శ్రీ విళంబి నామ సంవత్సర మేషరాశి రాశి ఫలితాలు

0శ్రీ విళంబి నామ సంవత్సర మేషరాశి రాశి ఫలితాలు

అశ్విని నక్షత్రం 1,2,3,4 పాదములు , భరణి నక్షత్రం 1,2,3,4 పాదములు , కృత్తిక నక్షత్రం 1వ పాదములో జన్మించినవారు మేష రాశికి చెందును.

శ్రీ విళంబి నామ సంవత్సరంలో మేష రాశి వారికి ఆదాయం – 02 వ్యయం – 14 రాజపూజ్యం – 05 అవమానం – 07

మేష రాశి వారికి శ్రీ విళంబి నామ సంవత్సరం మిశ్రమ ఫలితాలను కలుగచేయును. ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారు కష్టంతో ఉద్యోగమును పొందును.విదేశీ ఉద్యోగం ప్రయత్నాలు చేయువారికి సంవత్సర ప్రారంభం లో అంత అనుకూలంగా పరిస్థితులు ఉండవు. వ్యాపార రంగంలోనివారికి ప్రారంభ మాసములలో అధిక వ్యయం, ధన సమస్యలు ఏర్పడి ద్వితీయ భాగంలో తగ్గును. సంతాన ప్రయత్నములు చేయువారికి ప్రయత్న ఆటంకములు ఎదురగును. బాగా ఎదిగిన సంతానం స్థిరత్వం విషయంలో సమస్యలు. నూతన ప్రయత్నాలకు శ్రమానంతర విజయం ఏర్పడును. అశ్రద్ధ వలన ఆరోగ్య సమస్యలు తీవ్రమగును. ఈ సంవత్సరం కోర్టు వ్యవహారాలలో విజయం లభించుట కష్టం. విద్యార్ధులకు ఆశించిన విద్య లభించును. చక్కటి పురోగతి ఏర్పడును. ఉద్యోగ జీవనంలోని వారికి ఆశించిన స్థాన చలనములు లభించును. వస్త్ర వ్యాపారములు, కందెన వ్యాపారములు చేయువారికి నష్టములు. రాజకీయ రంగం వారికి పదవీ లాభం. వ్యవసాయదారులకు రెండు పంటలు సామాన్యంగా ఫలించును.

మేష రాశి వారికి శ్రీ విళంబి నామ సంవత్సరంలో గురు గ్రహం వలన 10 – అక్టోబర్ – 2018 వరకూ చక్కటి అనుకూలమైన ఫలితాలు ఏర్పడును. వివాహ ప్రయత్నములు చేయువారికి ఆశించిన సంబంధములు ఏర్పరచును.11-అక్టోబర్ -2018 నుండి మధ్య మధ్య ధనలాభాములను , మధ్య మధ్య ధన నష్టములను కలుగచేయును.

మేష రాశి వారికి శ్రీ విళంబి నామ సంవత్సరంలో శని గ్రహం సంవత్సరం అంతా అనుకూలమైన ఫలితాలను కలుగచేయును. నల్లని వస్తువులు, నల్లని ధాన్యములు వలన లాభములు కలుగచేయును. పితృ వర్గం వారితో వైరములు, అపోహలు ఏర్పడును.

మేషరాశి వారికి శ్రీ విళంబి నామ సంవత్సరంలో రాహు – కేతువుల వలన మంచి ఫలితాలు ఏర్పడవు. వాహన ప్రమాదములను, గాయములను కలుగచేయును. శరీర శౌఖ్యం వుండదు. అనేక చిక్కులు ఏర్పరచును. రాహు – కేతువులకు శాంతి జపములు జరిపించుకోనుట మంచిది.

మార్చి 2018 మేషరాశి ఫలితాలు:

ఈ మాసంలో జీవిత భాగస్వామి మూలాన ధనప్రాప్తి. ఊహించని విధంగా ధన లాభములు. వృత్తి వ్యాపారముల వలన చక్కటి ధన సంపాదన.గృహ వాతావరణంలో చికాకులు , సంఘర్షణాపూర్వక వాతావరణం. 10వ తేదీ తదుపరి నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును. మాసాంతంలో వృధా వ్యయం. కార్యవిఘ్నత. ప్రభుత్వ వ్యవహారములలో అననుకూలత. ఈ నెలలో 3, 6, 16, 23 , 25, 26 తేదీలు మంచివి కావు.

ఏప్రిల్ 2018 మేషరాశి ఫలితాలు:

ఈ మాసంలో వ్యాపార వ్యవహారములు, ఆర్ధిక క్రయ విక్రయాలు అనుకూలంగా ఉండును. నూతన గృహ నిర్మాణ ప్రయత్నములు చేయువారికి ఆఖస్మిక ఆటంకములు. ప్రధమ మరియు ద్వితీయ వారములలో ధనాదాయం బాగుండును.విధ్యార్ధులకు ప్రయత్నములు ఫలించి ఆశించిన విద్యాప్రవేశం. తృతీయ వారంలో ఆటంకములతో కార్య సిద్ధి.అనారోగ్య సమస్యలు వేధించు సూచన. బాగా ఎదిగిన సంతానం ప్రవర్తన వలన ఆందోళన. 20 నుండి 24 తేదీల మధ్య ఋణములు కోసం చేయు ప్రయత్నాలు ఫలించును.వృత్తి వ్యాపారములు చేయువారికి ఈమాసం కలసి వచ్చును.

