శ్రీ విళంబి నామ సంవత్సర వృషభరాశి రాశి ఫలితాలు

0శ్రీ విళంబి నామ సంవత్సర వృషభరాశి రాశి ఫలితాలు

మీ జన్మ నక్షత్రం కృత్తిక 2,3,4 పాదములు, రోహిణి 1,2,3,4 పాదములు, మృగశిర 1,2 పాదములలో ఒకటి ఐయిన మీది వృషభ రాశి.

శ్రీ విళంబి నామ సంవత్సరంలో వృషభ రాశి వార్కి ఆదాయం – 11 వ్యయం – 05 రాజపూజ్యం – 01 అవమానం – 03.

వృషభ రాశి వారికి శ్రీ విళంబి నామ సంవత్సరంలో ధనాదాయం ప్రధమార్ధంలో అధికంగా ఉండును. ద్వితియార్ధంలో ఆదాయంలో హెచ్చుతగ్గులు ఏర్పడును. అనుకోనివిధానంలో వాయిదా పడుతున్న పనులు ఈ సంవత్సరం పూర్తి అగును.నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నములు ఫలించును. కానీ ప్రభుత్వ ఉద్యోగం ఆశించువారికి కొద్దిపాటి నిరాశ. సొంత గృహ ప్రయత్నాలు ఫలించును. రాజకీయ రంగంలోనివారికి లౌఖ్యం అవసరం. పట్టుదల వలన గౌరవ భంగం. జూన్, జూలై, ఆగష్టు మాసాలలో వివాదాలు, పోలీస్ కేసులు వలన చికాకులు. విద్యార్ధులకు సామాన్య ఫలితాలు. వ్యాపార వ్యవసాయ రంగం వారికి మధ్యమ ఫలితాలు. వృషభ రాశికి చెందిన స్త్రీలు ఈ సంవత్సరం సంపత్ గౌరీ వ్రతము ఆచరించడం మంచిది.

వృషభ రాశి వారికి ఈ సంవత్సరం గురు గ్రహం 10-అక్టోబర్-2018 వరకూ చెడు ఫలితాలను కలుగచేయును. అనవసర శత్రుత్వములను , అపవాదులను , ఆరోగ్య సమస్యలను, ఆర్ధిక ఇబ్బందులను కలుగచేయును. 11-అక్టోబర్-2018 తదుపరి కొంచెం శాంతించును. అనుకూలమైన ఫలితాలను కలుగచేయును. అవివాహితుల వివాహ ప్రయత్నములను ఫలవంతం చేయును. కానీ శరీర ధారుడ్యం తగ్గును.

శ్రీ విళంబ నామ సంవత్సరంలో శని గ్రహం సంవత్సరం అంతా మిశ్రమ ఫలితాలను ఏర్పరచును. కష్టార్జితం అంతా వృధాగా మిత్రులకు, బంధువులకు వినియోగించవలసిన పరిస్టితులు ఏర్పరచును. నల్లని వాహనముల విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ పరమైన వ్యయం అధికం అగును.

వృషభ రాశి వారు ఈ సంవత్సరంలో రాహువు వలన సోదర సంబంధ సమస్యలను లేదా తగాదాలను లేదా సోదర వర్గ నష్టములను పొందు సూచన. స్వ విషయాలలో అనుకూలమైన ఫలితాలను ఏర్పరుచును. వృషభ రాశి వారు ఈ సంవత్సరం భాత్రు వర్గం వారికి అప్పులు ఇచ్చుట, వారి కొరకు హామీలు ఉండుట, భాగస్వామ్య వ్యాపారాలు చేయుట మంచిది కాదు. కేతు గ్రహం ఈ రాశి వారికి వైవాహిక జీవనంలో సమస్యలను, జీవిత భాగస్వామికి అనారోగ్యమును ఏర్పరచును. విడాకులు ఆశిస్తున్న వారికి ఈ సంవత్సరం విడాకులు , కళత్ర నష్టం ఏర్పడును. ఆర్ధికంగా మిశ్రమ ఫలితాలు కలుగచేయును.

మార్చి 2018 వృషభ రాశి రాశీ ఫలితాలు :

ఈ మాసంలో కొద్దిపాటి కష్టములు ఎదురగును. ఒకపర్యాయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొనుట మంచిది. ఆరోగ్య మందగమనం ఆందోళన కలిగించును. తృతీయ వారం నుండి ఆహార అలవాట్లు , వ్యసనాల పట్ల జాగ్రత్త అవసరం. ఈ నెలలో 23,24, 27,29 తేదీలలో నూతన కార్యములు, వివాహము కొరకు చేయు ప్రయత్నములు లాభించును.

