శ్రీ విళంబి నామ సంవత్సర కర్కాటక రాశి ఫలితాలు

0శ్రీ విళంబి నామ సంవత్సర కర్కాటక రాశి ఫలితాలు

  • పునర్వసు నక్షత్ర 4 వ పాదం , పుష్యమి నక్షత్ర 1,2,3,4 పాదములు, ఆశ్లేషా నక్షత్ర 1,2,3,4 వ పాదములలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందును.
  • శ్రీ విళంబి నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి ఆదాయం – 08 వ్యయం – 02 రాజపూజ్యం – 07 అవమానం – 03

శ్రీ విళంబి నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ధనాదాయం బాగుండును. నూతన ప్రయత్నాలు లభించును. వ్యాపార – వ్యవహారాలు అనుకూలించును. ఆలోచనలను కార్యారుపంలోనికి తీసుకోనిరాగలరు. ఈ సంవత్సరం కర్కాటక రాశికి చెందిన అన్ని వర్గములవారికి మంచి ఫలితాలు ఏర్పడును.

శ్రీ విళంబి నామ సంవత్సరంలో గురువు కర్కాటక రాశి వారికి సంవత్సరం అంతా అనుకూలమై ఉండును. విద్యార్ధులకు అతి చక్కటి ఆశించిన విద్య లభించును. భూసంబంధ వ్యాపారం లేదా వ్యవసాయం చేయువారికి మంచి లాభాలు కలుగును. వాహన యోగమును ఏర్పరచును. సంతాన ప్రయత్నములు చేయువారికి 11-అక్టోబర్ – 2018 తదుపరి చక్కటి సంతాన ప్రాప్తిని కలుగచేయును.

శని వలన శ్రీ విళంబి నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి అంత మంచి జరుగదు. సంవత్సరంలో చిన్న చిన్న తగాదాలను , ఆరోగ్య సమస్యలను ఏర్పరచును. ఈ సంవత్సరం రాహువు మంచి ఫలితాలను కలుగాచేయడు. ఇతరులతో పరుషంగా మాట్లాడునట్టు, దయా దాక్షిన్యాలను మరచి ప్రవర్తించునట్టు చేయును. కేతువు సంతాన సంబంధ విషయాలలో ఇబ్బందులను ఏర్పరచువాడు అగును. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు సర్ప దోష నివారణ పూజ జరిపించుకోనుట మంచిది.

మార్చి 2018 కర్కాటక రాశి ఫలితాలు:

ఈ మాసం మిశ్రమ ఫలితాలను కలిగించును. భయం, అనారోగ్యం, మనసున తొందరపాటుతనం, పై అధికారుల వలన ఒత్తిడి. ద్వితియ వారంలో సంతాన సంబంధ ప్రయత్నాలు లాభించును.కుటుంబ ఖర్చులు అధికమగును. శుభమూలక ఖర్చులు ఉండగలవు. 14, 15 తేదీలలో ప్రయానములందు జాగ్రత్త వహించవలెను.

ఏప్రిల్ 2018 కర్కాటకరాశ రాశీ ఫలితాలు:

ఈ మాసంలో నూతన ప్రయత్నాలు విజయవంతం అగును. ఆశించిన శుభ ఫలితాలు ఏర్పడును. సంతాన ప్రయత్నములు మాత్రం కేతు గ్రహం వలన విఫలం అగును. జీర్ణ సంబంధ ఆరోగ్య సమస్యలు. ధనాదాయం బాగుండును. ద్వితీయ వారంలో వాహన చోదన విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారములందు శ్రద్ధ చుపించవలెను. తృతీయ చతుర్ధ వారాలలో ఉద్యోగస్తులకు ప్రశంసలు లేదా ఉద్యోగంలో స్థిరత్వం.

