Templates by BIGtheme NET
Home >> LIFESTYLE >> Srikaram Subhakaram 11th May 2014

Srikaram Subhakaram 11th May 2014


రాశి ఫలాలు

by Vakkantam Chandra Mouli, janmakundali.com

Srikaram Subhakaram 11th May 2014 Episode

Weekly Horoscope (2014-05-11  –  2014-05-17)

మేషం…

 ఆర్థికంగా బలం చేకూరుతుంది.
అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
ఆత్మీయులు మరింతగా దగ్గరవుతారు.
ఆశయాలు నెరవేరే సమయం.
ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు.
ఆలోచనలు అమలు చేసి ముందుకు సాగుతారు.
వస్తు, వస్త్రలాభాలు.
కొన్ని వివాదాలు నేర్పుతో పరిష్కరించుకుంటారు.
వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి., కొత్త పెట్టుబడులు అందుతాయి.
ఉద్యోగవర్గాలకు నూతనోత్సాహం. పదోన్నతులు.
పారిశ్రామికవర్గాలకు విదేశీ ఆహ్వానాలు.
కళాకారులు కొన్ని అవకాశాలు అప్రయత్నంగా పొందుతారు.
మహిళలకు సమస్యలు తీరి ఊరట లభిస్తుంది.
శుక్ర, శనివారాలలో ధనవ్యయం. భార్యాభర్తల మధ్య వివాదాలు.
పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.
హనుమాన్ చాలీసా మూడు సార్లు పఠించండి.

వృషభం…
——-
పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు.
ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి.
కోర్టు వ్యవహారాలు పరిష్కారమవుతాయి.
సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.
మీపై వచ్చిన అపవాదులు తొలగుతాయి.
ఆలయాలు సందర్శిస్తారు.
మనోధైర్యం పెరుగుతుంది.
విద్యార్థులు అనుకున్న ఫలితాలు పొందుతారు.
వ్యాపారాలు పుంజుకుంటాయి. లాభాలు తథ్యం.
ఉద్యోగులు విధుల్లో అవరోధాలు అధిగమిస్తారు.
పారిశ్రామిక, వైద్యరంగాల వారు రెట్టించిన ఉత్సాహంగా ముందుకు సాగుతారు.
కళాకారులకు అంచనాలు నిజమయ్యే వేళ.
మహిళలకు సోదరవర్గంతో సఖ్యత.
ఆది, సోమవారాలలో అనుకోని ఖర్చులు. ఇంటాబయటా సమస్యలు.
ఉత్తరదిశ ప్రయాణాలు సానుకూలం.
విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మిథునం…
——
ఆర్థిక లావాదేవీలు మొదట్లో కొంత నిరాశ కలిగించినా క్రమేపీ పుంజుకుంటాయి.
దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడి ఊపిరిపీల్చుకుంటారు.
ప్రతిభాపాటవాలు వెలుగులోకివస్తాయి.
నిరుద్యోగులకు ఉద్యోగయోగం.
ప్రముఖులతో చర్చలు జరుపుతారు.
ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
ఇంటిలో విందువినోదాలు, శుభకార్యాలు.
కొత్త కాంట్రాక్టులు పొందుతారు.
ఆశయాలు సాధనలో కుటుంబసభ్యుల చేయూత లభిస్తుంది.
వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలు తీరతాయి.
ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.
రాజకీయవర్గాలకు నూతనోత్సాహం.
కళాకారులకు సంతోషకరమైన వార్తలు.
మహిళ లు లక్ష్యాలు సాధిస్తారు, విశేష ఆదరణ పొందుతారు.
మంగళ, బుధవారాలలో ఆరోగ్యసమస్యలు. కుటుంబంలో వివాదాలు.
తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.
ఆదిత్య హృదయం పఠించండి.

