Templates by BIGtheme NET
Home >> LIFESTYLE >> Sreekaram Subhakaram 21st Sept 2014

Sreekaram Subhakaram 21st Sept 2014


Srikaram Subhakaram 21st Sept 2014

రాశి ఫలాలు

by Vakkantam Chandra Mouli, janmakundali.com

Weekly Horoscope (21st Sept 2014   –    28th Sept 2014)

మేషం

ఆర్థికంగా బలపడతారు, రుణబాధలు తొలగుతాయి. బాకీలు అందుతాయి. కొత్త విషయాలు గ్రహిస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. వాహనాలు, ఆభరణాలు, భూములు  కొనుగోలు చేస్తారు. కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. తీర్థయాత్రలు చేస్తారు. ఒక సమాచారం నిరుద్యోగులకు సంతోషం కలిగిస్తుంది. ఆరోగ్య సమస్యలు ఎదురైనా సర్దుబాటు కాగలవు. వ్యాపారాలలో కొత ్తపెట్టుబడులతో ముందుకు సాగుతారు. ఉద్యోగులకు కోరుకున్న విధంగా పదోన్నతులు దక్కడం విశేషం. రాజకీయవర్గాలకు పదవులు లభిస్తాయి. సన్మానాలుజరుగుతాయి. కళాకారులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. అనుకోని అవకాశాలు. పారిశ్రామికవర్గాలు పరిశ్రమలు, సంస్థల ఏర్పాటు యత్నాలు ముమ్మరం చేస్తారు. విద్యార్థులు అనుకున్న అవకాశాలు దక్కి  ఉత్సాహంగా గడుపుతారు. షేర్ల విక్రయాలు లాభాల దిశగా సాగుతాయి.

దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

అశ్వని వారికి గురువారం ధన,వస్తులాభాలు. యత్నకార్యసిద్ధి. శుక్రవారం దూరప్రయాణాలు. మానసిక అశాంతి.

భరణి వారికి బుధవారం వ్యవహారాలలో విజయం.శుభవ ర్తమానాలు. ధనలాభం. శనివారం ప్రయాణాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. అనారోగ్యం.

కృత్తిక 1వ పాదం వారికి గురువారం ధనలబ్ధి. కార్యజయం. శుక్రవారం కుటుంబసమస్యలు. అనారోగ్యం.

 

వృషభం

పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. వ్యవహారాలలో స్వల్ప పురోగతి కనిపిస్తుంది. శ్రేయోభిలాషుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. కొత్త కాంట్రాక్టులు ఎట్టకేలకు  దక్కించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తుంది. ఆస్తి వివాదాలు కొంతవరకూ పరిష్కారమవుతాయి. వ్యాపారాలలో లాభనష్టాలు సమానస్థాయిలో ఉంటాయి.

 ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు కొంత ఊరట కలిగిస్తాయి. పారిశ్రామికవర్గాలు గతంలో నిలిచిన వ్యవహారాలు పూర్తి చేస్తారు. రాజకీయనాయకులకు కొత్త పదవుల కోసం యత్నిస్తారు. అయితే ఒత్తిడులు ఎదుర్కొంటారు. కళాకారులకు అవకాశాలు దక్కినా అసంతృప్తి చెందుతారు. విద్యార్థులకు ఇంటర్వ్యూలు అందుతాయి.షేర్ల విక్రయాలలో స్వల్ప లాభాలు.

తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.

విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. 

 కృత్తిక 2,3,4పాదాల వారికి  గురువారం ధనలబ్ధి. కార్యజయం. శుక్రవారం కుటుంబసమస్యలు. అనారోగ్యం.

రోహిణి వారికి శుక్రవారం అనుకోని ఆహ్వానాలు. ఆస్తిలాభం. శనివారం ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం.

మృగశిర 1,2పాదాల వారికి మంగళవారం ధననష్టం. కుటుంబంలో చికాకులు. శనివారం శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం.

మిథునం

ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. రుణబాధలు తప్పవు. ఆకస్మిక ప్రయాణాలు సంభవం.

 సన్నిహితులు, మిత్రులతో మాటపట్టింపులు. ఇంటాబయటా ఆరోపణలు, విమర్శలు  ఎదురవుతాయి. కాంట్రాక్టులు తుదిక్షణంలో చేజారతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యవహారాలు శ్రమానంతరం పూర్తి కాగలవు. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం తగదు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు కష్టమే. ఉద్యోగాలలో ఆకస్మిక బదిలీలు ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా వేసుకుంటారు. రాజకీయవర్గాలవారు కొంత ప్రోత్సాహకరంగా ఉన్నా పదవులు దక్కక మదనపడతారు. కళాకారులకు  అంచనాలు తప్పుతాయి.

 విద్యార్థులకు కొన్ని అవకాశాలు చేజారి నిరాశ కలిగిస్తాయి. మహిళలకు ఆస్తి విషయాలలో కుటుంబసభ్యులతో విభేదాలు. షేర్ల విక్రయాలు సామాన్యంగా ఉంటాయి.

తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.

ఆదిత్య హృదయం పఠించండి.

మృగశిర 3,4పాదాల వారికి   మంగళవారం ధననష్టం. కుటుంబంలో చికాకులు. శనివారం శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. ఆరుద్ర వారికి బుధవారం వ్యవహారాలు మందగిస్తాయి. ఆరోగ్యసమస్యలు. గురువారం అనూహ్యమైన విజయాలు. ఉద్యోగయోగం. పునర్వసు1,2,3పాదాల వారికి మంగళవారం ప్రయాణాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. శుక్రవారం ఆస్తివివాదాల పరిష్కారం. ఉద్యోగయోగం.

 

కర్కాటకం

ఈ వారం పట్టింది బంగారమే. అదనపు ఆదాయం  లభిస్తుంది. కొన్ని కార్యక్రమాలు  విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ప్రతిభాపాటవాలకు గుర్తింపు లభిస్తుంది. నూతన వస్తు, వస్త్రలాభాలు. పాతమిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. ఆరోగ్య సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు విధుల్లో చికాకులు తొలగుతాయి. ఇంక్రిమెంట్లు లభిస్తాయి. రాజకీయవర్గాలకు విశేష ప్రజాదరణ లభిస్తుంది. సన్మానాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ ఆహ్వానాలు అందుతాయి. కళాకారులు పోగొట్టుకున్న అవకాశాలు తిరిగి దగ్గరకు వస్తాయి. వ్యవసాయదారులు కొత్త పెట్టుబడులను సమకూర్చుకుంటారు. విద్యార్థులు సాంకేతిక, పరిశోధనలకు సంబంధించిన విద్యావకాశాలు దక్కించుకుంటారు. మహిళలు కుటుంబసభ్యుల చేయూతతో కొన్ని విజయాలు సాధిస్తారు. షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.

పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.

శివాష్టకం పఠించండి.

పునర్వసు 4వపాదం వారికి మంగళవారం ప్రయాణాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. శుక్రవారం ఆస్తివివాదాల పరిష్కారం. ఉద్యోగయోగం.

పుష్యమి వారికి గురువారం ధనలబ్ధి. ఇంటర్వ్యూలు అందుతాయి. శుక్రవారం ఆస్తి వివాదాలు. చర్మ,ఉదర సంబంధిత రుగ్మతలు. ఆశ్లేష వారికి బుధవారం వ్యవహారాలలో విజయం. శుభవర్తమానాలు. వాహన,గృహయోగాలు. శనివారం మానసిక అశాంతి. నేత్ర సంబంధిత రుగ్మతలు.

 

సింహం

ఆర్థిక  లావాదేవీలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక రుణబాధల నుంచి విముక్తి. కొన్ని సమస్యలు నేర్పుతో  పరిష్కరించుకుంటారు. మీ నిర్ణయాలపై కుటుంబసభ్యులు అనుకూలత వ్యక్తం చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. కుటుంబంలో  శుభకార్యాలు నిర్వహిస్తారు. కాంట్రాక్టర్లకు అనుకూలమైన కాలం. దేవాలయాలు సందరిస్తారు. పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆస్తుల కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి.

 వ్యాపారులకు  అనూహ్యంగా పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది.  పారిశ్రామికవర్గాలకు ప్రభుత్వపరమైన ఆహ్వానాలు అందుతాయి. విదేశీయానం. కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. రాజకీయవర్గాలవారు పదవులు దక్కి ఉత్సాహంగా గడుపుతారు. సాంకేతికవర్గాల వారికి అరుదైన గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులు కోరుకున్న విధంగా అవకాశాలు దక్కి ముందడుగు వేస్తారు. మహిళలు…కుటుంబ సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. షేర్ల విక్రయాలలో లాభాలు తథ్యం.

ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.

అంగారకస్తోత్రం పఠించండి.

 మఖ నక్షత్రం వారికి సోమవారం  విద్య,ఉద్యోగావకాశాలు. యత్నకార్యసిద్ధి. బుధవారం అనారోగ్యం. కుటుంబ సమస్యలు. దూరప్రయాణాలు.

పుబ్బ వారికి బుధవారం ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలోపాల్గొంటారు. శనివారం మానసిక ఆందోళన. బంధువిరోధాలు. ఉత్తర 1వ పాదం వారికి గురువారం ఆకస్మిక ధనలాభం. భూ, గృహయోగం. శుక్రవారం ఇంటాబయటా ఒత్తిడులు. ఆరోగ్యపరంగా చికాకులు.

 

కన్య

కొన్ని పనుల్లో జాప్యం జరిగినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. బంధువులు, మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆస్తుల విషయంలో బంధువులతో తగాదాలు. కోర్టు వ్యవహారాలలో విజయం. సంఘంలో గౌరవప్రతిష్టలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఒక ప్రకటన సంతోషం కలిగిస్తుంది. దేవాలయాలు సందర్శిస్తారు. శుభకార్యాలలో పాలుపంచుకుంటారు. రాబడి పెరిగి అవసరాలు తీరతాయి. వ్యాపారాలు కొత్త వ్యాపార యత్నాలు మరింత ముమ్మరం చేసి విజయం సాధిస్తారు. ఉద్యోగాలు పదోన్నతులు లభిస్తాయి. రాజకీయవర్గాల వారకి  .పదవీయోగం. విదేశీ పర్యటనలు. కళాకారులు అనుకున్నది సాధించే వరకూ విశ్రమించరు. పారిశ్రామికవర్గాలు విదేశీ సంస్థలలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలం. విద్యార్థులు పరిశోధనా విషయాలపై మక్కువ చూపుతారు. మహిళలకు శుభవర్తమానాలు రాగలవు. షేర్ల విక్రయాలలో లాభాలు దక్కుతాయి.

పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.

వేంకటేశ్వరస్తుతి మంచిది.

ఉత్తర 2,3,4పాదాల వారికి గురువారం ఆకస్మిక ధనలాభం. భూ, గృహయోగం. శుక్రవారం ఇంటాబయటా ఒత్తిడులు. ఆరోగ్యపరంగా చికాకులు.

హస్త వారికి  ఆదివారం అనుకోని ఖర్చులు. శత్రువులు పెరుగుతారు. శుక్రవారం శుభవర్తమానాలు. అదనపు ఆదాయం.

చిత్త నక్షత్రం 1,2పాదాల వారికి సోమవారం మానసిక ఆందోళన. వ్యయప్రయాసలు. శనివారం భూలాభం. యత్నకార్యసిద్ధి.

 

తుల

ఆదాయం ఆశించినంతగా ఉంటుంది. మిత్రుల సహాయంతో ముందుకు సాగుతారు. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం.కొత్త విషయాలు తెలుసుకుంటారు. పోటీపరీక్షల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలకు పదోన్నతి సూచనలు దక్కుతాయి. రాజకీయవర్గాల వారు విదేశీ పర్యటనలు చేస్తారు. పారిశ్రామికవర్గాల వారు కోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కళాకారులు అందిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు దక్కుతాయి. మీ కృషి ఫలిస్తుంది. సాంకేతిక రంగంవారికి ఊహించని కంపెనీల నుంచి అవకాశాలు. మహిళలు అందరిలోనూ ప్రత్యేక గౌరవం పొందుతారు. షేర్ల విక్రయాలు లాభిస్తాయి. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.

దుర్గామాతకు కుంకుమార్చన చేయించుకుంటే మంచిది.

చిత్త నక్షత్రం 3,4పాదాల వారికి సోమవారం మానసిక ఆందోళన. వ్యయప్రయాసలు. శనివారం భూలాభం. యత్నకార్యసిద్ధి.

స్వాతి వారికి బుధవారం బంధువిరోధాలు. కార్యక్రమాలలో ఆటంకాలు. గురువారం వాహనయోగం. సమస్యల పరిష్కారం.

విశాఖ 1,2,3పాదాల వారికి గురువారం మిత్రులతో కలహాలు. ఇంటాబయటా సమస్యలు. శుక్రవారం ఆస్తిలాభం. సోదరులతో సఖ్యత.