మే 2018 కర్కటకరాసి రాశీ ఫలితాలు:

ఈ మాసం ఆరోగ్య పరంగా అంత మంచిది కాదు. ఆదాయం తగ్గును. మూత్ర సంబంధ సమస్యల వలన బాధ. పనుల్లో ఉత్సాహం తగ్గును. మానసిక ప్రశాంతత కోరవడును. ధైర్యంగా ఉండవలసిన పరిస్థితులు ఏర్పడు సూచన. నూతన వ్యక్తులతో మాటలడునప్పుడు లేదా వ్యవహరించుటలో జాగ్రత్త అవసరం. 14వ తేదీ నుండి 20వ తేదీ మధ్య ఆరోగ్య పరంగా జాగ్రత్త పడాలి. 25 వ తేదీ తదుపరి ప్రయాణాలు లాభించును.

జూన్ 2018 కర్కాటకరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో 11 వ తేదీలోపు చేయు అన్నిరకముల ప్రయత్నాలు ఫలవంతం అగుటకు చక్కటి గ్రహ స్థితులు కలవు. ఆరోగ్య సమస్యలు ఉపసమించును. వ్యాపారములు సామాన్యంగా నడుచును. ఉద్యోగ మార్పుకు ఈ మాసం మంచిది కాదు. ఉద్యోగ జీవనంలో శ్రమ అధికం అగును. ఆర్ధికంగా నష్టం ఎదుర్కొనుటకు సూచన కలదు. కావున 11వ తేదీ తదుపరి నూతన వ్యవహారములు ప్రారంభించకుండా ఉండుట మంచిది. పూర్వకాలపు ఋణభారం చికాకు కలిగించును. సన్నిహితుల తోడ్పాటు అవసరమగును.

జూలై 2018 కర్కటకరాసి రాశీ ఫలితాలు:

ఈ మాసం ఆకస్మిక సమస్యలు, అకారణంగా మాటపడుట, నిందలకు గురిఅగుట వంటి సంఘటనలు కలుగచేయును. ఆదాయం సామాన్యం. చేపట్టిన పనులు సొంత కాలయాపన వలన ఆలస్యమగును. కార్య దక్షత, స్వీయ నిగ్రహం అవసరం. ఆశ్రద్ధతో కూడిన ధోరణి వలన నష్టాలు. ఈ మాసంలో అతి ధైర్యం పనికిరాదు. భాత్రు వర్గమునకు మీ సహకారం అవసరమగును. ఈ మాసంలో 2,13,20,29 తేదీలు కలసిరావు.

ఆగష్టు 2018 కర్కటకరాసి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో సమస్యలు తగ్గును. వ్యాపార వ్యవహారాలు బాగుండును. ఉద్యోగంలో మాత్రు స్థానానికి స్థానచలనం కోరుకొనే వారికి కోరిక ఫలించును. నిరుద్యోగులకు శుభవార్త. వీసా సంబంధిత ప్రయత్నాలకు ఇది మంచి కాలం. తలపెట్టిన పనులు చక్కగా పూర్తి అగును. పోయిన వస్తువులు తిరిగి పొందగలరు. స్నేహబంధాలు బలపడును. చివరి వారంలో కొద్దిపాటి ధన సమస్యలు.

సెప్టెంబర్ 2018 కర్కటకరాసి రాశీ ఫలితాలు:

ఈ మాసం ఆర్ధికంగా బాగుండును. కానీ వ్యక్తిగత జీవనంలో తగాదాలు, జీవిత భాగస్వామితో విముఖత, కుటుంబ పరమైన ఊహించని సంఘటనలు ఏర్పడు సూచన. మర్యాదగా ప్రవర్తించుట మంచిది. బాధ్యతలను విస్మరించడం వలన మాటపడును. వ్యాపారస్థులకు మిశ్రమ ఫలితాలు. దూరదృష్టి అవసరం. ఈ మాసంలో 10,11,12 తేదీలు కలసిరావు.

