శ్రీ విళంబి నామ సంవత్సర వృచ్చిక రాశి ఫలితాలు

0శ్రీ విళంబి నామ సంవత్సర వృచ్చిక రాశి ఫలితాలు

  • విశాఖ 4 వ పాదము, అనురాధ 1,2,3,4 పాదములు, జ్యేష్ఠ 1,2,3,4 పాదములులో జన్మించినవారు వృచ్చిక రాశికి చెందును.
  • శ్రీ విళంబి నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఆదాయం – 02 వ్యయం – 14 రాజపూజ్యం – 05 అవమానం – 02

శ్రీ విళంబి నామ సంవత్సరంలో వృచ్చిక రాశి వారు ఏలినాటి శని దశ ప్రభావం వలన సమస్యలను ఎదుర్కొందురు. విదేశీ జీవనం ఆశించు వారికి ప్రయత్నములు ఫలించవు. సంతాన లేమి కల్గిన దంపతుల సంతాన ప్రయత్నాలు దైవ ఆశ్సిస్సులతో ఫలమంతమవ్వాలి. పుణ్య క్షేత్ర సందర్శన చేయుదురు. పట్టుదల లోపించును. వ్యయం అధికంగా ఉండును. నూతన స్నేహాల వలన సమస్యలు. విద్యార్ధులకు అధిక శ్రమ అవసరం. వ్యవసాయదారులకు ఋణాలు. లోహములు, కందెనలు , నువ్వులు వంటి శని ఆధిపత్యం కలిగిన వస్తువులతో వ్యాపారం చేయువారికి లాభాలు. ఈ సంవత్సరం వృచ్చిక రాశి వారు లాటరీలు , గుర్రపు పందాలు, జూదం లలో పాల్గొనకుండా ఉండుట మంచిది. రాజకీయ, క్రీడారంగం, కాళారంగంలోని వారికి మధ్యమ ఫలితాలు. ధన నష్టములు. వృత్తి జీవనంలోనివారికి సామాన్య ఫలితాలు.

శ్రీ విళంబి నామ సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి గురు గ్రహం వలన 10-అక్టోబర్-2018 వరకూ కొద్దిపాటి ఋణములు ఏర్పడును. కానీ మంచి కార్యక్రమాల కొరకు ధనాన్ని వినియోగించెదరు. 11-అక్టోబర్-2018 నుండి గురువు పూర్తిగా కలసివచ్చును. చక్కటి ఆర్ధిక బలాన్ని ఇచ్చువాడు అగును. నూతన ధనార్జన మార్గాలకు దారి చూపును. ఎరుపు రంగు కలసి వచ్చును.గౌరవ ప్రతిష్టలు ఏర్పరచును.

శ్రీ విళంబి నామ సంవత్సరంలో శని వలన మంచి ఫలితాలు ఉండవు. ఏలినాటి శని దశ విచారములు, అనవసర ఖర్చులు,నేత్ర సంబంధ ఆరోగ్య సమస్యలు ప్రసాదించును. శనికి శాంతి అవసరం. ఈ సంవత్సరం వృచ్చిక రాశి వారికి రాహువు భూ సంబంధ సంపదకు సంబందించిన లాభమును చేకుర్చును. గృహ ప్రయత్నాలు అనుకూలం చేయును. కేతువు మాత్రం కలసిరాడు. ప్రయత్న ఆతంకములను, అపజయాలను, దైవ దుషనలను చేయునట్టు చేయును.

మార్చి 2018 వృశ్చికరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో చక్కటి వాతావరణం. అన్ని విధములా లాభం. ఆశించిన స్థాయిలో అభివృద్దిని పొందుదురు. నూతన వ్యాపార ప్రయత్నాలు జయం. గౌరవ ప్రదమైన జీవనం. దగ్గరి బంధువులకు సంబంధించిన అశుభ వార్త. ఉద్యోగ జీవనం, ధనాదాయం సామాన్యం. శత్రు నాశనం.

ఏప్రిల్ 2018 వృచ్చిక రాశి రాశీ ఫలితాలు:

ఈ మాసం లాభాపురితంగా ఉండును. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నములు లాభించును. దూర ప్రాంత ప్రయానములు ఫలించును. సంతాన సంబంధ ప్రయత్నాలు మాత్రం విఫలమగును. ధనాదాయం బాగుండును. ద్వితీయ తృతీయ వారంలో శుభవార్తలు. ఆర్ధికంగా కలసివచ్చును. చివరి వారంలో జ్వరతత్వ సమస్యలు. ఆలోచనలు అదుపులో ఉండవు. నష్టపురిత ఆలోచనలు అధికంగా చేయుదురు.

