శ్రీ విళంబి నామ సంవత్సర తులా రాశి ఫలితాలు

0శ్రీ విళంబి నామ సంవత్సర తులారాశి రాశీ ఫలితాలు

  • చిత్త 3,4 పాదములు, స్వాతి 1,2,3,4 పాదములు , విశాఖ 1,2,3 పాదములులో జన్మించినవారు తులా రాశికి చెందును.
  • శ్రీ విళంబి నామ సంవత్సరంలో తులా రాశి వారికి ఆదాయం – 11 వ్యయం – 05 రాజపూజ్యం – 02 అవమానం – 02

తులా రాశి వారికి శ్రీ విళంబి నామ సంవత్సరం ఆర్ధికంగా అనుకూలం. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి చక్కటి స్థిరత్వం లబించును. ఉద్యోగ జీవనంలో ఆశించిన పదోన్నతులు ఏర్పడును. గృహ నిర్మాణం చేయువారికి సమస్యలు. దూర ప్రాంత స్థానచలనం కొరకు ప్రయత్నించు వారికి ఆగష్టు తదుపరి అనుకూలత.విద్యార్ధులకు ఆశించిన ఫలితాలు. న్యాయవాద వృత్తి చేయువారికి కెరీర్ పరంగా ఒడిదుడుకులు. సంతాన ప్రయత్నములకు కేతు గ్రహం వలన సమస్యలు.

శ్రీ విళంబి నామ సంవత్సరంలో తులా రాశి వారికి గురువు సంవత్సరం అంతా మంచి ఫలితాలు ఇవ్వడు. రక్త సంబంధ ఆరోగ్య సమస్యలను, తగాదాలను, కోర్టు కేసులలో అపజయాలను, శత్రు వృద్ధిని ఏర్పరచును. వడ్డీ వ్యాపారం చేయువారికి అనగా ఫైనాన్సు రంగం వారికి మంచి లాభాలను కలుగచేయును.

శని వలన తులారాశి వారు సామాన్య ఫలితాలు పొందును. అభివృద్ధిని కలిగించడు మరియు తీవ్ర నష్టములు కలుగచేయడు. కనిష్ట సోదరుల వలన మానసిక అశాంతిని , వారితో సమస్యలను ఏర్పరచును. ఈ సంవత్సరం రాహువు వలన తులారాశి వారు మంచి ఫలితాలు పొందును. ప్రయనములందు జయమును, దూర దేశ నివాసము, వీసాల కొరకు ప్రయత్నించువారికి అనుకూల ఫలితాలు కలుగచేయును. కేతువు సంతాన ప్రయత్నములు చేయువారికి ప్రయత్న భంగములు ఏర్పరచును.

మార్చి 2018 తులారాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు. గృహ సంతోషములు. ధన వ్యయం. కుటుంబంలో నూతన వ్యక్తుల చేరిక. తలవంపు కలిగించును సంఘటనలు. మాట జాగ్రత్త అవసరం. 17, 18 తేదీలలో అనవసర తగాదాలు. నాలుగవ వారంలో మానసిక ప్రసాంతత. కార్య సిద్ధి. ఈ నెలలో 3, 11, 20 తేదీలు ఉద్యోగ ప్రయత్నములకు మంచిది. ఆశించిన ఉద్యోగ ప్రాప్తి.

ఏప్రిల్ 2018 తులారాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో చేపట్టిన పనులు కష్టం మీద పూర్తి అగును. తీవ్ర ఆటంకములు ఉండవు. కానీ సహకారం ఉండక సకాలంలో కార్యములు పూర్తి కావు. వివాహ ప్రయత్నాలు చేయుటకు ప్రధమ ద్వితీయ వారాలు అనుకూలమైనవి. గృహ నిర్మాణం లేదా కొనుగోలుకు సంబందించిన ప్రయత్నాలు చేయుటకు ఈ మాసం కలసిరాదు. ఉద్యోగులకు, వ్యాపార, వృత్తి జీవనం వారికి సాధారణ ఫలితాలు. 22 వ తేదీ తదుపరి పనులు వేగం పొందును. ఆర్ధికంగా ఆశించిన మిగులు.