మే 2018 మేషరాశి ఫలితాలు:

ఈ మాసంలో ఆలోచనలు కార్య రూపం దాల్చును. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు కలసివచ్చును. ఆశించిన ఉద్యోగం పొందును. దూర ప్రాంత ప్రయాణముల వలన ధన వ్యయం ఏర్పడుటకు అవకాశం కలదు. ద్వితీయ వారంలో పెద్ద వయస్సు వారికీ చ్చాతి సంబంధమైన అనారోగ్య సమస్య. ఉద్యోగ జీవులకు పనిచేయు స్థానంలో శత్రుత్వాలు, వివాదాలు. త్రితియ వారంలో ధనాదాయం సామాన్యం.మిత్రుల విషయంలో నిర్లక్ష్యం వలన నష్టం.సమయ పాలనలో విఫలమగును. చివరి వారంలో స్థాన మార్పులు, ఉద్యోగ మార్పులు కొరకు చేయు ప్రయత్నములు లాభించును.శ్రమ అధికం. వ్యక్తిగత విషయాలకు సమయం కేటాయించలేరు.

జూన్ 2018 మేషరాశి ఫలితాలు:

ఈ మాసం అంతగా అనుకూలమైన ఫలితాలను కలిగించదు. ఏ వ్యవహారం తలపెట్టినా పూర్తి కావడం కష్టం. పుత్ర సంతానం కొరకు చేయు ప్రయత్నములకు , ఆర్ధిక లావాదేవీలకు ప్రతికూలమైన కాలం. భూ సంబంధమైన లేదా గృహ సంభంధమైన నష్టం ఏర్పడుటకు సూచనలు కలవు. వ్యాపార రంగంలోని వారికి స్తబ్దత. ధనం సమయానికి అందదు. పితృ వర్గం వారికి మంచిది కాదు. ఆరోగ్య సమస్యలు, మానశిక వ్యాకులత బాధించును. జీవిత భాగస్వామితో , సంతానంతో కోపతాపాలు తగ్గించుకోనిన మంచిది. సోమవారములు బియ్యం జలదానం చేయుట మంచిది.

జూలై 2018 మేషరాశి ఫలితాలు:

ఈ మాసం ప్రధమ వారంలో ఆఖస్మిక విరోధములు.శత్రుత్వం వలన బాధ. పట్టుదలకు పోవుట వలన వ్యవహార నష్టములు.కొన్ని ఆందోళనాపురిత సంఘటనలు.ధనాదాయం తగ్గును.ద్వితీయ వారంలో కూడా వ్యాపారంలో అనిచ్చితి కొనసాగును.17 వ తేదీ తదుపరి వివాహ ప్రయత్నములు లాభించును. కుటుంభ సభ్యులకు సంభందించిన శుభవార్తలు. చివరి వారంలో అనవసరమైన ప్రయానములు, సమయం వృధా. ఈ మాసంలో 7,11,13, 24 తేదీలు అనుకూలమైనవి కావు.

ఆగష్టు 2018 మేషరాశి ఫలితాలు:

ఈ మాసం కూడా మేషరాసి వారు మిశ్రమ ఫలితాలు పొందుదురు.జాతకంలో సర్ప దోషం కలిగివున్నవారు ఎక్కువ ప్రతికూలత ఎదుర్కొండురు. వ్యవహారములు చివరి నిమిషం వరకూ ఆందోళన కలిగించును. వ్యాపారములు సామాన్యం. ధనాదాయం మధ్యమం. నిర్లక్ష్య ప్రవర్తన వలన ఘర్షణలు. ఉద్యోగ జీవులకు వృధా వ్యయం. చివరి వారంలో వ్యక్తిగత జీవితంలో సౌఖ్యత. కుటుంబంతో ఆనందకర సమయం. ప్రయానములు ఫలించును.

సెప్టెంబర్ 2018 మేషరాశి ఫలితాలు:

ఈ మాసంలో అవివాహితుల వివాహ ప్రయత్నములు ఫలించును. గృహంలో నూతన వస్తువుల చేరిక. ప్రయత్నములలో ఏర్పడుతున్న ఆటంకములు తొలగును. శత్రు విజయం ఏర్పడును. ఆశించిన స్థాయిలో ఆదాయం. ద్వితీయ మరియు తృతీయ వారములలో సామాన్య సంతోషాలు.సంతాన సంబంధ అనుకూలత. 18 వ తేదీ తదుపరి శ్రమతో కూడిన అభివృద్ధి. 22, 23 తేదీలలో ఊహించని ధన సమస్యలు లేదా నష్టములు. మాసాంతంలో కుటుంబ విషయాలకు సమయం కేటాయించేదురు. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు.

