శ్రీ విళంబి నామ సంవత్సర కన్యారాశి రాశి ఫలితాలు

0శ్రీ విళంబి నామ సంవత్సర కన్యారాశి రాశి ఫలితాలు

 

  • ఉత్తర 2,3,4 పాదములు, హస్త 1,2,3,4 పాదములు , చిత్త 1,2 పాదములలో జన్మించిన వారు కన్యా రాశికి చెందును.
  • శ్రీ విళంబి నామ సంవత్సరంలో కన్యా రాశి వారి ఆదాయం – 14 వ్యయం – 02 రాజపూజ్యం – 06 అవమానం – 06

కన్యా రాశి వారికి శ్రీ విళంబి నామ సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు ప్రాప్తించును.ఉద్యోగ, వ్యాపార , వృత్తి జీవనముల వారికి మంచి ఫలితాలు ఏర్పడును. అవివాహితుల వివాహ ప్రయత్నములు చివరి సమయంలో సమస్యలను ఏర్పరచు సూచన. సంతాన ప్రయత్నములు చేయువారు నిరాశ చెందుటకు అవకాశములు కనిపించుచున్నవి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతమగును. నూతన వ్యాపారములు, భాగస్వామ్య వ్యాపారములు ఈ సంవత్సరం ప్రారంభించకుండా ఉండుట మంచిది. సొంత ఇంటి కొరకు ప్రయత్నములు చేయుటకు, స్థిరాస్తులు కొనుటకు ఈ సంవత్సరం కలసివచ్చును. వ్యవసాయదారులకు రెండు పంటలు ఫలించును. విద్యార్ధులకు సామాన్య ఫలితాలు.

శ్రీ విళంబి నామ సంవత్సరంలో కన్యారాసి వారికి గురువు 10-అక్టోబర్-2018 వరకూ ఆర్ధికంగా కలసివచ్చును. కానీ ఆరోగ్యములక సమస్యలను, చికాకులను కలుగచేయును. ఆరోగ్య విషయంగా చాలా జాగ్రత్త అవసరం. 11-అక్టోబర్-2018 నుండి ఆర్ధికంగా కూడా అంతగా కలసిరాడు. జాతకంలో గురుబలం లేని చిన్న పిల్లలకు బాలారిష్టములు ఏర్పరచును.

కన్యా రాశి వార్కి శ్రీ విళంబి నామ సంవత్సరంలో శని యోగించడు. సంతానంతో గొడవలు, కుటుంభ జీవనంలో సమస్యలు, విద్యార్ధులకు ఆటంకాలు, వారసత్వ సంబంధ విషయాలలో చిక్కులు, కొద్దిపాటి పిత్రార్జిత వ్యయమును లేదా నష్టమును కలుగచేయును.

కన్యా రాశి వారికి ఈ 2018 – 2019 సంవత్సరంలో రాహువు వలన అంతగా సమస్యలు ఏర్పడవు. రాహువు అధికంగా ప్రయానములను కలుగచేయును. పుణ్యక్షేత్ర దర్శనములు ఏర్పరచును.కేతువు కూడా అనుకూలమైన ఫలితాలు కలుగచేయును. భూసంబంధ వ్యాపారములు చేయువారికి , కంట్రాక్టు పనులు చేయువారికి అనుకూలమైన ఫలితాలు ఇచ్చును.

మార్చి 2018 కన్యా రాశి ఫలితాలు :

ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు. ధనాదాయం పెరుగును. కుటుంబ స్త్రీల అనారోగ్యం కొనసాగును. స్థిరాస్తి ఋణములు కొంతవరకూ తీరును. సోదర వర్గం వారికి ఖ్యాతి. ప్రయాణ మూలక ఆరోగ్య భంగములు. ఆహార విషయంగా సమస్యలు. ఈ మాసంలో ఆశించిన ఉద్యోగ అవకాశములు లభించును. అన్య స్త్రీ సంబధాలు ఇబ్బందులను కలిగించును. గౌరవ హాని. 26, 27 తేదీలలో అవాంచిత తగాదాలు.