కర్కాటకం…
——–
పనులు కొంత నెమ్మదిస్తాయి.
ఆర్థిక పరిస్థితి అంతంతగానే ఉంటుంది. రుణయత్నాలు సాగిస్తారు.
దూరప్రయాణాలు సంభవం.
నిర్ణయాలు తీసుకునే సందర్భంలో ఆచితూచి వ్యవహరించండి.
సోదరులు, బంధువుల నుంచి ఒత్తిడులు ఎదురవుతాయి.
సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.
పాతబాకీలు కొన్ని వసూలయ్యే అవకాశం ఉంది.
వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి.
ఆరోగ్య పరంగా కొద్దిపాటి చికాకులు తప్పవు.
వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.
ఉద్యోగులు కొత్త హోదాలు చేపడతారు.
పారిశ్రామిక,వైద్యరంగాల వారు ఒక సమాచారంతో ఊరటచెందుతారు.
కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. కోరుకున్న అవకాశాలు దక్కుతాయి.
మహిళలకు కుటుంబసభ్యులతో విభేదాలు తొలగుతాయి.
గురు, శుక్రవారాలలో మానసిక అశాంతి. పనుల్లో తొందరపాటు.
దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.
గణపతిని పూజించండి.

సింహం…
——
ఆర్థిక ఇబ్బందులు, తద్వారా రుణయత్నాలు.
బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.
ఆలోచనలు స్థిరంగా ఉండవు.
అనుకున్నదొక్కటి జరిగేది వేరొకటిగా ఉంటుంది.
సన్నిహితులతో అకారణవైరం.
ఆరోగ్యం మందగిస్తుంది, ఔషధసేవనం.
విలువైన వస్తువులు, డాక్యుమెంట్లు అతి జాగ్రత్తగా కాపాడుకోండి.
ముఖ్య వ్యవహారాలలో చర్చలు ఫలించవు.
వ్యాపార లావాదేవీలు నత్తనడకన సాగుతాయి.
ఉద్యోగులకు కొంత ఆదుర్దా తప్పదు.కొందరికి మార్పులు.
రాజకీయవర్గాలకు నిరుత్సాహమే.
కళాకారులకు సన్మానాలు జరుగుతాయి.
మహిళలకు కుటుంబంలో చికాకులు.
గురు, శుక్రవారాలలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి.
పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.
దుర్గాదేవిని పూజించండి.

కన్య…
——
కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు.
రావలసిన సొమ్ము అందుతుంది.
ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.
నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది.
ఆహ్వానాలు అందుతాయి.
స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది.
పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు.
ఇంటి నిర్మాణాలు ప్రారంభిస్తారు.
వాహనయోగం.
వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
ఉద్యోగులకు ఉన్నత హోదాలు ఖాయం.
పారిశ్రామికరంగం వారికి విదేశీ ఆహ్వానాలు అందుతాయి. ప్రగతిపథంలో సాగుతారు.
కళాకారులకు అనుకోని అవకాశాలు దక్కే సూచనలు.
మహిళలు ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు.
శనివారం ఆర్థిక ఇబ్బందులు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు.
తూర్పుదిశ ప్రయాణాలు సానుకూలం.
గణపతిని పూజించండి.

తుల…
—-
ఎటువంటి కార్యాన్నైనా పట్టుదలతో పూర్తి చేస్తారు.
ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి.
కొన్ని సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు.
ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు.
ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి.
తీర్థయాత్రలు చేస్తారు.
సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి.
కొత్త పరిచయాలు సంతోషం కలిగించవచ్చు.
వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. లాభాలు తథ్యం.
ఉద్యోగులు పనిభారం తగ్గి ఊరట చెందుతారు.
పారిశ్రామిక, వైద్యరంగాల వారికి యోగవంతమైన కాలం.
కళాకారులకు సన్మానయోగం.
మహిళలు కుటుంబసమస్యల నుంచి గట్టెక్కుతారు, కొందరికి ఉద్యోగయోగం.
మంగళ, బుధవారాలలో ఖర్చులు. కుటుంబసభ్యులతో విభేదాలు.
తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.
వేంకటేశ్వరస్వామిని ఆరాధించండి.

వృశ్చికం..
—–
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి.
ఆలోచనలు కార్యరూపంలో పెడతారు.
చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు.
భూవివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది.
కాంట్రాక్టులు పొందుతారు.
ఒక ప్రకటన నిరుద్యోగులకు ఊరటనిస్తుంది.
ఆలయాలు సందర్శిస్తారు.
వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
పారిశ్రామిక, రాజకీయవర్గాలకు నూతనోత్సాహం.
కళాకారులకు అవకాశాలు సంతృప్తినిస్తాయి.
మహిళలకు ఆస్తి లాభం.
మంగళ, బుధవారాలలో పనులు వాయిదా. చోరభయం.
ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.
విష్ణుసహస్ర నామ పారాయణ చేయండి.

