శ్రీ విళంబి నామ సంవత్సర సింహరాశి రాశి ఫలితాలు

0శ్రీ విళంబి నామ సంవత్సర సింహరాశి రాశి ఫలితాలు

  • మఘ 1,2,3,4 పాదములు , పుబ్బ 1,2,3,4, పాదములు , ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందును.
  • శ్రీ విళంబ నామ సంవత్సరంలో సింహ రాశి వారి ఆదాయం – 11 వ్యయం – 11 రాజపూజ్యం – 03 అవమానం – 06

శ్రీ విళంబి నామ సంవత్సరం సింహ రాశి వారికి అంత అనుకూలంగా వుండదు. తలపెట్టిన ప్రయత్నాలు విజయవంతము అగుట కష్టం. వ్యాపార వ్యవహారాలు సామాన్యంగా ఉండును. నూతన వ్యాపారములు లాభించవు. వివాహ ప్రయత్నాలు అనుకూలమైన ఫలితాలను ఇచ్చును. అవసరములకు ధనం సర్దుబాటు జరుగుటలో ఇబ్బందులు ఏర్పడును. ఆర్ధికంగా ఋణములు చేయుదురు. మాటగౌరవంతో వ్యవహారాలు కొనసాగును. ఉద్యోగ జీవనం వారికి సామాన్య ఫలితాలు. పదోన్నతులకు అనువైన సమయం కాదు. విద్యార్ధులు శ్రమించవలెను. వ్యవసాయం మిశ్రమ ఫలితాలు కలిగించును. సంతాన ప్రయత్నాలు చేయువారికి దైవ ఆశీస్సులు అవసరం.

సింహ రాశి వారికి శ్రీ విళంబి నామ సంవత్సరంలో గురు గ్రహం వలన 10-అక్టోబర్-౨౦౧౮ వరకూ అనుకూలమైన ఫలితాలు పొందలేరు. సోదర సోదరీ వర్గం వలన సమస్యలు ఎదుర్కొందురు. 11-అక్టోబర్-2018 తదుపరి భూ లేదా గృహసంబంధ భాగ్యం పొందేదురు. దంపతుల సంతాన ప్రయత్నాలు ఫలించుట కష్టం. శనికి శాంతులు అవసరం.

రాహు – కేతువులు ఇరువురు సింహరాశి వారికి అనుకూల ఫలితాలు ఇవ్వరు. పిత్రార్జితం లేదా వారసత్వ సంపద వ్యయమగు పరిస్థితులు కలుగచేయును.

మార్చి 2018 సింహ రాశి ఫలితాలు:

ఈ మాసం బాగుండును. ధనాదాయం పెరుగును. వృత్తి ఉద్యోగ వ్యపారాదులలో ప్రోత్సాహం. పై అధికారుల వలన కొద్దిగా అశాంతి. కీళ్ళ సంబంధమైన అనారోగ్యం. కానీ ప్రమాదం ఉండదు. వ్యాపార విస్తరణకు మంచి సమయం. వ్యవహారములు సానుకూలంగా పూర్తి అగును. గృహంలో ఆకస్మిక శుభకార్యములు. ఆధిపత్య పోరు కొంత బాధించును.

ఏప్రిల్ 2018 సింహరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో అనారోగ్య సమస్యలు తొలగును. నూతన వ్యవహారాలు, ఆలోచనలు , చేపట్టిన కార్యములు విజయవంతం అగును. వివాహ ప్రయత్నాలు ఫలించును. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేయుటకు మంచి కాలం. ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది. గృహంలో మార్పులు. వ్యాపార వర్గములకు ఆశించిన ఆదాయం. 7 నుండి 15 వ తేదీల మధ్య వివాదాలు, అనుకోని ఖర్చులు.

మే 2018 సింహరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో కూడా అనుకూల ఫలితాలు ఏర్పడును. రావలసిన ధనం చేతికి వచ్చును. వివాదాలు తొలగును. ధనాదాయం బాగుండును. రాబడి పెరుగును. శుభాకర్యములలో పాల్గోనుడురు. నిరుద్యోగులకు సంతోషకరమైన సమాచారం. చివరి వారంలో వృధా ప్రసంగాలు. అలవాట్లలో మార్పులు ఏర్పడును. ఈ మాసంలో 5,26,27 తేదీలలో ఆర్ధిక సంబంధ విషయాలలో జాగ్రత్త అవసరం.

జూన్ 2018 సింహరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో కూడా ధనాదాయం బాగుండును. ఉద్యోగులకు, వ్యాపారస్థులకు సానుకూలమైన ఫలితాలు. పరిచయాలు పెరుగును. వ్యక్తిగత ఆనందాలను త్యాగం చేయవలసివచ్చును. ఎంతో కాలం నుండి కోరుకుంటున్న మార్పులు ఈ మాసంలో ఏర్పడును. చివరి వారంలో కుటుంబంలో చిన్న తగాదా లేదా ఒక అననుకూలత.

జూలై 2018 సింహరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో చేయు ప్రయాణాలు కలసివచ్చును. ఆనందకరంగా ముగియును. వ్యాపారాలు సామాన్యం. ధనం సమకూరును. పనులు సకాలంలో పూర్తి అగును. గౌరవ మర్యాదలు పెరుగును. నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభించును. ద్వితీయ వారంలో వృధా శ్రమ. తిరిగి 24వ తేదీ తదుపరి ప్రోత్సాహవంతంగా ఉండును. ముఖ్య నిర్ణయాలు తీసుకొనుటకు అనువైన కాలం. ఈ మాసంలో 10, 13, 14 తేదీలు అనుకూలమైనవి కావు.

