శ్రీ విళంబి నామ సంవత్సర మీన రాశి ఫలితాలు

0శ్రీ విళంబి నామ సంవత్సర మీన రాశి ఫలితాలు

  • పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదములు, రేవతి 1,2,3,4 పాదములలో జన్మించిన వారు మీన రాశికి చెందును.
  • శ్రీ విళంబి నామ సంవత్సరంలో మీన రాశి వారికి ఆదాయం – 05 వ్యయం – 05 రాజపూజ్యం – 03 అవమానం – 01

మీనరాశి వారికి శ్రీ విళంబి నామ సంవత్సరం అధిక శాతం శుభ ఫలితాలు కలుగచేయును. ముఖ్యంగా ద్వితియార్ధం అధికమైన లాభాలను కలుగచేయును. ఉద్యోగ అన్వేషణలో వున్నవారు చక్కటి ఉద్యోగాన్ని పొందేదురు. సంతానం యొక్క స్థిరత్వంలో సమస్యలు కలుగును. చేపట్టిన ప్రయత్నములు కష్టంతో ప్రారంభం ఇయినా అనుకూలమైన దిశలో పయనించి ఫలవంతంగా ముగియును.

శ్రీ విళంబి నామ సంవత్సరం లో మీనరాశి వారు గురుగ్రహం వలన 10-అక్టోబర్-2018 వరకూ అననుకూల ఫలితాలు, 11-అక్టోబర్-2018 తదుపరి అత్యంత చక్కటి ఫలితాలను పొందును. విశేషమైన భూ లేదా గృహ సంపదను కలుగచేయును. వారసత్వం వలన, స్వార్జితం వలన కలసివచ్చును. శ్రీ విళంబి నామ సంవత్సరంలో శని మీనరాసి వారికి సంవత్సరం అంతా మంచి చేయును. విశేష ధనార్జన ఇచ్చువాడు అగును. కానీ ఆర్ధిక విషయాలలో లోభత్వం ప్రదర్శించు పరిస్థితులు కలుగచేయును.

మీనా రాశి వారికి రాహు – కేతువులు ఇరువురు ఆర్ధికంగా, ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉండును. ఆయుర్భాగ్యములు సంపూర్ణంగా ఇచ్చును. కానీ రాహువు వలన సంతాన సంబంధిత విషయాలలో నష్టం లేదా సంతానం మీ అభీష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించునట్టు చేయును. సంతానం వలన ప్రశాంతత వుండదు.

మార్చి 2018 మీనరాశి ఫలితాలు:

ఈ మాసంలో ఆరోగ్య సమస్యలు కొనసాగును. ఆశించిన స్థాయిలో కుటుంబం నుండి సహకారం ఉండదు. భాత్రువర్గం వారితో విరోధములు. స్థాన చలనం. మానసిక చాంచల్యత. 17, 18 తేదీలలో వాహన ప్రమాద సూచన. 20 వ తేదీ తదుపరి వృత్తి ఉద్యోగ వ్యపారాదులలో జయం. సౌకర్యం. అన్నివిధములా పరిస్థితులు అనుకూలంగా ఉండును.

మే 2018 మీనరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసం ప్రారంభంలో ధన వ్యయం అధికం. మానసిక అశాంతి. బంధువులతో వివాదం. ధన నష్టం వలన బాధ. ఋణాలు ఏర్పడు సూచన. అవిశ్రాంత శ్రమ. కొత్త విషయాలు అవగతమగును. తృతీయ వారంలో కర్యానుకులత. పనులు సకాలంలో పూర్తి అగును. ఉన్నతికి కారణమగు సంఘటనలు. వ్యాపార వ్యవహారములలో లాభములు. వ్యక్తిగత జీవనంలో సౌఖ్యత. మాసాంతానికి ఖర్చులు అదుపులోకి వచ్చును.

జూన్ 2018 మీనరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో సంతానానికి సంబందించిన సమస్యలు పరిష్కారమగును. ఆర్ధిక పరమైన ఇబ్బందులు తొలగును. రావలసిన ధనం చేతికి వచ్చును. బంధు వర్గంతో సమస్యలు తొలగును. విద్యార్ధులకు విజయవంతమైన కాలం. నూతన బాధ్యతలు ఏర్పడును. గృహంలో ఆనందకరమైన కాలం. నూతన ఆదాయ మార్గాలున్నాయి. ఉద్యోగ జీవనంలో ప్రోత్సాహకర వాతావరణం. 22 నుండి 26 తేదీల మధ్య వృధా వ్యయం ఏర్పడు సూచన. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. వాహన చోదన విషయాలలో జాగ్రత్త అవసరం.

జూలై 2018 మీనరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో ఆరోగ్య విషయాలు మినహా అన్ని విధాల అనుకూలత ఏర్పడును. వ్యాపార వ్యవహారాలు, ఉద్యోగ అన్వేషణ, అవివాహితుల వివాహ ప్రయత్నాలు విజయాన్ని ఇచ్చును. మీ పట్ల గౌరవ అభిమానాలు పెరుగును. పుణ్య క్షేత్ర సందర్శన. ఆదాయం పెరుగును. ఆప్తుల సమాగమనం. అనుకున్న రీతిలో పనులు కొనసాగును. నూతన ఆలోచనలు కలసివచ్చును.