అక్టోబర్ 2018 మేషరాశి ఫలితాలు:

ఈ మాసంలో మేష రాశి వారికి అనారోగ్య సమస్యలు తగ్గును. ధనాదాయంలో వ్రుద్ధి కనపడును.ఉద్యోగ మార్పుకు ఇది మంచి కాలం. వైవాహిక జీవనంలో సమస్యలు కుడా తగ్గును. మిత్రవర్గం తోడ్పాటు వలన కార్య భారం తగ్గును. కానీ 10 నుండి 15 వ తేదీలమధ్య ప్రారంభం ఐయిన పనులు తాత్కాలికంగా స్తంభించును. కొత్త ఆలోచనలు కార్యరూపం దాల్చుట కష్టం. విద్యార్ధులకు శ్రద్ధ అవసరం. తృతీయ వారంలో వాహనమూలక ఖర్చులు ఉండును. వృత్తి వ్యాపారములు సామాన్యంగా ఉండును. పోటీదారుల వలన సమస్యలు. వాయిదా పడుతూ వస్తున్న ప్రయానములు ఈ మాసంలో పూర్తి చేయుదురు.

నవంబర్ 2018 మేషరాశి ఫలితాలు:

ఈ మాసంలో విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు లేదా విదేశీ వ్యాపారము ప్రారంభించుటకు ప్రయత్నములు చేయువారికి లాభం ఏర్పడును. బంధు వర్గంతో కలయికలు. గృహంలో ఆకస్మిక శుభకార్యములు. స్తిరాస్థి లాభం. ప్రయానములు లాభించును. 22 వ తదుపరి నమ్మిన వారి వలన ఆర్ధిక ఇబ్బందులు. స్నేహ విరోధాలు. వ్యవహర అపజయాలు. శిరస్సుకు సంబందించిన ఆరోగ్య సమస్యలు. ఈ మాసంలో 5, 6, 14,20, 27 తేదీలు అనుకూలమైనవి కాదు.

డిసెంబర్ 2018 మేషరాశి ఫలితాలు:

ఈ మాసంలో వారసత్వ సంబంధ సొమ్ము ఆశించువారికి శుభవార్త. ధనాదాయంలో పెరుగుదల. శత్రు ఓటమి. నిరుద్యోగులకు మిశ్రమ ఫలితాలు. ఉద్యోగ ప్రయత్నాలు ఒక పట్టాన కొలిక్కి రావు. ద్వితీయ సంతాన ప్రయత్నాలు సఫలం అగును. క్రీడా సంబంధ వినోదం.గృహంలో సంతోషకరమైన వాతావరణం. మనోవాంచా ఫలసిద్ది. ఇష్ట కార్యసిద్ధి. మాసాంతంలో వ్యాపార రంగంలోని వారికి చక్కటి అబివృద్ధి. మొత్తం మీద ఈ మాసం కొద్దిపాటి అనుకూలమైన ఫలితాలనే కలుగచేయును.

జనవరి 2019 మేషరాశి ఫలితాలు:

ఈ మాసంలో మేషరాశి వారికి ధనాదాయం సామాన్యం. షేర్ మార్కెట్లో పెట్టుబడులు నష్టపరుచును. ధర్మ కార్యములకు , దానములకు ధనం వినియోగించేదారు. నిరుద్యోగులకు శుభవార్తలు.వ్యాపార వ్యవహారములు, స్థిరాస్థి సంబంధ క్రయవిక్రయాలు, వ్యవసాయ సంబంధ వ్యాపారములకు చక్కటి అభివృద్ధి. పాత మిత్రులతో కలయిక వలన కాలం ఉత్సాహంగా గడచును. తృతీయ , చతుర్ధ వారములలో ఖర్చులు, శ్రమ అధికం అగును.

ఫిబ్రవరి 2019 మేషరాశి ఫలితాలు:

ఈ మాసంలో ప్రతీ పని అనుకూలంగా జరుగును. నూతన వాహన కోరిక నెరవేరును. ధనాదాయం బాగుండును. చెవికి సంబంధించిన చిన్న సమస్య. నూతన వ్యక్తులతో పరిచయాలు. తన్మూలక లాభములు. విద్యార్ధులకు విజయములు. మైత్రీ వ్యవహారములకు ఈ మాసం అనుకూలమైనది. ఈ మాసంలో 13,20,26 తేదీలు అనుకూలమైన రోజులు కావు.

మార్చి 2019 మేషరాశి ఫలితాలు:

ఈ మాసం కూడా ప్రోత్సాహపురిత వాతావరణమును ఏర్పరచును. కుటుంబ , మిత్ర వర్గ సహకారం పూర్తిగా ఉండును. ధనలాభాలు ఏర్పడును. భూ లేదా పాత గృహ సంబంధ క్రయ విక్రయాలకు ఈ మాసం అనువైనది. కుటుంబంలో మాట గౌరవం. నూతన వస్తువుల ఆగమనం. సంతోషం. ఈ మాసంలో 17,18,19 తేదీలు వివాహ ప్రయత్నములకు , సంతాన ప్రయత్నములకు , ప్రేమ వ్యవహారములకు అనువైనవి.