Srikaram Subhakaram 16th Feb 2014

0



Srikaram Subhakaram 16th Feb 2014

రాశి ఫలాలు

26th Jan 201–1st Feb 2014 by Vakkantam Chandra Mouli, janmakundali.com

Weekly Horoscope (2014-02-16  –  2014-02-22)

మేషం
ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి
కొత్త ఆశలతో ముందుకు సాగుతారు
పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు
ఆత్మీయుల సహాయం అందుతుంది
మిత్రుల నుంచి శుభ వార్తలు అందుతాయి
జీవితాశయం నెరవేరుతుంది
స్వల్ప అనారోగ్య సూచన , ఔషధ సేవనం కూడా తప్పదు
మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి
జీవితాశయం నెరవేరుతుంది
నిరుద్యోగులకు అనుకోని అవకాశాలు లభిస్తాయి
వ్యాపారులకు లాభాలు అనుకున్న విధంగా ఉంటాయి
ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి
పారిశ్రామికవేత్తలకు విదేశీయానం
కళాకారులు అనుకున్నది సాదిస్తారు
మహిళలకు కుటుంబం లో చికాకులు తొలగుతాయి
ఆదివారం అనుకోని సంఘటనలు, ఆస్తి వివాదాలు, ఆలోచనలు స్థిరం గా ఉండవు
తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి
నరసింహస్వామి ని పూజించడం మంచిది

 

వృషభం
కొత్త పనులకు చుడతారు
ఆర్ధిక లావాదేవీలు ఉత్సాహం గా సాగుతాయి
పట్టుదల పెరుగుతుంది
మీ శక్తి యుక్తి ని పదిమంది గుర్తిస్తారు
ఆహ్వానాలు అందుతాయి
అనారోగ్య సమస్యలు తీరుతాయి
తీర్థ యాత్రలు చేస్తారు
వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు
పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి
వ్యాపారాల లో కొత్త పెట్టుబడులు అందుతాయి
ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి
రాజకీయవర్గాలకు పదవీయోగం
మహిళలకు కుటుంబంలో గౌరవాలు దక్కుతాయి
కళాకారులు కొత్త ఆశలతో ముందడుగు వేస్తారు
ఆది, సోమవారాల లో బంధువిరోధాలు, ధన వ్యయం, కుటుంబం లో చికాకులు ఉంటాయి
ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి
విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది

 

మిథునం
పనులు కొంత నెమ్మదిస్తాయి
ఆర్ధిక పరిస్థితి పర్వాలేదనిపిస్తుంది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి
దూరపు బంధువులు నుంచి శుభవార్తలు
ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగి ఉపశమనం కలుగుతుంది
విలువైన వస్తువులు జాగ్రత్త గా చూసుకోవాలి
చిరకాల వాంఛ నెరవేరుతుంది
ఆరోగ్యపరం గా కాస్త జాగ్రత్త వహించవలసి ఉంటుంది
కుతుబసభ్యుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి
వ్యాపార లావాదేవీలు సామాన్యం గా ఉంటాయి. స్వల్ప లాభాలు
ఉద్యోగులకు పదోన్నతి తో కూడిన బదిలీలు ఉంటాయి
పారిశ్రామికవేత్తలకు కొంత అనుకూలం
కళాకారులకు అవకాశాలు అసంతృప్తి కలిగిస్తాయి
మహిళలకు కుటుంబం లో గౌరవం పెరుగుతుంది
శనివారం ధన, వస్తు లాభాలు, యత్న కార్యసిద్ది, భార్యాభర్తల మధ్య వివాదాలు తొలగుతాయి
పశ్చిమ దిశ ప్రయాణాలు సానుకూలం
రావిచెట్టు కి 9 ప్రదక్షిణలు చేయడం మంచిది

 

కర్కాటకం
ఆర్ధిక విషయాలు నిరాశ కలిగిస్తాయి
అనుకోని ఖర్చులు ఎదురవుతాయి
ఆలోచలనలు స్థిరం గా ఉండవు
ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి
అనారోగ్య సూచనలు
కాంట్రాక్టులు చేజారుతాయి
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు
వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి
ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు ఉంటాయి
పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు రద్దు కాగలవు
కళాకారులకు గందరగోళ పరిస్థితులు ఉంటాయి
మహిళలకు అన్ని విషయాలలో అనుకూల పరిస్థితులు ఉండవు
షేర్ల విక్రయాలతో తొందరపాటు వద్దు
మంగళ, బుధవారాలలో శుభ వర్తమానాలు. ధనలాభం. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి
తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి

 