ఏప్రిల్ 2018 కన్యరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసం మొదటి 15 రోజులలో అనుకూల ఫలితాలు, ఆశించిన లాభాలు ఏర్పడును. నూతన ఆదాయ మార్గాలు లభించును. సొంత వాహన ప్రయత్నాలు ఫలించును. ధనాదాయం బాగుండును. ద్వితీయ వారం చివరకు జీవిత భాగస్వామితో చిన్న తగాదా. మాస ద్వితియార్ధంలో స్థాన చలన సంబంధ ప్రయత్నాలు కలసివచ్చును. గొంతు సంబంధ సమస్యలు ఏర్పడుటకు సూచనలు కలవు. కుటుంబ సభ్యులతో వ్యవహరించునపుడు పట్టు విడుపులు అవసరం.ఖర్చు విషయాలలో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులతో చర్చలు జరపడం మంచిది. చివరి వారంలో శుభవార్తలు, ప్రయానములు ఫలప్రదం.

మే 2018 కన్యరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో పనులు ఆటంకములు ఎదుర్కొని పూర్తి అగును. అకారణంగా అనుమానిన్చాబదుట వంటి సంఘటనలు ఎదురగు సూచన. ధనాదాయం సామాన్యం. తృతీయ వారంలో కుటుంబ సభ్యుల మధ్య వాద ప్రతివాదనలు. వ్యాపార వ్యవహారములు సామాన్యం. ఉద్యోగ జీవనం కుడా సామాన్యం. స్పెక్యులెశన్ లాభించదు. 24 వ తేదీ తదుపరి ఈ రాశికి చెందిన చిన్న పిల్లలకు ఆరోగ్య సమస్యలు.

జూన్ 2018 కన్యారాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో ధనాదాయం బాగుండును. సోదర వర్గం వారితో సమస్య. నూతన ప్రయత్నాలు విజయవంతం అగును. బంధు వర్గంతో ఉన్న సమస్యలు తొలగిపోవును. సహకారం లభించును. ఆరోగ్య విషయాలు కూడా సహకరించును. తృతీయ వారంలో దాన ధర్మాలు, ఆద్యాత్మిక చింత. 28,29,30 తేదీలలో ఉద్యోగ జీవనం చేయువారికి అననుకూల పరిస్థితులు.

జూలై 2018 కన్యారాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో వ్యాపారములు అంత సవ్యంగా ఉండవు. మాత్రు వర్గీయులకు మంచిది కాదు. వాహన సంబంధ సమస్యలు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించవలెను. చిన్న పిల్లలకు కూడా ఆరోగ్య ప్రతిబంధకాలు. తృతీయ చతుర్ధ వారంలో ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును. 26 వ తేదీ తదుపరి వృధా ఖర్చులు. కోపస్వభావం. తన్ములక తగాదాలు.

ఆగష్టు 2018 కన్యారాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో దీర్ఘకాలిక సమస్యలకు ఒక పరిష్కారం ఏర్పడును. స్థాన చలనానికి సూచనలు. బంధు మిత్రుల సహకారంతో మానశిక ఆనందం. ద్వితీయ వారం నుండి ధనాదాయం పెరుగును. జీవన ప్రమాణాలలో ఉన్నతి. కుటుంబంలో చక్కటి అవగాహనా. తృతీయ చతుర్ధ వారాలలో సామాన్య ఫలితాలు.

సెప్టెంబర్ 2018 కన్యరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో నూతన కార్యములు ప్రారంభించే సూచనలు కలవు. సంతానం వలన వ్యయం అధికము అగును. ఉద్యోగ జీవనంలో ఆశించిన గుర్తింపు ఉండదు. కానీ కొత్త బాధ్యతలు ఏర్పడుట లేదా శ్రమ అధికం అగుట వంటి పరిస్థితులు. 16.17,18,19 తేదీలలో నిరుత్సాహ పరిచే సంఘటనలు. వ్యక్తిగత అవమానాలు. ఈ మాసంలో ఇతరుల సలహాలు పాటించకుండా ఉండుట మంచిది. మానసిక సంసిద్ధత అవసరం.

అక్టోబర్ 2018 కన్యరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్య. గృహ సంబంధ విషయాలలో ప్రతికూల వాతావరణం. ధవ్యయం పెరుగుటకు సూచనలు. మాస మధ్యమం నుండి బాగుండును. వ్యాపారులకు మాత్రం సామాన్య ఫలితాలు. ఆటంకములు. 20 నుండి 27 వ తేదీల మధ్య ప్రత్యేకమైన గుర్తింపు. వివాహ ప్రయత్నాలు ఫలించును. బంధు మిత్రుల వలన సంబంధాలు కుదురును.

నవంబర్ 2018 కన్యరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో వ్యవహారాలు సమస్యలతో కొనసాగినా చివరికి ఫలవంతమై కార్య సిద్ధి ఏర్పడును. స్నేహితులతో విరోధం. నిర్ణయాలు తీసుకోవడంలో తప్పులు. అభద్రతాభావంతో కూడిన ఆలోచనలు అధికమగును. ధర్మబద్ధమైన ఆదాయం. మానసిక ఉత్సాహం కోరవడును. చివరి వారంలో ప్రశంసలు. సమస్యలు శాంతించును. ఈ మాసంలో 8,11,15,20 తేదీలు అనుకూలమైనవి కావు.

డిసెంబర్ 2018 కన్యరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో దూర ప్రయాణాలు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును. ప్రధమ వారంలో శిరస్శుకు సంభందించిన సమస్యలు. ధనాదాయం సామాన్యం. స్థిరాస్థి తగాదాలు. అనవసర పట్టుదల వలన సమస్యలు. ద్వితీయ తృతీయ వారాలలో కార్య సిద్ధి. వ్యాపారములండు లాభం, ఉద్యోగంలో పదోన్నతి. 21వ తేదీ తదుపరి విలాసముల కొరకు ధవ వ్యయం.వృధా ఖర్చులు. ఫలితం లేని చర్చలు.

జనవరి 2019 కన్యరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో వ్యవహారములు, ప్రయత్నములు సానుకూలత పొందును. గతకాలంలో ఆపివేసిన పనులు తిరిగి ప్రారంభించుటకు ఇది మంచి సమయం. ధనాదాయం పెరుగును. కోరికలు నెరవేరును. అవసరానికి ఆశించిన ఆర్ధిక సర్దుబాటు జరుగును. కుటుంబంలో సంతోష సమయాలు. వాహన సౌఖ్యం. చివరి వారంలో విద్యార్ధులకు సమస్యలు. ఈ మాసంలో 4 నుండి 16 వ తేదీ మధ్య అన్నిరకముల ప్రయత్నాలు కలసివచ్చు సమయం.

ఫిబ్రవరి 2019 కన్యారాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో బంధు వర్గం వలన ఒక నష్టం. కుటుంబంలో ప్రతికూలత. వ్యాపార వ్యవహారాలు సామాన్యం. సకాలంలో పనులు పూర్తి అవ్వవు. విమర్శకుల వలన మానసిక అశాంతి. ఆర్ధికంగా ఇబ్బందులకు అవకాశం. నిర్ణయాల పట్ల స్థిరత్వం అవసరం. 1,2,9,13,14,25 వ తేదీలు అనుకూలమైనవి కావు. మొత్తం మీద ఆర్ధిక పరంగా ఈ దశ మిశ్రమ ఫలితాలు ఇచ్చును.

మార్చి 2019 కన్యరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో తిరిగి సానుకూల పరిస్థితులు ఏర్పడును. పై అధికారుల వలన లాభాములుండును. పదోన్నతికై లేదా ఉద్యోగ మార్పుకు , గృహాలపై పెట్టుబడులు పెట్టుటకు ఈ మాసం కలసి వచ్చును. పెట్టుబడుల వలన కలసివచ్చును. సంతాన ప్రయత్నాలు ఫలించును. రావలసిన ధనం చేతికి వచ్చును.