ఏప్రిల్ 2018 వృషభ రాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో రక్తసంభందీకుల వలన మేలు కలుగుతుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చును. నూతన ఆదాయ మార్గాలు ఏర్పడును. గృహంలో సంతోష కార్యములు.వివాహ ప్రయత్నములు కలసివచ్చును. దూరప్రాంత ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అగును. సోదర వర్గం వారికి అంత మంచిది కాదు. వృద్దులకు శ్వాస సంబంధ , నేత్ర సంబంద సమస్యలు. తృతీయ వారంలో ఇతరులను , పై అధికారులను మీ ప్రతిభతో ఆకట్టుకుంటారు. గౌరవ మర్యాదలు పొందేదురు. లక్ష్యం సిద్ధిస్తుంది. ప్రశాంతంగా గడుపుతారు.

మే 2018 వృషభ రాశి రాశీ ఫలితాలు:

ఈ మాసం అన్ని విధములా అనుకూలమైన ఫలితాలను కలుగచేయును. ధనాదాయం బాగుండును. ద్వితీయ వారంలో క్రిమికీటకాదుల వలన ప్రమాద సూచన. విద్యార్ధులకు ఆశించిన విద్య. తృతీయ వారంలో నూతన పరిచయాలు. ఉత్తముల మైత్రి. సంతాన ప్రయత్నాలు అనుకూలించును.శత్రు ఓటమి. అవరోధాలు వాటంతట అవే తొలగిపోయే గ్రహ బలాలు కలవు. కుటుంబంలో ప్రేమ – అభిమానాలు ఉండును. నూతన వస్తువులకోరకు ధన వ్యయం.

జూన్ 2018 వృషభ రాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో ఆదాయం బాగుండును. కానీ వైవాహిక జీవనంలో కొద్దిపాటి అశాంతి. ప్రధమ వారంలో బంధు వర్గంతో కలయికలు. సంతానం వలన ఆనందం. లాభం. ద్వితీయ వారంలో మానసిక చికాకులు , విచారం, ధనాదాయం అధికం. చట్టపరమైన సమస్యలు. తృతీయ వారంలో పనులలో ఆటంకములు. ఆర్ధిక విషయాలలో జాగ్రత్త అవసరం. తొందరపాటు నిర్ణయాల వలన సమస్యలు. దేవాలయ దర్శన మంచిది. ఈమసంలో 17,18,19 తేదీలు అంత అనుకూలమైన రోజులు కావు.

జూలై 2018 వృషభ రాశి రాశీ ఫలితాలు:

ఈ మాసం అంత అనుకూలమైన కాలం కాదు. ఆర్ధిక పరంగా, సామాజిక స్నేహాల వలన, స్వ ఆరోగ్య విషయాలలో సమస్యలు. వ్యాపార వ్యవహారాలు సామాన్యం. ఆదాయం కూడా సామాన్యం.వివాహ ప్రయత్నాలు విఫలం. శ్రమ అధికం. నిరాశాపూరిత వాతావరణం. చివరి వారంలో శుభాయోగం. శత్రు పీడ , మిత్ర బలము రెండింటిని ఎదుర్కొందురు. ప్రయత్నపూర్వక కార్య సిద్ధి ఏర్పడుతుంది.

ఆగష్టు 2018 వృషభ రాశి రాశీ ఫలితాలు:

ఈ మాసం కూడా సామాన్య ఫలితాలను కలుగచేయును. గృహంలో అశాంతి. ప్రయాణాలలో నష్టం. ఉద్యోగ జీవనంలోని వారికి అకారణంగా మాటపడుట లేదా నిందపడు సంఘటనలు. స్త్రీలకు ఉదర , గర్భ సంబందిత సమస్యలు. ద్వితీయ వారం వరకూ ప్రయత్నాలు విఫలం. జాగ్రత్తగా వ్యవహరించాలి. తృతీయ వారంలో అధిక ఒత్తిడి. ఇబ్బందులు ఎదుర్కొందురు. చెడు సంఘటనలకు అవకాశములు వున్నవి. చివరి వారం సామాన్య ఫలితాలను కలుగచేయును. నిత్యం లలితా పారాయణ చేయుట మంచిది.

సెప్టెంబర్ 2018 వృషభ రాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో చాలా సమస్యలు తొలగును. దూర ప్రాంత ప్రయాణాలు లాభించును. వ్యక్తిగత జీవనంలో సంతోషములు ఏర్పడును. ఉద్యోగ ప్రయత్నములు ఫలించును. ఆదాయం బాగుండును. విజయం లభించును.సహనానికి , ఓర్పుకు పరీక్ష ఏర్పడును. కొద్దిపాటి వ్యతిరేక శకునాలు కనిపించినా రావలసిన లాభం వస్తుంది. తృతీయ చతుర్ధ వారాలు సంతాన ప్రయత్నాలకు అనుకూలం.