మే 2018 వృచ్చిక రాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో నూతన ఆలోచనలు కార్యాచరణలో పెట్టుటకు అనుకూలమైన గ్రహ బలాలు కలవు. వ్యాపార వ్యవహారాలు లాభాపురితంగా ఉండును. వైవాహిక జీవనంలో కొద్దిపాటి అసంతృప్తి. దంపతుల మధ్య వివాదాలు ఏర్పడును. ఆరోగ్య పరంగా కూడా అంత మంచిది కాదు. 15వ తేదీ తదుపరి ప్రయాణ ప్రయత్నాలు, విదేశీ సంబంద ఆదాయానికి, ఉద్యోగంలో మార్పునకు, నూతన వాహన కొనుగోలుకు అనువైన సమయం. పనులలో విజయం ఏర్పడును. సకాలంలో పనులు పూర్తి అగును. 28,29,30,31 తేదీలలో జీవనంలో ఒత్తిడి.

జూన్ 2018 వృచ్చిక రాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో ప్రధమ వారంలో వైవాహిక జీవనంలో చికాకులు తొలగును. కుల వృత్తి జీవనం చేయువారికి అధిక ధనాదాయం. కుటుంబంలో సంతోషాలు. ద్వితీయ వారంలో మంచి స్థితి. యువ దంపతులకు చక్కటి సంతానం. విద్యార్ధులకు ఆశలు నెరవేరును. గృహ నిర్మాణ లేదా విక్రయ పనులలో ఆటంకములు. తృతీయ వారంలో తీసుకొను నిర్ణయాలు మంచి ఫలితాలను ఇచ్చును. జీవనం సంతృప్తికరంగా ఉండును. శత్రు విజయం ఏర్పడును.

జూలై 2018 వృచ్చిక రాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో గృహ సంబంధ విషయాలలో లాభాలు. వ్యాపారాలు సజావుగా సాగును. ధనాదాయం బాగుండును. బంధు వర్గంతో సంతోషకరమైన సమయం. గౌరవ ప్రాప్తి. సామాజిక కార్యక్రమాలలో పాల్గొనుట, విషయాలపై ఏకాగ్రత పెరుగును. వ్యక్తిగత జీవనం ప్రశాంతంగా ఉండును. ఈ మాసంలో 10,12,16,17,26,27 తేదీలు అనుకూలమైనవి.

ఆగష్టు 2018 వృచ్చిక రాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో ధనవ్యయం అధికం అగును. జీవన మార్గంలో కొద్దిపాటి సమస్యలు లేదా దీర్ఘకాలిక నష్టాలు ప్రారంభం అగును. క్రమ పద్ధతిలో జీవనం చేయని యువతీ యువకులకు ఈ మాసం మంచిది కాదు. ఆరోగ్య పతనం ప్రాప్తించును. వ్యాపార వ్యవహారాలు సామాన్యం. అనాలోచిత నిర్ణయాల వలన నష్టములు. పెద్దల జోక్యంతో వివాదాలు పరిష్కారం అగును. చివరి వారంలో ప్రయాణాలు లాభించవు. మానసిక చికాకులు.

సెప్టెంబర్ 2018 వృచ్చిక రాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో కొద్దిపాటి ప్రసాంతత. ధన సమస్యలు పరిష్కరించబడును. పట్టుదలతో కార్య సిద్ధి. నూతన పనులలో సానుకూలత. సంతానం మంచి స్థితిలో స్థిరపడును. స్త్రీల ఆశలు నెరవేరును. ఇబ్బందులు ఉన్నా చివరికి విజయం పొందేదురు. తృతీయ వారం నుండి ఉద్యోగ పరమైన లాభాలు లేదా నూతన ఉద్యోగ అవకాశములు. ఈ మాసంలో 11,15,26,30 తేదీలు అనుకూలమైనవి కావు.