 

వృశ్చికం

పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థికపరంగా చికాకులు తొలగుతాయి. రుణదాతల ఒత్తిడుల నుంచి బయటపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. బంధువుల నుంచి కీలక సమాచారం.. ఆహ్వానాలు అందుతాయి. చిరకాల మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. గృహ, వాహనయోగాలు. ఆరోగ్యంపై శ్రద్ధ వ హించండి.. వ్యాపారాలలలో కొత్తపెట్టుబడులు సమకూరి లాభాల దిశగా పయనిస్తారు. ఉద్యోగులు విధినిర్వహణలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలవారు పదవులు దక్కించుకుంటారు. పారిశ్రామికవర్గాలకు విదేశీ సంస్థలతో ఒప్పందాలు. కళాకారులు అవార్డులు పొందుతారు. విద్యార్థులు పరిశోధనాత్మక విషయాలపై ్రశద్ధచూపుతారు. మహిళలు కుటుంబసభ్యుల చేయూతతో నిర్ణయాలు తీసుకుంటారు. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.

హనుమాన్ చాలీసా పఠించండి.

విశాఖ 4వపాదం వారికి గురువారం మిత్రులతో కలహాలు. ఇంటాబయటా సమస్యలు. శుక్రవారం ఆస్తిలాభం. సోదరులతో సఖ్యత. అనూరాధ వారికి సోమవారం కార్యజయం. ఆప్తుల నుంచి ధనలాభం. శుక్రవారం మానసిక అశాంతి. పనుల్లో అవరోధాలు.

జ్యేష్ఠ వారికి బుధవారం కొన్ని సమస్యల పరిష్కారం. శుభవర్తమానాలు. శనివారం వృథా ఖర్చులు. చర్మ, ఉదర సంబంధిత రుగ్మతలు..

 

ధనుస్సు

ఆదాయం పెరిగి అవసరాలు తీరతాయి. నూతన వ్యక్తుల పరిచయం. తీర్థయాత్రలు చేస్తారు.

 సభలు,సమావేశాలలో పాల్గొంటారు. బంధువుల నుంచి ఆసక్తికరమైన సమాచారం. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. మరింత అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగులు  ప్రమోషన్లు పొందుతారు. రాజకీయవర్గాలకు సన్మానాలు జరుగుతాయి. పారిశ్రామికవర్గాలవారికి అరుదైన అవకాశాలు దక్కుతాయి. కళాకారులు ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. విద్యార్థులకు శ్రమవృథా కాదు. తగిన ఫలితం పొందుతారు. మహిళలకు ఆస్తిలాభం కలుగుతుంది. శుభవర్తమానాలు. షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.

తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.

విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మూల నక్షత్రం వారికి సోమవారం పనుల్లో విజయం. చర్చలు సఫలం.  ఉద్యోగయోగం. బుధవారం ప్రయాణాలలో ఆటంకాలు. వ్యయప్రయాసలు.

పూర్వాషాఢ వారికి బుధవారం వ్యవహారాలలో విజయం. ఇంటర్వ్యూలు అందుతాయి. శనివారం ప్రయాణాలు వాయిదా. సోదరులతో కలహాలు.

ఉత్తరాషాఢ 1వపాదం వారికి గురువారం పనులలో విజయం. ముఖ్య సమాచారం. శుక్రవారం అనారోగ్యం.  ఉద్యోగయత్నాలు మందగిస్తాయి.

 

మకరం

ఉత్సాహంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. ప్రతిభకు గుర్తింపు పొందుతారు. ఉద్యోగయత్నాలు సానుకూలం. ముఖ్యమైన విషయాలలో నిర్ణయాలు తీసుకుంటారు. కాంట్రాక్టర్లకు అనుకూలం. దీర్ఘకాలిక సమస్య పరిష్కారమవుతుంది. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులతో లాభాల బాట పడతారు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాల వారు ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పారిశ్రామికవర్గాల వారు కొత్త సంస్థల్లో పెట్టుబడులు పెడతారు. కళాకారులకు కొన్ని అవకాశాలు ఊహించనిరీతిలో దక్కుతాయి. విద్యార్థులకు కోరుకున్న కోర్సులు దక్కుతాయి. మహిళలకు ఆరోగ్య సమస్యలు తీరతాయి. షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.

పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.

గణపతిస్తోత్రాలు పఠించండి.

