శ్రీ విళంబి నామ సంవత్సర కుంభ రాశి ఫలితాలు

0శ్రీ విళంబి నామ సంవత్సర కుంభ రాశి ఫలితాలు

  • ధనిష్ఠ 3,4 పాదములు, శతభిషం 1,2,3,4 పాదములు, పూర్వాభాద్ర 1,2,3,4 పాదములలో జన్మించినవారు కుంభ రాశికి చెందును.
  • శ్రీ విళంబి నామ సంవత్సరంలో కుంభ రాశి వారికి ఆదాయం – 08 వ్యయం – 14 రాజపూజ్యం – 07 అవమానం – 05

శ్రీ విళంబి నామ సంవత్సరంలో కుంభ రాశి వారు చక్కటి ఫలితాలు పొందుదురు. సంవత్సర ప్రారంభ మాసాలలో ధనం కొద్దిగా వృధా వ్యయం అగును. వ్యాపార వ్యవహారములు , వృత్తి పనులు నిదానంగా ఫలించును. సొంత గృహసంబంధమైన కోరికలు నెరవేరును. వ్యవసాయదారులకు ఆటంకములు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించును. వివాహ సంబంధాలు సఫలమగును. మాత్రు వర్గీయులకు ఈ సంవత్సరం మంచిది కాదు.

శ్రీ విళంబి నామ సంవత్సరంలో కుంభ రాశి వారు గురు గ్రహం వలన సంవత్సరం అంతా మంచి ఫలితాలు పొందును. వారసత్వ సంపద వలన, స్వార్జిత ధనం వలన మంచి భాగ్యం ఏర్పరచుకొండురు. 11-అక్టోబర్-2018 తదుపరి వృత్తి జీవనం చేయువారికి అత్యంత లాభాపూరిత కాలం. మిక్కిలి పేరు ప్రఖ్యాతలు , ధనము సంపాదిన్చుకొండురు.

శ్రీ విళంబి నామ సంవత్సరం లో కుంభ రాశి వారు శని గ్రహం వలన కూడా ఆర్ధికంగా అనుకూల ఫలితాలు పొందును. వ్యక్తిగత జీవనంలో అనగా జీవిత భాగస్వామితో సమస్యలు ఏర్పరచును. కుంభ రాశి వారికి ఈ సంవత్సరం రాహువు వలన సమస్యలు, శత్రు వ్రుద్ధి, ఆరోగ్య సమస్యలు ఏర్పడును. కేతువు విద్యార్ధులకు మంచి చేయును. ఆశించిన విద్యావ్రుద్ధిని ప్రసాదించును. జాతకులు ఉన్నత విద్యావంతులు అగును.

మార్చి 2018 కుంభ రాశి ఫలితాలు:

ఈ మాసంలో ప్రధమ వారంలో మిత్రులతోనూ , అధికారులతోనూ విభేదములు. ద్వితియ వారంలో మిశ్రమ ఫలితాలు. తృతీయ వారంలో సంతానం వలన సౌఖ్యత. కుటుంబ వాతావరణంలో ఆనందాలు. తగాదాలలో విజయం. 20 వ తేదీ నుండి ఆర్ధిక పరమైన విషయాలలో అననుకూలత. ఆకస్మిక సంఘటనలు. దుర్జన సహవాసం.

ఏప్రిల్ 2018 కుంభరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో ఉద్యోగ, వ్యాపార వృత్తి జీవనం వారికి సామాన్య ఫలితాలు ఏర్పడును. విద్యారంగం వారికి మాత్రం విద్యా విషయాలలో విజయం ప్రాప్తించును. నిరుద్యోగుల ఉద్యోగ అన్వేషణ ఫలించును. నూతన వ్యాపార ప్రారంభాలకు లేదా నూతన ఆలోచనలు కార్యాచరణలో పెట్టుటకు ఈ మాసం అంత అనుకూలమైనది కాదు. తృతీయ వారం మధ్య నుండి పనులు సకాలంలో పూర్తి అగును. వాతావరణం ఉత్సాహపూరితంగా ఉండును. కోరుకున్న నూతన వస్తువులు గృహంలో చేరును. గత కాలపు సమస్యలకు పరిష్కారం లభించును. మాసాంతంలో విందు వినోదాలు, కుటుంబ మిత్రులతో కలయికలు.