అక్టోబర్ 2018 కర్కాటకరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసం పిత్రువర్గీయులకు అంత మంచిది కాదు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు లాభించును. ధనాదాయం సామాన్యం. వ్యక్తిగతంగా ఒక ముఖ్య నిర్ణయం తీసుకోనుదురు. మొహమాటం వలన నష్టపోవుదురు. తృతీయ వారంలో ముఖ్య స్నేహవర్గానికి సంబందించిన దుర్వార్త వినుటకు సూచన. 27 వ తేదీ నుండి 29 వ తేదీల మధ్య ముఖ్య కార్యక్రమాలను వాయిదా వేయుట మంచిది.

నవంబర్ 2018 కర్కటకరాసి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో ధనవ్యయం పెరుగును. అవసరములకు తగిన ధనం అందుట కష్టం. తన్మూలక చికాకులు. ఆలోచనల్లో విశాల దృక్పధం, తార్కికతత్వం అవసరం. లేనిపోని అనుమానముల వలన వ్యక్తులను దూరం చేసుకోను సూచనలు. తగవులలో అపజయం. విక్రయాలకు ఇది మంచి మాసం కాదు. ఆశించినంతగా లాభం రాదు. ఉద్యోగ జీవనంలో ఒడిదుడుకులు. అహాన్ని విడిచిపెట్టాలి. సహోద్యోగుల వలన అశాంతి. ధనాదాయం సామాన్యం.

డిసెంబర్ 2018 కర్కటకరాసి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో సొంత గృహం లేదా స్థలం కొరకు ప్రయత్నించుటకు అనుకూలమైన గ్రహ స్టితులు కలవు. వ్య్పరములు గత మాసంకంటే లాభదాయకంగా కొనసాగును. విదేశీ జీవన ప్రయత్నములకు, వివాహ ప్రయత్నాలు చేయుటకు మంచిది. మాత్రు వర్గీయుల వలన లాభం. అదృష్టవంతమైన కాలం. ఆర్ధికంగా ఎదుగుదల. శత్రు విజయం. ప్రశంసలు. కుటుంబ సభ్యులతో ఆనందకర సమయం.

జనవరి 2019 కర్కటకరాసి ఫలితాలు:

ఈ మాసంలో సంతాన సంబంద ఆనందం లేదా సౌఖ్యం. జీవనంలో ప్రశాంతత. సజ్జన సాంగత్యం. పుత్రికా సంతతి కలిగిన వారికి నూతన బాధ్యతలు. చివరి వారంలో అధిక శారీరక శ్రమ. పేర్కొనదగిన ఇతర ప్రధాన ఫలితాలు ఏమియూ లేవు.

ఫిబ్రవరి 2019 కర్కటకరాసి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో 12వ తేదీ వరకూ వ్యాపారస్థులకు అనుకూలం. క్రీదరంగాలోని వారికి కూడా బాగా కలసివచ్చును. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందుటకు తగిన బలాలు కలవు. కోర్టు వ్యవహారాలు అనుకూలం. తృతీయ వారం నుండి మిశ్రమ ఫలితాలు. ఒత్తిడి పెరుగును. విలువైన వస్తువులు పోగొట్టుకొండురు. వృధా వ్యయం. ఆశించిన ఫలితాలు లభించవు. రక్షణ రంగంలో సేవ చేయువారికి మంచిది కాదు. ఈ మాసంలో 21 నుండి 26 వరకూ అనుకూలమైన రోజులు కావు.

మార్చ్ 2019 కర్కటకరాసి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో కూడా ఫలితాలు మిశ్రమంగా ఉండును. విద్యార్ధులకు కలసివచ్చును. ఉన్నత విద్యావంతులు అగును. ప్రేమవ్యవహరములలో లేదా వ్యక్తిగత జీవితంలో స్పష్టత లభించును. హామీలు నిలబెట్టుకోలేరు. ఆర్ధిక విషయాలలో అత్యాశ వలన చక్కటి అవకాశములు చేజారుటకు సూచన. ధనాదాయం సామాన్యం.