ఉత్తరాషాఢ 2,3,4పాదాల వారికి గురువారం పనులలో విజయం. ముఖ్య సమాచారం. శుక్రవారం అనారోగ్యం.  ఉద్యోగయత్నాలు మందగిస్తాయి.

శ్రవణం వారికి శుక్రవారం కోర్టు వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. శనివారం వృథా ఖర్చులు. బంధువులతో తగాదాలు. 

ధనిష్ఠ 1,2పాదాల వారికి  సోమవారం నిర్ణయాలు పునఃసమీక్షించుకుంటారు. వ్యయప్రయాసలు. శ నివారం ఆస్తి, ధనలాభం. మిత్రులతో సఖ్యత.

 

కుంభం

ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. శత్రువులు సైతం మిత్రులుగా మారతారు. ఉత్సాహంతో వ్యవహారాలు చక్కదిద్దుతారు. కొన్ని సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. దూరపు బంధువుల నుంచి శుభవర్తమానాలు. ఆలయాలు సందర్శిస్తారు. వాహనయోగం.  పలుకుబడి పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఉద్యోగులకు విధుల్లో అనుకూల పరిస్థితి. ప్రమోషన్లు లభిస్తాయి. వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన సమయం. లాభాలు అందుతాయి. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. కళాకారులకు ఊహించని విధంగా సన్మానాలు. పారిశ్రామికవర్గాలవారు విదేశీ పర్యటనలు జరుపుతారు. విద్యార్థులకు సాంకేతిక విద్యలలో ప్రవేశాలు. మహిళలు కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. దక్షిణదిశ ప్రయాణాలు సానుకూలం.

శ్రీరామరక్షాస్తోత్రం పఠించండి.

ధనిష్ఠ 3,4పాదాల వారికి  సోమవారం నిర్ణయాలు పునఃసమీక్షించుకుంటారు. వ్యయప్రయాసలు. శనివారం ఆస్తి, ధనలాభం. మిత్రులతో సఖ్యత.

శతభిషం వారికి ఆదివారం వ్యయప్రయాసలు. గొంతు సంబంధిత రుగ్మతలు. సోమవారం శుభవార్తా శ్రవణం. ఉద్యోగయోగం. పూర్వాభాద్ర 1,2,3పాదాల వారికి బుధవారం ధనలబ్ధి. ఉద్యోగోన్నతి. గురువారం మానసిక అశాంతి. పనులు వాయిదా వేస్తారు.

 

మీనం

రావలసిన సొమ్ము అందుతుంది. కొత్త కార్యక్రమాలలో విజయం.  ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. చిరకాల ప్రత్యర్థులు సైతం అనుకూలురుగా మారతారు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. విలువైన సమాచారం అందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం. వ్యాపారాలకు అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగాలలో పదోన్నతులు దక్కుతాయి.  పారిశ్రామికరంగం.వారికి  అనుకోని విదేశీ ఆహ్వానాలు. కళాకారులకు అవార్డులు, పురస్కారాలు సంతోషం కలిగిస్తాయి. వ్యవసాయదారులు కొత్త ఆశలతో.ముందుకు సాగుతారు. విద్యార్థులకు అనూహ్యమైన విజయాలు. మహిళలు సంతోషకరమైన విషయాలు తెలుసుకుంటారు. షేర్ల విక్రయాలలో లాభాలు.

తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.

గణేశాష్టకం పఠించండి.

పూర్వాభాద్ర 4వ పాదం వారికి బుధవారం ధనలబ్ధి. ఉద్యోగోన్నతి. గురువారం మానసిక అశాంతి. పనులు వాయిదా వేస్తారు. ఉత్తరాభాద్ర వారికి గురువారం ఇంటర్వ్యూలలో విజయం. వివాదాల పరిష్కారం. శుక్రవారం అనారోగ్యం. ఇంటాబయటా ఒత్తిడులు. రేవతి వారికి ఆదివారం రావలసిన సొమ్ము అందుతుంది. వ్యవహారాలలో విజయం. గురువారం కుటుంబకలహాలు. రుణాలు చేస్తారు.

Sreekaram Subhakaram 21st Sept 2014, srikaram subhakaram zee telugu program, Srikaram Subhakaram Episodes, Srikaram Subhakaram Weekly Astrology Predictions, Vakkantam Chandra Mouli Srikaram Subhakaram, Telugu Astrology, TeluguAstrology, Free Astrology in Telugu, janmakundali.com, Zee Telugu Srikaram Subhakaram 21st Sept 2014, srikaram subhakaram zee telugu,