మే 2018 కుంభరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో వివాహ సంబంధ ప్రయత్నాలకు తగిన గ్రహ బలాలు లేవు. జీవిత భాగస్వామికి కూడా కొద్దిపాటి అనారోగ్య సూచనలు. భాత్రు వర్గంతో సఖ్యత లోపించును. ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు సామాన్యం. అవసరానికి తగిన సహహాన్ని పొందుదురు. ద్వితీయ తృతీయ వారాలు గృహంలో ఒక శుభ కార్యం వలన సందడి.బంధు సమాగమం.20,21,22 తేదీలలో నూతన పరిచయాలు లేదా పెద్దల వలన ప్రశంశలు. చివరి వారంలో వ్యాపారస్థులకు ప్రయాణాలు. ఆదాయం తగ్గును.

జూన్ 2018 కుంభరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసం చక్కటి అనుకూలమైన ఫలితాలు ఏర్పరచును. ఉద్యోగ, వ్యాపార వృత్తి జీవనం వారికి అనుకూలమైన రోజులు. 14,20 తేదీలు అనుకూలంగా ఉండును. ధనాదాయం బాగుండును. నూతన ప్రయత్నాలు నెరవేరును. వాహన సంబంద లాభం. నిరుద్యోగులకు శుభవార్త. పుణ్యక్షేత్ర సందర్శన. ఉద్యోగస్తులకు గౌరవ మర్యాదలు. 29,30 తేదీలలో కార్య ఒత్తిడి పెరుగును.

జూలై 2018 కుంభరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో కూడా ధనాదాయం బాగుండును. వ్యాపారస్థులకు ప్రోత్సాహకరం. వ్యాపార విస్తరణకు మంచి సమయం. ఉద్యోగస్తులకు నూతన భవిష్యత్ ప్రణాళికలు లభించును. ఉద్యోగ ఉన్నతి లేదా స్థాన మార్పిడికి ప్రయత్నాలు ఫలవంతం. సంకల్ప సిద్ధి లభించును. చిత్ర రంగ పరిశ్రమ వారికి అతి చక్కటి కాలం. ఈ మాసం సువర్ణ సంబంధ కోరికలు తీరును.

ఆగష్టు 2018 కుంభరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో ఆదాయ – వ్యయములు సమానంగా ఉండును. గృహ సంబందిత విషయాల వలన వ్యయం ఏర్పడును. ఉద్యోగ జీవనంలో ద్వితీయ వారం అంతగా కలసిరాదు. పై అధికారుల వలన సమస్యలు, మాటపడు సంఘటనలు. చేపట్టిన వ్యవహారాలలో అపజయాలు. ప్రమదపూరిత సంఘటనలు. తృతీయ వారంలో స్నేహవర్గం వలన తోడ్పాటు. ఆర్ధికంగా కొద్దిపాటి ఇబ్బందులు. నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం వలన సమస్యలు. 24వ తేదీ తదుపరి పరిస్థితులలో కొంత అనుకూలత. సమయానుకూల ప్రవర్తన అవసరం. ఈ మాసంలో 10,11,12,13 తేదీలలో జాగ్రత్త అవసరం.

సెప్టెంబర్ 2018 కుంభరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో ఆదాయం ఆశించిన స్థాయిలో వ్రుద్ధి చెందును. సంతాన లేమి దంపతుల సంతాన ప్రయత్నాలు ఫలించును. సంతానానికి మంచి రోజులు. వ్యాపార వ్యవహారాలు బాగుండును. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో ఆటంకాలు. అవమానం పొందు సంఘటనలు. ఈ మాసంలో కుడా అధికారులతో జాగ్రత్తగా మేలగావలెను.19,20 తేదీలు ఇబ్బందులు ఏర్పరచును.