ఆగష్టు 2018 సింహరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో ఆదాయం సామాన్యం. కుటుంబంలో పోయిన సఖ్యత , అనుబంధాలు తిరిగి స్థిరపడును. నూతన పరిచయాలు లాభించును. ఉద్యోగులకు లాభపూరిత కాలం. వ్రుద్ధి. నూతన అవకాశములు. మాసాంతానికి నిర్దేసించుకున్న పరిధిని మించి ఖర్చులు. వ్యక్తిగత జీవనలో సంతోషములు. సంతాన ప్రయత్నాలు ఫలించును.

సెప్టెంబర్ 2018 సింహరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసం అంత అనుకూలమైన కాలం కాదు. వ్యాపారములందు , విదేశే వ్యవహారములండు తీవ్రమైన నష్టం. పితృ వర్గం వారితో విబేధాలు. స్థిరాస్థి వ్యవహారాలలో పెట్టుబడులు నష్టపరుచును. ఉదరకోశ వ్యాదులు ఉన్న వారికి ప్రమాదం. 16 వ తేదీ తదుపరి ఆర్ధిక విషయాలలో పురోగతి. శుభకార్యములకు ఆహ్వానములు. దాన ధర్మములకు వ్యయం. నూతన వస్తువుల చేరిక.

అక్టోబర్ 2018 సింహరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు. ధనాదాయం సామాన్యం. ఖర్చులకు తగినంతగా రాబడి వుండదు. ఉద్యోగులకు కెరీర్ పరంగా కొత్త అవకాశములు లభించును. గృహ సంబంధ విషయాలకై తిరగవలసి వచ్చు సూచన. ఈ మాసంలో 2,9,14,17,22, 29 తేదీలు అంత అనుకూలమైనవి కావు.

నవంబర్ 2018 సింహరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో ఆర్ధికంగా బాగుండును. పట్టుదలతో కూడిన కార్యసిద్ధి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అగుట, నూతన పనులు ప్రారంభించుట జరుగును. స్త్రే సంబంధ వ్యవహారాల వలన అపఖ్యాతి. జీవిత భాగస్వామి తరపు బంధువులతో విరోధాలు. దీర్ఘకాలిక రుగ్మతల వలన ధన వ్యయం. నూతన ఒప్పందాలు లాభించవు. మాసాంతానికి వ్యక్తిగత పరిస్థితులలో కొద్దిపాటి అనుకూలత.

డిసెంబర్ 2018 సింహరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో చికాకులు క్రమంగా తొలగి పరిస్థితులు మెరుగు అగును. ఇతరులను ఆకర్షించేడురు. వివాదాలు పరిష్కారం అగును. వ్యాపారాలు ఆశాజనకంగా ఉండును. పారిశ్రామిక వేత్తలకు చక్కటి వ్రుద్ధి. గృహంలో సంతోషాలు. పరిస్థితులు లాభసాటిగా ఉండును. కుటుంబ అవసరాలకొరకు శ్రమ. బహుమతులు గెలుచుకోనుటకు అవకాశం. ఉద్యోగ జీవనంలో అదనపు బాధ్యతలు.

జనవరి 2019 సింహరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసం అనుకూలమైన ఫలితాలు ఇచ్చును. గౌరవ ప్రధమైన జీవనం. నూతన ఆదాయ మార్గాలు. ద్వితీయ తృతీయ వారాలలో ఆఖస్మిక కుటుంబ పరమైన ప్రయాణాలు. ప్రయనములందు చికాకులు. ధనాదాయంలో పెరుగుదల. మానసిక శ్రమ అధికం. ఈ మాసంలో 22 నుండి 29 తేదీల మధ్య కాలంలో వ్యక్తిగత జీవన సంతోషాలు.

ఫిబ్రవరి 2019 సింహరాశి రాశీ ఫలితాలు:

పనులు నెమ్మదిస్తాయి. ఆర్ధికంగా కొంత అభద్రతా భావం. కుటుంబ సహకారం. వ్యపార వ్యవహారములు సామాన్యం. విదేశీ పర్యటనలు లేదా దురాక్షేత్ర సందర్శన. భాగస్వామ్య వ్యాపారాలు లాభించును. కొత్త ఆలోచనలు గుర్తింపునిచ్చును. సృజనాత్మకత ఉపయోగపడును. సంతాన విషయాలు కొద్దిపాటి ఆందోళన కలిగించును.

మార్చి 2019 సింహరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసం ప్రధమార్ధం ఆహ్లాదకరంగా ఉండును. వ్యక్తిగత జీవనంలో సౌఖ్యం. ద్వితియార్ధంలో ఉద్యోగస్తులకు చేతినిండా పని. అవిశ్రాంతంగా పని చేయవలసిన పరిస్టితులు. పనిపై శ్రద్ధాసక్తులు లోపించును. శ్రమకు గుర్తింపు ఉండదు. ధనాదాయం సామాన్యం. ఆదాయ మార్పిడి ప్రయత్నాలు విఫలం అగును. సహోద్యోగుల వలన సమస్యలు. ఈ మాసంలో 18,19,20 తేదీలు అనుకూలమైనవి కావు.