మే 2018 తులారాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో ఆగిపోయిన పనులు పునః ప్రారంభానికి అనుకూలం. వ్యాపార విస్తరణకు, నూతన ప్రయత్నాలకు, వీసా సంబందిత ప్రయత్నాలకు మంచి కాలం. ఈ రాశికి చెందిన చిన్న పిల్లలకు ఆరోగ్య సమస్యలు. 10 నుండి 16 వ తేదీల మధ్య విఘ్నాలు వాటంతట అవే తొలగిపోవును. కనిష్ట సోదరుల విషయంలో ఒక సమస్య. తృతీయ వారంలో ఉద్యోగ జీవనంలో పై అధికారుల వలన ఒత్తిడులు లేదా సమస్య. విలస వస్తువులు కొనుటకు ఇది మంచి కలం కాదు.

జూన్ 2018 తులారాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో ధనాదాయం బాగుండును. బంధు వర్గంలో ఒక వ్యవహర విజయం. నూతన కార్యములలో వేగం. వ్యాపారులకు రాబడిలో పెరుగుదల. ఈ మాసంలో శుభ ఫలితాలు కలవు. అన్ని రంగాల వారికి ఈ మాసం కలసివచ్చు గ్రహ స్థితులు కలవు.

జూలై 2018 తులారాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో కూడా ధనాదాయం బాగుండును. కుటుంబ జీవనంలో , వ్యక్తిగత జీవితంలో ఆశించిన సంతోషాలు. జీవిత భాగస్వామి వలన సౌఖ్యం. అన్నిరంగాముల వారికి ప్రోత్సాహకరమైన కాలం. కార్య జయంలో పట్టుదల ప్రదర్సిన్చెదురు. ద్వితీయ వారంలో మాత్రం ఋణములు ఇచ్చుట వలన ధన నష్టములు. ఉద్యోగ జీవనంలో ప్రశంసలు. తృతీయ, చతుర్ధ వారాలలో అనుకులమైన ఫలితాలు.

ఆగష్టు 2018 తులారాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు. ధనాదాయం సామాన్యం. కుటుంబంలో ఆరోగ్య సమస్యలు. అఖస్మిక అపజయాలు లేదా ధన నష్టములు. సంతాన ప్రయత్నాలలో సమస్యలు. సహోద్యోగుల భావాలను దృష్టిలో పెట్టుకొని పనిచేయుట మంచిది. స్థిరాస్థి వ్యాపారులకు అనువైన కాలం. 22 వ తేదీ తదుపరి జీవనంలో ఒత్తిడి. అననుకూలత. ఈ మాసంలో 15,16,22,23,24,25 తేదీలు అనుకూలమైనవి కావు.

సెప్టెంబర్ 2018 తులారాశి ఫలితాలు:

ఈ మాసంలో ధన విషయాలు మానసికంగా కొంత ఆందోళన కలిగించును.ఆదాయం కొంత తగ్గును. మానసిక అశాంతి. 6,7,8 తేదీలలో మైత్రి సంబంధ వ్యవహారాలకు, ఒప్పందాలకు అనుకూలం. 13,14 తేదీలు ప్రతికూలం. పనులలో ఆటంకములు. ప్రతిష్టకు నష్టం. తృతీయ వారంలో ధనాదాయం పెరుగును. ప్రయాణాలు కలసి వచ్చును. ఆశించిన సహకారం ఇతరుల నుండి పొందేదురు. 27,29,30 తేదీలు సంతాన ప్రయత్నములకు అనుకూలమైన కాలం.