అక్టోబర్ 2018 కుంభరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో సమస్యలు తగ్గును. శత్రువులు సయితం మిత్రులుగా మారుటకు గ్రహ సూచనలు కలవు. గృహ నిర్మాణం చేయువారికి లేదా గృహ సంబంధ ఋణములు పొందుటకు ప్రతికూల కాలం. ధనాదాయం బాగుండును. నూతన ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు కలసివచ్చును. తృతీయ వారంలో స్థాయి తక్కువ వ్యక్తులతో పరిచయాలు, తన్మూలక సమస్యలు. చివరి వారంలో సామాన్య ఫలితాలు.

నవంబర్ 2018 కుంభరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో చేపట్టిన పనులు క్రమంగా సఫలమగును. ఆర్ధికంగా కలసివచ్చును. భూ సంబంధ క్రయ విక్రయాలు కలసివచ్చును. ప్రధమ వారంలో ఒక శుభవార్త. మానసిక ప్రశాంతత. కుటుంబ సభ్యుల వలన సౌఖ్యం. వైవాహిక జీవనంలో సమస్యలు తగ్గును. ఆర్ధిక సంబంధ ప్రయత్నాలు ఫలవంతం అగును. ద్వితీయ తృతీయ వారాలు సామాన్య ఫలితాలు ఏర్పరచును. చివరి వారంలో అనారోగ్యములక ధనవ్యయం. ఈ మాసంలో 6,7,10,11,20,22 తేదీలు అనుకూలమైనవి.

డిసెంబర్ 2018 కుంభరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసం ప్రారంభంలో ధనాదాయం సామాన్యం. విదేశీ ప్రయాణాలు, దూర ప్రాంత సంచారం, గౌరవం తిరిగి పొందుట, అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం, స్నేహలాభాలు వంటి ఫలితాలు ఏర్పడును. వైవాహిక జీవనంలో కొద్దిపాటి తగవులు. అన్యవ్యక్తులతో పరిచయాలు. కోర్టు తగాదాలు. తృతీయ , చతుర్ధ వారాలలో చేపట్టిన పనులలో కార్య జయం. నూతన ఆదాయ మార్గాల లభ్యత. మాసాంతంలో నూతన వస్తు లాభాలు.

జనవరి 2019 కుంభరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో కూడా చక్కటి ఫలితాలు కొనసాగును. నూతన వ్యాపార వ్యవహారాలకు , ఉద్యోగ ప్రయత్నాలకు ఈ మాసం చక్కటి కాలం. ఎత్తైన ప్రాంతాలు, కొండ మార్గాలలో సంచరించునపుడు జాగ్రత్తగా ఉండవలెను. విదేశే ఉద్యోగ ప్రయత్నాలు చేయువారికి కోర్కెలు నెరవేరును. కీర్తి ప్రతిష్టలు లభించును.

ఫిబ్రవరి 2019 కుంభరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసం పితృ వర్గీయులకు మంచిది కాదు. ఆకస్మిక సమస్యలు లేదా కష్ట నష్టములు కలుగు సూచన. ఆదాయం తగ్గును. స్నేహితులతో విరోధాలు లేదా వారి వలన వ్యక్తిగత నష్టాలు. ఆరోగ్య సమస్యలు కలిగిన వారికి ఈ మాసంలో వ్యాధి తీవ్రత అధికం. వ్యక్తిగత జీవనం బాగుండదు. ఈ మాసంలో 1,5,6,12,19,29 తేదీలు అనుకూలమైనవి కావు.

మార్చి 2019 కుంభరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో స్తంభించిన కార్యములు పునః ప్రారంభం అగును. పట్టుదలతో వ్యవహారాలలో విజయం. ధనాదాయం బాగుండును. కుటుంబ శ్రేయస్సుకై శ్రమించెదరు. అవకాశములను సద్వినియోగం చేసుకొందురు. సంపద వ్రుద్ధి చెందును. మాసాంతంలో కీర్తి ప్రతిష్టలు పెరుగును. కాలం అనుకూలంగా ఉండును. అన్ని విధమైన విఘ్నాలు తొలగును.