అక్టోబర్ 2018 వృచ్చిక రాశి రాశీ ఫలితాలు:

ఈ మాసం అనుకూలమైనది కాదు. నడుస్తూ ఉన్న వ్యవహారాలు ఆకస్మికంగా ఆగిపోవును. మాట లేదా నిందలకు మానసికంగా సిద్ధం కావలెను. కష్ట కాలం. బంధు వర్గం లేదా స్నేహ వర్గం వలన సహకారం సమయానికి అందదు. ఉద్యోగులకు పై అధికారుల వలన చికాకులు. వ్యప్రలలు ఆశించినంతగా సాగవు. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేయువారు జాగ్రత్త వహించవలెను.

నవంబర్ 2018 వృచ్చిక రాశి రాశీ ఫలితాలు:

వ్యవహరపు చిక్కులు, సమస్యలు ఈ మాసంలో కూడా కొనసాగును. కుటుంబంలో సభ్యుల మధ్య వాతావరణం అంతగా బాగోదు. ఉన్మాదంతో ప్రవర్తిన్చెదరు.ధనాదాయం సామాన్యం. బంధు కలహాలు, కోర్టు వివాదాలు. విద్యార్ధులకు వ్యతిరేక ఫలితాలు. నూతన కార్యములు విఫలం. సమయ స్పూర్తి లోపించును. స్నేహితులతో జాగ్రత్త అవసరం. వ్యయంపై నియంత్రణ కోల్పోవు సంఘటనలు. ఈ మాసంలో తృతీయ వారంలో వ్యాపార రంగంలోని వారికి మంచిది కాదు. ఆర్ధిక పరమైన విషయాలలో ఒక నష్టానికి సూచన.

డిసెంబర్ 2018 వృచ్చిక రాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో వ్యక్తిగత సంతోషాలు తక్కువగా ఉండును. వ్యాపార వ్యవహారాలు సామాన్యం. వివాదాలు తగ్గును. ధనవ్యయం కొద్దిగా అదుపులోకి వచ్చును. నూతన ఆలోచనలు కార్యరూపంలోకి పెట్టుటకు, పెద్దలను సంప్రదించుటకు ఈ మాసం అనుకూలమైనది కాదు. ఉద్యోగంలో ఒక నష్టం లేదా ఆందోళన. చివరి వారంలో ఆవేశపడే సంఘటనలు. వాహన సంబంధ నష్టములు. ఈ మాసంలో ఈశ్వర అభిషేకములు, గ్రహ శాంతి జపములు జరిపించుకోనుట మంచిది.

జనవరి 2019 వృచ్చిక రాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో కొంత అనుకూలత. పరిస్థితులు సజావుగా కొనసాగును. మానసిక అశాంతి తొలగును. కుటుంబంలో నూతన వ్యక్తుల చేరికలు. అవివాహితుల వివాహ ప్రయత్నాలు లాభించును. వివాదాలలో జయం. ద్వితీయ వారంలో కార్య సిద్ధి. జీవనంలో స్థిరత్వం. 21,22,23 తేదీలలో కాలం దుర్వినియోగం. వృధా శ్రమ. శ్రమ నష్టం. ౨౫వ తేదీ తదుపరి ప్రతిష్టంభన తొలగును.

ఫిబ్రవరి 2019 వృచ్చిక రాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో ప్రత్యర్ధుల వలన చికాకులు. సమస్యలు. నేత్ర సంబంధ అనారోగ్యం కలిగిన వారికి తీవ్ర సమస్యలు. శస్త్ర చికిత్సకు దారి తీయును. ప్రయాణాలు అనుకులించును. వ్యాపార ఉద్యోగ వ్యవహారాలు సామాన్యం. ధనాదాయం సామాన్యం. నూతన వ్యవహారాలు మిశ్రమ ఫలితాలు ఇచ్చును. అశ్రద్ధ వలన నష్టములు లేదా శ్రమ. ఉద్యోగ మార్పిడికి ప్రయత్నములు చేయకుండా వుండడం మంచిది.

మార్చి 2019 వృచ్చిక రాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. సంకల్పం నెరవేరును. పెద్దల సహకారం పొందుదురు. కుటుంబంలో మీ పలుకుబడి పెరుగును. పుత్ర సంతతి వలన సౌఖ్యం. తృతీయ వారంలో వివాహ ప్రయత్నాలు, మైత్రీ వ్యవహారాలు అనుకూలం. నూతన కార్యములందు జయం. చిన్న ఆరోగ్య సమస్య. ఈ మాసంలో వాహనాలు , ప్రయాణాలు కలసిరావు. ఈ మాసంలో 7,8,10,12,20 తేదీలు అనుకూలమైనవి కావు.