Srikaram Subhakaram 16th March 2014

0Srikaram Subhakaram 16th March 2014

రాశి ఫలాలు

16th Mar2014–22nd Mar 2014 by Vakkantam Chandra Mouli, janmakundali.com

Weekly Horoscope (2014-03-16  –  2014-03-22)

మేషం..
—–
ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి.
దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి.
ఆలోచనలు అమలు చేస్తారు.
అందరిలోనూ మీప్రత్యేకత చాటుకుంటారు.
ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి.
కాంట్రాక్టులు పొందుతారు.
జీవిత భాగస్వామితో వివాదాలు పరిష్కారం.
ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి.
ఆహ్వానాలు, గ్రీటింగ్లు అందుతాయి.
వ్యాపారాలు విస్తరిస్తారు.
ఉద్యోగులకు ఉన్నత హోదాలు తథ్యం.
పారిశ్రామివర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.
కళాకారులు కొత్త అవకాశాలను దక్కించుకుని ఉత్సాహంగా సాగుతారు.
మహిళలకు ప్రోత్సాహ కరమైన కాలం.
సోమ, మంగళవారాలలో ధనవ్యయం. భార్యాభర్తల మధ్య వివాదాలు. మానసిక ఆందోళన.
ఉత్తరదిశ ప్రయాణాలు సానుకూలం.
ఆదిత్య హృదయం పఠించండి.

వృషభం..
——
ఈవారం కొన్ని కార్యక్రమాలు నెమ్మదిగా సాగుతాయి.
ఆత్మీయులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు.
బంధువుల నుంచి కొన్ని విషయాలలో ఒత్తిళ్లు.
భవిష్యత్పై కొంత ఆందోళన నెలకొంటుంది.
ప్రత్యర్థులు కొంత మెత్తబడే అవకాశం.
విలువైన వస్తువులు కొంటారు.
వివాదాలు కొన్ని పరిష్కారదశకు చేరతాయి.
వ్యాపారులకు కొద్దిపాటి లాభాలు.
ఉద్యోగులు అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు.
పారిశ్రామికర్గాలకు విదేశీ పర్యటనలు.
కళాకారులకు కొంత మానసిక ఆందోళన తప్పదు.
శుక్ర, శనివారాలలో ధన, వస్తులాభాలు. భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగుతాయి. వాహనయోగం.
తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.
విష్ణుసహస్రనామ పారాయణచేయండి.

మిథునం..
——
కొత్త పనులు చేపడతారు.
ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి.
ఇంటాబయటా మీకు ఎదురులేని పరిస్థితి.
వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభం .
ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.
కోర్టు కేసు ఒకటి అనుకూలంగా పరిష్కారం.
వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. కొత్త పెట్టుబడులు సమకూరతాయి.
ఉద్యోగులకు అనుకోని హోదాలు తథ్యం.
పారిశ్రామికవర్గాలకు అనూహ్యమైనరీతిలో ఆహ్వానాలు రాగలవు.
కళాకారులకు సన్మానాలు.
మహిళలకు సోదరులతో వివాదాలు తీరతాయి.
బుధ, గురువారాలలో అనుకోని ఖర్చులు. మనశ్శాంతిలోపిస్తుంది. స్వల్ప అనారోగ్యం.
దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.
దుర్గాదేవిని పూజించండి.

కర్కాటకం…
——-
కొత్తకార్యక్రమాలు చేపడతారు.
రావలసిన బాకీలు అందుతాయి.
ఆత్మీయుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది.
స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు.
కాంట్రాక్టులు దక్కి ఉత్సాహంగా ముందుకు సాగుతారు.
నూతన వ్యక్తుల పరిచయం.
శుభకార్యాలలో పాల్గొంటారు.
వాహనయోగం.
వ్యాపారాలు అభివృద్ధిపథంలో సాగుతాయి.
ఉద్యోగులకు ఉన్నతహోదాలు దక్కవచ్చు.
పారిశ్రామికవర్గాలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు అందుతాయి.
కళాకారులకు సన్మానాలు, సత్కారాలు అందుతాయి.
విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు.
మహిళలకు నూతనోత్సాహం.
శుక్ర, శనివారాలలో కుటుంబసభ్యులతో తగాదాలు. బంధువిరోధాలు. సోదరులు, సోదరీల నుంచి అపవాదులు.
తూర్పుదిశ ప్రయాణాలు సానుకూలం.
ఆంజనేయదండకం పఠించండి.