ఆగష్టు 2018 మీనరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసం కూడా అనుకూలమైన ఫలితాలను ఇచ్చును. గృహ సంబంధ సంతోషాలు. ఆశించిన కోర్కెలు సిద్ధించును. ఆదాయం బాగుండును. ఉద్యోగ ఉన్నతి లేదా విదేశీ ఉద్యోగ ప్రయత్నాలకు విజయం. కృషి ఫలించును. 15 నుండి 25 వ తేదీ మధ్యకాలంలో పనులు అనుకున్న రీతిలో ముందుకు సాగవు. 25 వ తేదీ తదుపరి మానసికంగా తెలికపడుదురు. కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ అవసరం. ఈ మాసంలో 18,19,20 తేదీలు అనుకూలమైనవి కావు.

సెప్టెంబర్ 2018 మీనరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో సమస్యలు కలుగును. శ్రీ సుబ్రమణ్య ఆరాధన మంచిది. వ్యాపార ఉద్యోగ జీవనాలు అంత అనుకూలంగా ఉండవు. కుటుంబ సభ్యుల వలన మానఃస్థాపం. ధనం సమస్యగా మారును. కష్టంకు తగిన ఫలితం ఉండదు. పనులు వాయిదా పడుచుండును. నూతన పరిచయాలతో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం కూడా అంతగా సహకరించదు. నూతన ఆలోచనలు చేయుట, ఆర్ధికంగా పెట్టుబడులు పెట్టుట మంచిది కాదు. ఉద్యోగ జీవనంలో ఒత్తిడి, నూతన అవకాశములు చేజారుట వంటి సంఘటనలు.

అక్టోబర్ 2018 మీనరాశి రాశీ ఫలితాలు:

మీ మాసం ప్రధమ వారం అంత అనుకూలమైనది కాదు. చేపట్టిన పనులలో ఆటంకములు, అనుకోని విరోధాలు, మానసిక అశాంతి. 8 వ తేదీ తదుపరి కొంత అనుకూలత. ఆదాయం సామాన్యం. పనులలో వేగం. అధికారుల వలన ఏర్పడుతున్న సమస్యలు తొలగును. సంతాన సంబంధ విషయాలలో విజయం. తృతీయ వారంలో ప్రయాణాలు. అయినవారిని కలుసుకుంటారు. ఉన్నత విద్యాప్రవేశం. ఈ మాసంలో 5,6 తేదీలు అనుకూలమైనవి కావు.

నవంబర్ 2018 మీనరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు. తెలిసిన వ్యక్తుల వలన లేదా నమ్మకస్తుల వలన ఒక నష్టం. మైత్రీ సంబంధ వ్యవహారాలలో అపజయం. వ్యాపార వ్యవహారాలు సామాన్యం. ఉద్యోగ జీవనంలోని వారికి నూతన బాధ్యతలు. స్త్రీలకు గౌరవ హాని. పనులు చాలా ఆలస్యంగా పూర్తి చేయుదురు. హామీలు నేరవేర్చలేరు. ఆదాయ వ్యయాలు అదుపులో ఉండవు. ఇతరుల జోక్యం వలన చికాకులు. చివరి వారంలో జూదం వలన లేదా అనారోగ్యం వలన ధన వ్యయం.

డిసెంబర్ 2018 మీనరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో సమస్యలు కొనసాగును. కుటుంబంలో అసంతృప్తి. చేపట్టిన పనులలో ఆటంకముల తదుపరి విజయం. పితృ అనారోగ్యం. వ్యాపారులకు మాత్రం నిరుత్సాహం. ఏ విధంగానూ ఆశించిన సహకారం పొందలేరు. వ్యాపారంలో ఖర్చులు అధికం అగును. జీవిత భాగస్వామితో కలహాలు. ఈ మాసంలో 10,11,13.20,22 మరియు 29 తేదీలు అనుకూలమైనవి కావు.

జనవరి 2019 మీనరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో వ్యవహారములు అనుకూలంగా నడచును. విజయాలు పొందుదురు. మీ మీ రంగాలలో చక్కటి గుర్తింపు ఏర్పడును. నూతన స్నేహ వర్గాలు ఏర్పడును. సంబంధాలు విస్తరిస్తాయి. ఇతరులకు మీరు సలహాలు ఇవ్వవలసిన పరిస్టితులు. ద్వితీయ తృతీయ వారాలలో చిన్నపాటి అనారోగ్యం. విదేశీ జీవన ప్రయాణాలు ఫలిస్తాయి. ఈ మాసంలో నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు శుభకరం.

ఫిబ్రవరి 2019 మీనరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో విదేశీ ప్రయాణ ప్రయత్నాలు, స్థానచలన ప్రయత్నాలు, ఉద్యోగ మార్పు ప్రయత్నాలు, నిరుద్యోగుల ఉద్యోగ అన్వేషణ ప్రయత్నాలు ఫలించును. ధనాదాయం బాగుండును. ప్రొత్సాహపూరిత కాలం. సంతోషకరమైన సమాచారం. కుటుంబంలో శుభకార్యాలు. నూతన వస్తు లాభములు. వ్యక్తిగత జీవనంలో సుఖం. ప్రణాళికాబద్ధమైన జీవనం. ధనయోగాలు. విద్యాసంబంధ ప్రయత్నాలు విజయం పొందును.

మార్చి 2019 మీనరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఆరోగ్య సమస్యలు తగ్గును. ఈ మాసంలో పట్టుదల వహించకూడదు. వివాహ ప్రయత్నాలలో ఆశాభంగములు. ద్వితీయ వారంలో సన్నిహిత వర్గాలతో సమస్యలు. మనసుకు కష్టం. తృతీయ చతుర్ధ వారాలలో నూతన పనులు, కార్యోన్ముఖత. సువర్ణ సంబంధ లాభాలు. ఈ మాసంలో 9, 10 ,11 తేదీలు అనుకూలమైనవి కావు.