అక్టోబర్ 2018 వృషభ రాశి రాశీ ఫలితాలు:

నూతన పనులు ప్రారంభించుటకు ఈ మాసం మంచిది కాదు. వ్యాపార, ఉద్యోగ వ్యవహారములందు మిశ్రమ ఫలితాలు ఏర్పడును. ధనాదాయం సామాన్యం. ఉద్యోగంలో ఆకస్మిక సమస్యలు. ఉన్నతాధికారుల వలన అవమానం లేదా సమస్యలు. నిరుద్యోగులకు ఆశాభంగం. మాస ద్వితియార్ధం నుండి విజయావకాసములు పెరుగును.కార్య సిద్ధి ఏర్పడుటకు దైవ బలం ప్రదానం. బుద్ధి బలం ఒక్కటే సరిపోదు. చివరి వారంలో నూతన మార్గాలు. మిత్రులతో కాలక్షేపం లేదా విందు వినోదాలు.

నవంబర్ 2018 వృషభ రాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో ఆదాయం కొంత తగ్గును. ఆకస్మిక వ్యవహర నష్టము, ఆర్ధిక అంశాలలో చిక్కులు, రావలసిన ధనం స్థంభించుకోనిపోవుట వంటి సమస్యలు. ధనం ఖర్చు పెట్టు విషయంలో భవిష్యత్ కుటుంబ అవసరాలు గుర్తుపెట్టుకోవలెను. చివరి వారం ఆధ్యాత్మికంగా ఉత్తమమైన కాలం. గృహ నిర్మాణం లేదా గృహ మార్పిడి చేయువారికి అధిక వ్యయం వలన చికాకులు. పుత్రికా సంతతి ప్రాప్తి.

డిసెంబర్ 2018 వృషభ రాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో వ్యాపార వ్యవహారములలో ఏర్పడిన స్తబ్ధత తొలగును. ఆదాయం గత మాసం కన్నా ఎక్కువగా ఉండును. పితృ వర్గం వారి తోడ్పాటు లభించును.తలపెట్టిన వ్యవహారాలు విజయవంతమగును. ద్వితీయ తృతీయ వారాలలో వ్యతిరేక పరిస్థితులు క్రమంగా తొలగును. మిత్రవర్గం లేదా బంధు వర్గం ముందు మనసు విప్పి మాట్లాడుట వలన నష్టములు. మాసాంతానికి పనులు పుర్తిఅగును. వంశ పెద్దల ఆశీస్సులు లబించును. ఈ మాసంలో 7,8,14,15 తేదీలు ఉద్యోగ ప్రయత్నాలకు అనువైనవి.పదవీ లాభం ఏర్పడును. వివాహ ప్రయత్నములకు , నూతన స్థలం కొనుగోళ్లకు కూడా ఈ మాసం అనువైనది.

జనవరి 2019 వృషభ రాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో కుటుంబంలో మీ మాట మీద నమ్మకం పెరుగు సంఘటనలు, కుటుంబ వ్యవహారములందు విజయం ప్రాప్తించును. ధనాదాయం బాగుండును. విద్యార్ధులకు కొద్దిపాటి నిరాశ. పెద్ద వయస్షు వారికి వెన్నుపూస సంబంధ సమస్యలు. శస్త్ర చికిత్సకు కూడా దారి తీయవచ్చు. కుటుంబ పరమైన వ్యయం అధికంగా ఉండుటకు సూచనలు కలవు. ప్రయాణాలు శ్రమతో కూడి ఉండును. తృతీయ వారం నుండి గాయత్రీ దేవి ఆరాధన ఆరోగ్య ఆర్ధిక విషయాలలో ఉన్నతిని ఏర్పరచును. నూతన వ్యాపార ఆరంభ విషయాలలో ఆటంకములు వున్నవి. పట్టుదల అవసరం.

ఫిబ్రవరి 2019 వృషభ రాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో అవివాహితుల వివాహ ప్రయత్నాలు లాభించును. జీవిత భాగస్వామి సంబంధ విషయాలలో సౌఖ్యం. ఆశించిన ధనాదాయం. ఉద్యోగులకు ప్రతివిమర్శల వలన నష్టం. భూ సంబంధ లేదా గృహసంబంధ యోగం.విద్యార్ధులకు కృషి అవసరం. ఈ మాసంలో 18 వ తేదీ నుండి 22 వ తేదీ వరకూ అనువైన కాలం.

మార్చి 2019 వృషభ రాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో మిత్రుల వలన నూతన ఆదాయ మార్గాలు ఏర్పడును. నిల్వ ధనం కలిగి వుందురు.భాత్రు వర్గం వారికి మంచిది కాదు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి అగును. కుటుంబ జీవితంలో సామాన్య ఫలితాలు. బాధ్యతలు పెరుగును.వ్యాపారస్థులకు ఈ మాసం చక్కటి లాభాలను ఏర్పరచును. మానసిక ఉత్సాహం అవసరం అగును. 28వ తేదీ తదుపరి దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది.