు అనుకూలంగా ఉండవు. ధనాదాయం బాగుండును. హృదయ సంబంధ సమస్యలు కలిగిన వారికి ప్రమాద కాలం. శత్రు ఓటమి. స్థిరాస్థి సమకురును. 14,15,16,17 తేదీలలో దీర్ఘకాల ఆలోచనలు కార్య రూపం దాల్చును. పేరు ప్రతిష్టలు పెరుగును. ఆనందకర సంఘటనలు. చివరి వారంలో ఆర్ధికంగా బలం పెరుగును. వ్యక్తిగత జీవన సంతోషాలు పుష్కలం.

జూన్ 2018 ధనుర్ రాశి రాశీ ఫలితాలు:

ఈ మాసం అత్యంత అనుకూలమైనది. అనేక అనుకూల ఫలితాలు ఏర్పడును. మానసిక ప్రశాంతత. తలపెట్టిన పనులు విజయవంతం అగును. ఆశించిన భాగ్యం చేతికి వచ్చును. విద్యార్ధులకు విజయం. కోరుకున్న పనులన్నీ జరుగును. అదృష్టం కలసివచ్చును. నూతన బాధ్యతల వలన గౌరవం, హోదా పెరుగును. వివాహ సంబంధ ప్రయత్నాలకు, సంతాన ప్రయత్నాలకు, రాజీ ప్రయత్నాలకు ఈ మాసం అనువైనది.

జూలై 2018 ధనుర్ రాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో కూడా తృతీయ వారం వరకూ లాభదాయక పరిస్థితులు కొనసాగును. పుణ్యక్షేత్ర సందర్శన, బంధువులతో కలయిక, తగాదలలో విజయం, మనోవాంచ్చా ఫలసిద్ధి, జీవన మార్గంలో అభివృద్ధి, అధిక ఆత్మవిశ్వాసం. తృతీయ వారం నుండి కొద్దిగా పరిస్థితులు అదుపు తప్పును. దురాశ వలన సమస్యలు, స్త్రీ సంబంధిత వ్యవహారాలలో చిక్కులు, ప్రయాణ మూలక వ్యయం, ఉద్యోగులకు ఒత్తిడులు ఏర్పడును. ఈ మాసంలో వ్యాపార రంగంలోని వారికి మాత్రం అంతగా కలసి రాదు.

ఆగష్టు 2018 ధనుర్ రాశి రాశీ ఫలితాలు:

ఈ మాసం అంతగా అనుకూలమైన ఫలితాలు ఇవ్వడు. జీవన మార్గంలో సమస్యలు, ఊహించని మార్గాలలో కష్టములు, అధిక ధన వ్యయం బాధించు సూచన. కుటుంబ జీవనం ప్రశాంతంగా ఉండదు. వ్యాపార, వృత్తి వ్యవహారాలు సామాన్యం. అలవాట్ల వలన ఒక చెడు ఫలితం లేదా సమస్య. అపవాదులు, రహస్య కార్యచరణలు, కుటుంబ సభ్యుల ముందు చిన్నతనం. తలవంపులు.ఈ మాసంలో 13,14,20,22 తేదీలు అనుకూలమైనవి కాదు.

సెప్టెంబర్ 2018 ధనుర్ రాశి రాశీ ఫలితాలు:

మొదటి ద్వితీయ వారాలలో గృహంలో అనారోగ్య సూచన. వ్యాపార ఉద్యోగ వ్యవహారాలలో చిక్కులు. సమస్యలు. వారం మధ్యలు సర్ప దర్శనం. లక్ష్య సాధనలో ఆటంకాలు. ఈ మాసంలో ఏలినాటి శని ప్రభావం అధికం. నమ్మక ద్రోహం వలన అశాంతి. 18 వ తేదీ తదుపరి కొంత అనుకూలత. ధనాదాయం పెరుగును. చేపట్టిన పనులు నిదానంగా ఫలించును. ఆశించిన శుభవార్త. భూ లేదా గృహ సంబంధ ప్రయత్నాలకు అనుకూలమైన కాలం. మాసాంతంలో విందు-వినోదాలు.

అక్టోబర్ 2018 ధనుర్ రాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఏర్పడును. ఆశించిన ధనం చేతికి వచ్చుట కష్టం. నూతన కార్యములకు ఆటంకములు. బంధు విరోధాలు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగ జీవనంలో ఒత్తిడి. అనవసర ప్రయాణాలు. 20 నుండి 26 వ తేదీ మధ్య కాలంలో ఖర్చులు పెరుగును. నిర్ణయాలలో తొందరపాటు వలన మాట పడుట. సంతాన ప్రయత్నాలు చేయువారికి శుభవార్త. నూతన పరిచయాలు.

నవంబర్ 2018 ధనుర్ రాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో కొంత అనుకూలమైన ఫలితాలు ఏర్పడును. వాయిదా పడుతూ వస్తున్న పనులు తిరిగి మొదలు పెట్టడానికి ఇది మంచి కాలం. కుటుంబంలో పరిస్థితులు చక్కబడును. వినోదం కొరకు ధనవ్యయం. మాస తృతీయ వారంలో ఆర్ధిక లాభం. ఉన్నతమైన ఆలోచనలు ఏర్పడుచుండును. ఇతరుల పట్ల ఉవ్న్న చెడు అభిప్రాయాలలో మార్పులు ఏర్పడును. ధనాదాయం సంతృప్తికరం.ఈ మాసంలో 26 వ తేదీ తదుపరి నూతన ప్రయత్నాలకు అనువైన కాలం. సత్పలితాలు పొందేదురు. మనోవిచారం తొలగును.

డిసెంబర్ 2018 ధనుర్ రాశి రాశీ ఫలితాలు:

ఈ మాసం కూడా అనుకూలమైన ఫలితాలనే కలుగచేయును. ధన వ్యయం కొద్దిగా తగ్గును. వైవాహిక జీవనంలో సమస్యలు తగ్గును. మనో నిగ్రహం అవసరం. మనసు బాధపడు సంఘటనలు. పట్టుదలకు పోవుట వలన సమస్యలు. ఉద్యోగ మార్పిడికి అననుకూల కాలం. మాసాంతానికి ఆర్ధిక పరిస్థితులలో అనుకూలత. ఈ మాసంలో 2,3,8,17,24,26,30 తేదీలు అనుకూలమైన ఫలితాలు ఇచ్చును.

జనవరి 2019 ధనుర్ రాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో తగాదాల వలన కోర్టుకేసులు లేదా పోలిసుల జోక్యం వలన చికాకులు. వ్యాపార వ్యవహారాలు సామాన్యం. అవసరాలకు సరిపడు ధనాదాయం. మిత్రుల తోడ్పాటు లభించును. ప్రయానములక ఆరోగ్య భంగములు. జీవిత భాగస్వామి కొరకు ధనం వ్యయం చేయుదురు. అతిగా ఆలోచించడం వలన నష్టపోవు సంఘటనలు. వ్యక్తిగత జీవనంలో సౌఖ్యం. సంతాన ప్రయత్నాలు ఫలప్రదం.

ఫిబ్రవరి 2019 ధనుర్ రాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో కూడా ఏలినాటి శని ప్రభావం అధికం. వైవాహిక జీవనంలో అననుకూల ఫలితాలు. ద్వితీయ తృతీయ వారాలలో కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు. భవిష్యత్ ప్రణాళికలు రచించుటకు లేదా పెద్ద నిర్ణయాలు తీసుకొనుటకు 21 వ తేదీ తదుపరి కొంత అనుకూలమైన కాలం. ఈ మాసంలో 9,10,11 తేదీలలో ప్రమాదం లేదా వాహనముల వలన సమస్యలు.

మార్చి 2019 ధనుర్ రాశి రాశీ ఫలితాలు:

ఈ మాసం ఆశించిన శుభ ఫలితాలు కలుగచేయును. వ్యాపార, ఉద్యోగ వ్యవహారాలలో విజయం. పై అధికారుల వలన మన్ననలు. నూతన కార్యములను ప్రారంభించవచ్చు. అవకాశములు సద్వినియోగం చేసుకుందురు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉండును. శ్రమకు తగిన గుర్తింపు. జీవన విధానాలలో పురోగతి. ఖర్చులు తగ్గును. కాలం కలసివచ్చును.