శ్రీ విళంబి నామ సంవత్సర మిధునరాశి రాశి ఫలితాలు

0శ్రీ విళంబి నామ సంవత్సర మిధునరాశి రాశి ఫలితాలు

  • మృగశిర 3 , 4 పాదములు , ఆరుద్ర 1,2,3,4 పాదములు, పునర్వసు 1,2,3 పాదములలో జన్మించిన వారు మిధున రాశికి చెందును.
  • శ్రీ విళంబ నామ సంవత్సరంలో మిధునరాశి వారికి ఆదాయం – 14 వ్యయం – 02 రాజపూజ్యం – 04 అవమానం – 03

శ్రీ విళంబి నామ సంవత్సరంలో మిధున రాశి వారు కొద్దిపాటి అసంతృప్తిని ఎదుర్కొందురు. ఆశించిన విజయాలు పూర్తిగా నెరవేరుట కష్టం.ధనాదాయంలో హెచ్చుతగ్గులు ఏర్పడుచుండును. మీ మీ సొంత జాతకంలోని గ్రహ బలాలపై ఈ సంవత్సరం ఆదాయం ఆధారపడును.ధనవ్యయం అధికమగును. సంవత్సరం మధ్య భాగం నుండి కొంత అనుకూలత ప్రారంభం అగును. చేపట్టిన నూతన పనులు లాభించును. దూర ప్రాంత నివాశ ప్రయత్నాలు , ఉద్యోగ అన్వేషణ ఫలించును.వివాహ ప్రయత్నములు ఈ సంవత్సరం కష్టం మీద ఫలించును. ఉద్యోగ జీవులకు సామాన్య ఫలితాలు. వ్యాపార రంగంలోని వారికి అంత అనుకూలత లేదు.పోటీదారులు పెరుగును. యువకులకు వాహన సంబంధ ప్రమాదాలు లేదా సమస్యలు. జాగ్రత్త అవసరం. పెద్ద వయస్సు వారికి మూత్ర సంబంధ సమస్యలు, ధన వ్యయ సూచన. కాళారంగంలోనివారికి మంచి గుర్తింపు. వైద్య రంగంలోనివారికి అనుకూలమైన కాలం.వ్యవసాయ దారులకు మిశ్రమ పంటలు కలసి వచ్చును. విద్యార్ధులకు జయం.

మిధున రాశి వారు శ్రీ విళంబి నామ సంవత్సరంలో గురు గ్రహం వలన సంవత్సరం అంతా కొద్దిపాటి అనుకూలమైన ఫలితాలనే పొందుదురు. భూ సంబంధ లేదా గృహ సంబంధ వ్యాపారములు చేయువారికి విశేష లాభం. సంతాన ప్రయత్నములు చేయువారికి చక్కటి పుత్ర సంతాన సూచన.11 – అక్టోబర్ -2018 తదుపరి జీవిత భాగస్వామికి మధ్య మధ్య ఆరోగ్య సమస్యలు.

శ్రీ విళంబి నామ సంవత్సరంలో మిధున రాశి వారు శని గ్రహం వలన వైవాహిక జీవనంలో అపసవ్యతలు ఎదుర్కొనుటకు సూచనలు అధికం. జీవిత భాగస్వామితో తగాదాలు లేదా అవిధేయత ఏర్పడును.పునర్భూ వివాహ ప్రయత్నాలు మాత్రం చక్కగా ఫలించును. ప్రేమ వ్యవహారములలో ఉన్నవారు కష్టాలు ఎదుర్కొండురు. ఆర్ధికంగా శని పెద్దగ ఇబ్బందులు కలుగచేయాడు.

శ్రీ విళంబి నామ సంవత్సరంలో మిధున రాశి వారికి రాహువు కలసిరాడు. ఆర్ధిక సమస్యలు, ఋణములు కలుగచేయును. ఆరోగ్య భంగములు, ప్రమాదాలు ఏర్పరచును. కేతువు ఈ రాశి వారికి పూర్వీకుల సంబంధమైన స్థిరాస్తిని పొందుటకు సహకరించును.

మార్చి 2018 మిధున రాశి ఫలితాలు:

ఈ మాసంలో ఆత్మీయులకు సంబంధించిన ఆందోళన. ఆదాయం బాగుండును. ధన సమస్యలు తొలగును. ద్వితియ మరియు తృతీయ వారాలలో ఉత్తమ ఫలితాలు. జీవన ప్రమాణాలు పెరుగును. జీవిత భాగస్వామి తోడ్పాటు. మానసిక ప్రశాంతత. పుత్ర పౌత్రాభివృద్ధి. సువర్ణ లాభములు.

ఏప్రిల్ 2018 మిధున రాశి ఫలితాలు:

ఈ మాసంలో సంతాన సంబంధ ప్రయత్నాలు లాభించును. ధనాదాయం సామాన్యం. గృహంలో బంధు కలయిక. సంతోష కార్యములు. ద్వితీయ వారంలో ఉద్యోగస్తులకు విధుల్లో చికాకులు. వ్యాపార రంగంలోని వారికి దూర ప్రాంత ప్రయాణాలు లాభం కలుగచేయును. తృతీయ వారం నుండి పనిలో ఉత్సాహం. కెరీర్ పరంగా నూతన అవకాశాలు. అవివాహితులకు వివాహ సూచనలు. చివరి వారం ప్రయత్నాలుకు , అధికారులను కలువుటకు, మధ్యవర్తిత్వానికి అనుకూలం.

మే 2018 మిధున రాశి ఫలితాలు:

ఈ మాసం కళాకారులకు మంచి ప్రోత్సాహవంతమైన కాలం. ధన వ్యయం కొంచెం పెరుగును. సంతాన లేమి దంపతుల సంతాన ప్రయత్నములు ఫలించును. గృహంలో ఒక ఆందోళన. ఎదురుచూస్తున్న సమాచారంలో నిరాశ. 10 నుండి 16 వ తేదీల మధ్య కాలంలో సొంత వాహన ప్రయత్నాలు లాభించును. ఉద్యోగులకు పురస్కారాలు. 25,26,27 తేదీలలో చిన్న అనారోగ్యం. 20.21 వ తేదీలు మైత్రీ సంబంధ వ్యవహారాలకు అనుకూలం.

జూన్ 2018 మిధున రాశి ఫలితాలు:

ఈ మాసంలో ఆకస్మిక వివాదం లేదా తగవుల వలన ఆశాంతి. తక్కువ స్థాయి వ్యక్తులతో పరిచయాలు. తన్ములక బాధలు. ధనాదాయం సామాన్యం. 16 వ తేదీ తదుపరి అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం. వ్యాపారులకు ఆర్ధిక లావాదేవీలకు ఆశాజనకంగా ఉండును. రాజకీయ వర్గముల వారికి పురోగతి. 28,29,30 తేదీలలో కొద్దిపాటి వ్యయ ప్రయాసలు. ఒత్తిడితో కూడిన వాతావరణం. అజమాయిషీ చేయుట వలన నష్టములు. ఇతరులకు సంబంధించిన కార్యములందు ఈ రాశి వారు పెద్దరికం వహించకుండా ఉండుట మంచిది.

జూలై 2018 మిధున రాశి ఫలితాలు:

ఈ మాసం ప్రధమ, ద్వితీయ వారాలలో మానసిక చికాకులు. వ్యక్తిగత జీవితం కూడా అంతగా బాగోదు. ఊహించని సంఘటనలు. వ్యాపార వ్యవహారాలు ఆటంకములతో కొనసాగును. ధనాదాయం సామాన్యం. స్నేహితులతో విరోధాలు. అభిప్రాయాలూ కలవవు. ఆలోచనలు కలసిరావు. విద్యార్ధులు, నిరుద్యోగుల కృషి అంతగా ఫలించవు. తృతీయ వారం నుండి స్వల్ప ధనలాభం. వ్యాపార వ్యవహారములు సామాన్యం. ప్రయాణాల్లో ఆటంకాలు. చివరి వారంలో శుభవార్తలు. ఆశించిన ప్రశాంతత.

ఆగష్టు 2018 మిధున రాశి ఫలితాలు:

ఈ మాసంలో నూతన ఆదాయ ప్రయత్నాలు లేదా విదేశీ ఆదాయ ప్రయత్నాలు ఫలించును. చేపట్టిన వ్యవహారములండు విజయం. వ్యక్తిగత జీవితంలో సమస్యలు కొనసాగును. ధనాదాయం బాగుండును. పితృ వర్గం వారి వలన లాభాలు. స్థాన చలన ప్రయత్నాలు లాభించును. ఆరోగ్య విషయాలపై శ్రద్ధ అవసరం. మాస మధ్యమం నుండి గృహ నిర్మాణ ప్రయత్నాలు ముందుకు సాగవు. విడిపోయిన బంధువుల వలన అపఖ్యాతి లేదా వారిచే గౌరవ హాని.

సెప్టెంబర్ 2018 మిధున రాశి ఫలితాలు:

ఈ మాసంలో మనోవంచ్చా ఫలసిద్ధి. సంతాన సౌక్యం. వాహన యోగం. ధనాదాయం బాగుండును. వ్యపార వ్యవహారములందు విజయం. నూతన ప్రయత్నాలు లాభించును. బంధు వర్గం వలన కొద్దిపాటి సమస్యలు. 10 నుండి 15 వ తేదీ మధ్య పనిభారం అధికం అగును. అనవసర విషయాలకై సమయం వృధా. తృతీయ వారంలో జీవితంలో ఒక ప్రధానమైన మార్పు ఏర్పడు గ్రహ సూచన. ఈ మాసంలో 19,20 తేదీలలో అననుకులత.

అక్టోబర్ 2018 మిధున రాశి ఫలితాలు:

ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. వ్యక్తిగత జీవితంలో సంతోషం బాగుండును. వ్యాపారులకు, ఉద్యోగ జీవనంలోని వారికి ఆఖస్మిక సమస్యలు. ఆస్తి వ్యవహారాలలో చికాకులు. కుటుంబ సభ్యుల సహకారం సమయానికి అందును. 18 వ తేదీ తదుపరి ఆర్ధిక విషయాలలో ఒడిదుడుకులు తొలగును. వివాహ ప్రయత్నాలు, ఉద్యోగ మార్పిడి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. భాగస్వామ్య వ్యవహారాలు మాత్రం కలసిరావు. చివరి వారంలో ఆదాయంలో పెరుగుదల. గత అనుభవాల వలన సమస్యల నుండి తప్పించుకొండురు.

నవంబర్ 2018 మిధున రాశి ఫలితాలు:

ఈ మాసంలో దీర్ఘకాలం నుండి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఉపశమనం. పట్టుదలతో వ్యవహర విజయం. గృహంలో సంతోష కార్యములు. సంతాన సౌఖ్యం. ధనాదాయం బాగుండును. స్త్రీలకు ఆశించిన ఫలితాలు. శత్రు ఓటమి. కోర్టు వ్యవహారాలు అనుకూలత. వ్యాపారాలకు కలసివచ్చును. ఉద్యోగులకు సామాన్య ఫలితాలు. కార్య సిద్ధి. కొత్త ప్రాజెక్టులు పొందేదురు. ఈ మాసంలో ద్వితీయ వారం అనుకూలమైనది.

డిసెంబర్ 2018 మిధున రాశి ఫలితాలు:

ఈ మాసం కూడా ప్రారంభంలో చక్కటి ఫలితాలు ఇచ్చును. గౌరవ మర్యాదలు పెరుగును. వ్యవహారాలు విజయవంతము అగును. కర్ణ సంబంధ సమస్య. స్నేహితుల వలన లాభించును. తృతీయ వారం నుండి ధన వ్యయం కొద్దిగా అధికం అగును. ఆరోగ్యం కొంత సమస్యాత్మకంగా ఉండును. వ్యాపారాలు అంతగా కలసి రావు. ఉద్యోగస్తులకు విమర్శలు, కొద్దిపాటి ఒత్తిడితో కూడిన కాలం. అవిశ్రాంతంగా పనిచేయవలసి వచ్చును. మాసాంతంలో దూర ప్రయాణాలు, శారీరక విశ్రాంతి. ఈ మాసంలో 12,13,15 మరియు 17 తేదీలు అనుకూలమైనవి కావు.

జనవరి 2019 మిధున రాశి ఫలితాలు:

ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. పనులలో సామాన్య ఫలితాలు. అనవసర సమస్యలు. చికాకులు. ధన పరమైన ఒత్తిడులు. ఆలోచనలలో అస్థిరిత. ఉద్యోగ జీవనంలో ఆఖస్మిక మార్పులు. ప్రయాణాలలో జాగ్రత్త మరియు సమయ పాలన అవసరం. కుటుంబ సహాయం. కర్షక వర్గానికి శ్రమధిక ఫలం. 20 వ తేదీ తదుపరి పరిస్థితులలో మెరుగుదల. చురుకైన పాత్ర వలన గుర్తింపు.

ఫిబ్రవరి 2019 మిధున రాశి ఫలితాలు:

ఈ మాసం అంత ప్రోత్సాహకరమైన కాలం కాదు. ఆరోగ్య పరంగా లేదా మానసిక ఆందోళన వలన స్తబ్ధత. కుటుంబ సభ్యుల వలన తగాదాలు. ఆదాయంలో తగ్గుదల. ఊహించని విధంగా ఆర్ధిక వ్యయం. విధి నిర్వహణలో సమస్యలు.

మార్చ్ 2019 మిధున రాశి ఫలితాలు:

ఈ మాసంలో ఆర్ధిక భారం నుండి కొద్దిపాటి ఉపశమనం. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి అగును. విద్యార్ధులకు మంచి కాలం. వాహనాల విషయమై ఖర్చులు. ఉద్యోగులకు ఆశాభంగం. తృతీయ , చతుర్ధ వారాలలో వృధా వ్యయం. శ్రమ అధికం అగును. సన్నిహితులకు లేదా జీవిత భాగస్వామికి దూరంగా ఉండవలసి వచ్చుట. చెడు కలలు. ఈ మాసంలో 4,7,13,18,29 తేదీలు మంచివి కావు. జాగ్రత్త అవసరం.