సింహం
రావలసిన సొమ్ము అందుతుంది
వ్యవహారాలు సంతృప్తికరం గా సాగుతాయి
ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకొంటారు
సంఘం లో పరపతి పెరుగుతుంది
సన్నిహితుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది
ఆస్తి విషయాలలో బంధువులతో తగాదాలు పరిష్కారం
చిరకాల ప్రథ్యర్దులు మిత్రులుగా మారి మీకు చేదోడుగా నిలుస్తారు
విధి నిర్వహణ లో ఉద్యోగులు మంచి గుర్తింపు పొందుతారు
వ్యాపారాలలో ఊహించని రీతిలో పెట్టుబడులు అందుతాయి. విస్తరణ యత్నాలు కలసి వస్తాయి
రాజకీయవర్గాలకు నూతనోత్సాహం
కళాకారులకు అరుదైన అవకాశాలు లభిస్తాయి
మహిళలకు సంతోషకరమైన వార్తలు అందుతాయి
ఆరోగ్యం కుదుటపడుతుంది
షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి
శనివారం ఖర్చులు పెరుగుతాయి. శ్రమ అధికం గా ఉంటుంది
తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి
హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మంచిది

 

 

కన్య
అదనపు ఆదాయం సమకూరుతుంది
సన్నిహితులు మరింత దగ్గరవుతారు
కుటుంబ సమస్యలు తీరి ఊరట చెందుతారు
పనుల్లో విజయం సాదిస్తారు
నిరుద్యోగులకు ఉద్యోగలాభం
ఆలోచనలు కలసి వస్తాయి
కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి
ఆలయాలు సందర్శిస్తారు
కోర్టు వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది
ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి
కళాకారుల కు అవార్డులు, సన్మానాలు ఉంటాయి
వ్యాపారస్తులకు పెట్టుబడులకు తగిన లాభాలు దక్కుతాయి
షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి
ఆదివారం మానసిక అశాంతి, కుటుంబ సభ్యులతో కలహాలు. భార్య భర్తల మధ్య వివాదాలు ఉంటాయి
గణపతి ని పూజించడం అన్నివిధాల మంచిది

 

తుల
ఆదాయం కొంత పెరుగుతుంది
సన్నిహితులు, స్నేహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి
శుభకార్యాలలో పాల్గొంటారు
రావలసిన బాకీలు అందుతాయి
అరుదైన ఆహ్వానాలు రాగలవు
ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు
సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు
విద్యార్దులకు అనుకూలమైన ఫలితాలు రావచ్చు
వ్యాపారాల విస్తరణయత్నాలు కొంత వరకూ అనుకూలిస్తాయి
ఉద్యోగులకు పదోన్నతి సూచనలు, విధుల్లో భారం తగ్గుతుంది
పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు ఉంటాయి
కళాకారుల అంచనాలు నిజమవుతాయి
మహిళలకు శుభవార్తలు అందుతాయి
ఆరోగ్యం కొంత మందగిస్తుంది
షేర్ల విక్రయాలు లాభిస్తాయి
మంగళ, బుధవారాలలో వ్యయప్రయాసలు, సోదరులతో కలహాలు, వివాదాలు ఉంటాయి
దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి
దక్షిణామూర్తి స్తోత్రాలు చదవడం మంచిది

 

వృశ్చికం
ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం సాదిస్తారు
దూరప్రాంతాల నుంచి శుభ వర్తమానాలు అందుతాయి
బంధువర్గం తో ఉల్లాసం గా గడుపుతారు
మీ సేవలకు గుర్తింపు లభిస్తుంది
కాంట్రాక్టులు పొందుతారు
భూములు, భవనాలు కొనుగోలు చేస్తారు
దేవాలయాలు సందర్శిస్తారు
అనారోగ్య సమస్యలు తీరుతాయి
చర స్థిరాస్తులు వృద్ది చెందుతాయి
ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. గందరగోళ పరిస్థితులు చక్కబడతాయి
వ్యాపారాలలో అనుకున్న లాభాలు ఉంటాయి
పారిశ్రామిక, సాంకేతిక వర్గాలకు నూతనోత్సాహం నెలకొంటుంది
కళాకారులకు కొత్త అవకాశాలు అందుతాయి
మహిళలకు ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుతాయి
షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి
గురు, సుక్రవారాలలొ మనశాంతి లోపిస్తుంది, భార్యాభర్తల మద్య తగాదాలు నెలకొంటాయి
పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి
నవగ్రహ ప్రదక్షిణలు చేయడం మంచిది

 