ధనుస్సు…
——-
సోదరులు, మిత్రుల చేయూతతో పనులు చక్కదిద్దుతారు.
చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు.
ఆహ్వానాలు అందుతాయి.
స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు.
ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి.
పలుకుబడి పెరుగుతుంది.
నిరుద్యోగులకు ఉద్యోగయోగం.
చర్చలు ఫలిస్తాయి.
గత సంఘటనలు గుర్తుకు వస్తాయి.
భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు రాగలవు.
ఉద్యోగులు సంతోషకరమైన వార్తలు వింటారు.
పారిశ్రామిక, వైద్యరంగాల వారికి నూతనోత్సాహం,విదేశీ పర్యటనలు.
కళాకారులకు పురస్కారాలు అందుతాయి.
మహిళలకు కలసివచ్చేకాలం.
గురు, శుక్రవారాలలో బంధువులతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు.
తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.
దత్తాత్రేయుని పూజించాలి.

మకరం..
—–
ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి.
చిన్ననాటి మిత్రుల నుంచి ఆసక్తికరమైన సమాచారం.
ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం.
విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి.
పరపతి పెరుగుతుంది.
కాంట్రాక్టర్లకు కలిసివచ్చే కాలం.
సంఘంలో గౌరవం పెరుగుతుంది.
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.
ఉద్యోగులకు ఉన్నతహోదాలు ఖాయం.
పారిశ్రామికరంగం వారికి విదేశీ పర్యటనలు ఉంటాయి.
కళాకారులకు అవకాశాలు దగ్గరకు వచ్చి ఆశ్చర్యపరుస్తాయి.
మహిళలకు కుటుంబసభ్యులతో సఖ్యత.
ఆది, సోమవారాలలో ధననష్టం. అనారోగ్యం. చర్చలు విఫలం.
దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.
దుర్గామాతకు కుంకుమార్చన చేయించుకోండి.

కుంభం..
——–
అనుకున్న కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తాయి.
సంఘంలో మీదే పైచేయిగా ఉంటుంది.
సన్నిహితులు, మిత్రులతో వివాదాలు పరిష్కారం.
శుభకార్యాలలో పాల్గొంటారు.
చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు.
ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది.
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
రాబడి పెరుగుతుంది.
కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. పెట్టుబడులు అందుతాయి.
ఉద్యోగులకు హోదాలు దక్కే అవకాశం.
రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.
కళారంగం వారికి సన్మానాలు.
మహిళలకు ఆకస్మిక ధనలాభం.
ఆది, సోమవారాలలో వ్యయప్రయాసలు. గొంతు, ఉదర సంబంధిత రుగ్మతలు.
పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.
హనుమాన్ చాలీసా పఠించండి.

మీనం…
——
ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది.
వ్యవహారాలు నిదానంగా సాగుతాయి.
ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి.
వివాహ,ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి.
ప్రముఖులతో పరిచయాలు.
కాంట్రాక్టులు ఎట్టకేలకు దక్కించుకుంటారు.
వివాదాలకు దూరంగా ఉండండి.
కొన్ని ఒప్పందాలు వాయిదా వేస్తారు.
బంధువుల నుంచి అందిన సమాచారం కాస్త ఊరట కలిగించవచ్చు.
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
వ్యాపార విస్తరణయత్నాలు మందకొడిగా సాగుతాయి.
ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు.
రాజకీయ, పారిశ్రామికరంగాల వారికి ఒత్తిడులు పెరుగుతాయి.
కళారంగం వారికి అవకాశాలు కొంత అసంతృప్తికలిగిస్తుంది.
మహిళలకు మానసిక అశాంతి.
శనివారం శుభవార్తలు. ధన, వస్తులాభాలు. యత్నకార్యసిద్ధి.
తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.
ఆదిత్య హృదయం పఠించండి.

Tags; Srikaram Subhakaram Episodes, Srikaram Subhakaram Weekly Astrology Predictions, Vakkantam Chandra Mouli Srikaram Subhakaram, Telugu Astrology, TeluguAstrology, Free Astrology in Telugu, janmakundali.com, Zee Telugu Srikaram Subhakaram 11th May 2014,