అక్టోబర్ 2018 తులారాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో కేతు ప్రభావం అధికం. ప్రధమ వారంలో ధనాదాయం సామాన్యం. స్థిరాస్థి లేదా వారసత్వ సంబంధ, సంతాన సంబంధ చికాకులు. ఇతరులకు సంబందించిన అనవసర వివాదాలు. శ్రద్ధ లోపించును. జీవనంలో ఒత్తిడి. నూతన బంధువర్గం చేరికలు. ద్వితీయ తృతీయ వారాలు సామాన్య ఫలితాలు.చివరి వారంలో ఆధ్యాత్మిక యోగం, ఇష్ట దేవతా దర్శన, తీర్ధయాత్రలు.

నవంబర్ 2018 తులారాశి ఫలితాలు:

ఈ మాసంలో సమస్యలు తగ్గును. దీర్ఘకాలిక కోరికలు నెరవేరును. సంతాన సంబంధ లాభం. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అగును. నూతన పరిచయాల వలన సమస్యలు. సొంత నిర్ణయాలు ఫలించును. తృతీయ వారంలో విపరీత అనుభవాలు. వివాహ ప్రయత్నాలకు, ఉద్యోగ మార్పులకు, నూతన పెట్టుబడులకు ఈ మాసంలో చివరి వారం అనుకూలమైనది. ఈ మాసంలో 2,5,9,14,18 తేదీలు అనుకూలమైనవి కావు.

డిసెంబర్ 2018 తులారాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో ఆశించిన ధన లాభాలు ప్రాప్తించును. సమస్యలు తగ్గును. సరైన రీతిలో ఆలోచనలు ఏర్పడును. చర్చలు ఫలించును. ఉన్నత వర్గీయులతో పరిచయాలు. అవరోధాలు అధిగామించెదరు.గౌరవం పెరుగు సంఘటనలు. ఆర్ధికంగా సంతృప్తికర కాలం. వ్యక్తిగత జీవితంలో సౌఖ్యం. కుటుంబంలో ఆనందకర వాతావరణం. విజయాలు.

జనవరి 2019 తులారాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో వ్యాపార వ్యవహారాలు సామాన్యం. చేపట్టిన పనులలో స్తబ్ధత తొలగును. ఈ మాసంలో బంధు వర్గంలో ఒకరికి మంచిది కాదు. దుర్వార్త వినవలసి వచ్చును. ద్వితీయ వారం ప్రారంభంలో భూ సంబంధ లేదా గృహ సంబంధ స్తిరాస్థి పనులలో లాభం. ఉద్యోగంలో మంచి స్థితి. వ్యాపరంలో ఆశించిన లాభాలు. ఈ మాసంలో 7,8,19,28,29 తేదీలు అనుకూలమైనవి. ఈ రోజులు నూతన కార్యములకు విజయం చేకుర్చును. వాహన యోగం.

ఫిబ్రవరి 2019 తులారాశి రాశీ ఫలితాలు:

ఈ మాసం వ్యక్తిగత జీవనంలో సంతోషాలను, సౌఖ్యమును కలుగచేయును. ధనాదాయం బాగుండును. అవివాహితుల వివాహ ప్రయత్నాలు ఫలించును. మాస మధ్యమంలో శస్త్రచికిత్సకు సూచన. నూతన బాధ్యతలు చేపట్టడానికి ఈ మాసం అతి చక్కటి ఫలితాలు కలుగచేయును.

మార్చి 2019 తులారాశి రాశీ ఫలితాలు:

ఈ మాసం అంతగా కలసి రాదు. ఈ మాసంలో ఆఖస్మిక వివాదాలు, తగవుల వలన చికాకులు. ఆలోచనలు కార్య రూపం దాల్చును. మిత్ర – బంధు బలం ఉపయోగపడును. ఆర్ధికంగా కలసి రాదు. తృతీయ వారంలో శుభకార్య సంబంధ వ్యయం. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం. ప్రయత్న పూర్వక విజయాలు.