ధనుస్సు
ఆర్ధిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది
కొత్త పనులకు శ్రీకారం చుడతారు
ఆత్మీయుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుకొంటారు
ప్రతిభ వెలుగులోకి వస్తుంది
భార్యాభర్తల మధ్య అపార్ధాలు తొలగుతాయి
ఆరోగ్యం కొంత మెరుగ్గా ఉంటుంది
ఇంతకాలం పడిన కష్టం ఫలించే సమయం
వ్యాపారాలు క్రమేపి పుంజుకొంటాయి
ఉద్యోగులకు ఉన్నతహోదాలు దక్కుతాయి
పారిశ్రామికవర్గాలకు విదేశీ ఆహ్వానాలు అందుతాయి
సాంకేతికవర్గాల వారు పట్టుదలతో సాగి విజయాలు సాదిస్తారు
కళాకారులకు అనుకున్నది సాదిస్తారు
మహిళలకు కుటుంబం లో ప్రోత్సాహకరంగా’ ఉంటుంది. ధనలాభం కూడా ఉంటుంది
షేర్ల విక్రయాలు లాభిస్తాయి
ఆదివారం కుటుంబ సభ్యులతో కలహాలు, పనుల్లో అవరోధాలు ఉంటాయి. శ్రమ తప్పదు
ఉత్తర దిశ ప్రయాణాలు సానుకూలం
హనుమాన్ చాలీసా చదవడం మంచిది

 

మకరం
ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి
సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు
శ్రేయోభిలాషులు సలహాలను పాటిస్తారు
సంఘం లో గౌరవమర్యాదలు పెరుగుతాయి
కొత్త కాంట్రాక్టులు పొందుతారు
అందరిలోనూ గుర్తింపు పొందుతారు
స్వల్ప అనారోగ్యం ఉంటుంది. ఔషధ సేవనం తప్పదు
వాహనాలు, ఆభరణాలు సమకూరుతాయి
వ్యాపారాలు విస్తరిస్తారు. కొత్త పెట్టుబడులు అందుతాయి
ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ప్రశంసలు
పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతం గా ఉంటుంది
కళాకారులకు పురస్కారాలు అందుతాయి
మహిళలకు ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి
షేర్ల విక్రయాలు లాభసాటిగా సాగుతాయి
మంగళ, బుధవారాలలో ధన నష్టం. కుటుంబం లో చికాకులు. ఆలోచనలు స్థిరం గా ఉండవు
పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం
గణపతిని పూజించడం మంచిది

 

కుంభం
పనుల్లో కొద్దిపాటి జాప్యం
ఆర్ధిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది
ముఖ్య నిర్ణయాలు వాయిదావేస్తారు
ఆలోచనలు స్థిరం గా ఉండవు
చర్మ సంబంధిత రుగ్మతులు వేధిస్తాయి
తండ్రి తరఫు వారితో వివాదాలు నెలకొంటాయి
దూరప్రయాణాలు ఉంటాయి
ఆదరించిన వారే విమర్శలు గుప్పిస్తారు
తీర్థ యాత్రలు చేస్తారు
వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. పెట్టుబడుల్లో తొందరవద్దు
ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు జరిగే అవకాశాలు ఉన్నాయి.
కళాకారులకు అవకాశాలు వారం చివరిలో దక్కుతాయి
మహిళలకు కొంత గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి
షేర్ల విక్రయాల్లో స్వల్ప లాభాలు
ఆదివారం కుటుంబ సౌఖ్యం. విలువైన సమాచారం అందుతుంది, విందులు వినోదాలలో పాల్గొంటారు
దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి
అంగారక స్తోత్రం చదవడం మంచిది

 

మీనం
పరపతి కలిగిన వారితో ఏర్పడతాయి
సభలు, సమావేశాల్లో పాల్గొంటారు
పాతబాకీలు సైతం వసూలవుతాయి
గతం లో నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు
బంధువులతో మంచి చెడ్డా విచారిస్తారు
కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొంటారు
దేవాలయాలు సందర్శిస్తారు
స్థిరాస్థి లాభం.
గుర్హ నిర్మాణాలు చేపట్టే వీలుంది
వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం
ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి
పారిశ్రామికవేత్తలకు కొత్త సంస్థల ఏర్పాటులో ఆటంకాలు తొలగుతాయి
కళాకారులకు నూతనోత్సాహం, అనుకోని అవకాశాలు దక్కుతాయి
మహిళలకు ఉత్సాహవంతం గా ఉంటుంది
షేర్ల విక్రయాలు లాభిస్తాయి
గురు, శుక్రవారాలలొ ఖర్చులు పెరుగుతాయి.
తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి
దుర్గాదేవిని పూజించండి