సింహం..
——-
కొత్త విషయాలు తెలుసుకుంటారు.
మీ ప్రజ్ఞాపాటవాలు వెలుగులోకి వస్తాయి.
ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.
చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు.
నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు.
ఆలయాలు సందర్శిస్తారు.
ప్రముఖుల నుంచి కీలక సందేశం.
ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి.
వ్యాపారులకు అనుకున్న లాభాలు తథ్యం.
ఉద్యోగులు కొత్త బాధ్యతలుీ స్వకరిస్తారు.
పారిశ్రామిక, వైద్యరంగాల వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది.
కళాకారుల అంచనాలు నిజమవుతాయి.
మహిళలకు మానసిక ప్రశాంతత.
సోమ, మంగళవారాలలో ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్య సమస్యలు.
ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.
విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కన్య…
——-
ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది.
కొత్తగా రుణాలు చేయాల్సివస్తుంది.
ప్రతిభ ఉన్నా తగిన గుర్తింపు పొందలేరు.
ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి.
అనారోగ్య సూచనలు.
విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి.
బంధువులు, మిత్రులతో అకారణ వైరం.
వాహనాల విషయంలో మెలకువ పాటించండి.
వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
ఉద్యోగులకు స్థానమార్పులు ఉండవచ్చు.
రాజకీయ, సాంకేతికవర్గాలకు విదేశీ పర్యటనల్లో మార్పులు.
కళాకారులకు ఒత్తిడులు పెరుగుతాయి.
మహిళలకు కొంత నిరాశ చెందుతారు.
శుక్ర, శనివారాలలో ధనలాభం. యత్నకార్యసిద్ధి. నూతన పరిచయాలు.
దక్షిణదిశ ప్రయాణాలు సానుకూలం.
ఆదిత్య హృదయం పఠించండి.

తుల…
—–
రావలసిన డబ్బు అందక ఇబ్బంది పడతారు.
ఆలోచనలు స్థిరంగా ఉండవు.
విచిత్రమైన సంఘటనలు.
వాహనాలు, ఆరోగ్య విషయాలలో నిర్లక్ష్యం వద్దు.
కష్టపడ్డా ఫలితం కనిపించదు.
బంధువులతో తగాదాలు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
పాతమిత్రులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు.
వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. లాభాలు కష్టమే.
ఉద్యోగులకు అనుకోని మార్పులు ఉండవచ్చు.
పారిశ్రామిక, సాంకేతికవర్గాల వారు ఆచితూచి వ్యవహరించాలి.
కళాకారులు అందిన అవకాశాలు సైతం జారవిడుచుకుంటారు.
మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది.
సోమ, మంగళవారాలలో శుభవర్తమానాలు. అదనపు రాబడి. కుటుంబసౌఖ్యం.
ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.
శివస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం…
——-
పట్టింది బంగారమే.
ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి.
బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.
మీ ఆశయాలు నెరవేరతాయి.
ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.
ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి.
స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు.
వాహనాలు, ఇళ్లు కొనుగోలు యత్నాలు సానుకూలం.
నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి.
ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి.
కళాకారులకు అవార్డులు దక్కుతాయి.
మహిళలకు కొన్ని వివాదాలు తీరతాయి.
శుక్ర, శనివారాలలో ఖర్చులు, ఇంటాబయటా ఒత్తిడులు. ఆరోగ్యసమస్యలు.
భార్యాభర్తల మధ్య వివాదాలు.
తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.
వేంకటేశ్వరస్వామిని పూజించండి.

ధనుస్సు…
——
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
సన్నిహితుల సాయంతో ముందుకు సాగుతారు.
ప్రముఖులతో పరిచయాలు.
సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి.
విచిత్రమైన సంఘటనలు ఉంటాయి.
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
ఆస్తి వివాదాలు పరిష్కారం.
శుభకార్యాలలో పాల్గొంటారు.
వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు.
వ్యాపారాలు విస్తరిస్తారు. కొత్త పెట్టుబడులకు తగిన సమయం.
ఉద్యోగులు కొత్త హోదాలు దక్కించుకుంటారు.
పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ ఆహ్వానాలు అందుతాయి.
కళాకారులకు అంచనాలు నిజమవుతాయి.
మహిళలు కుటుంబసభ్యుల ఆదరణ పొందుతారు.
బుధ, గురువారాలలో కార్యక్రమాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. మానసిక ఆందోళన.
తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.

మకరం…
——
రావలసిన సొమ్ము అందుతుంది.
వ్యవహారాలలో విజయం.
శుభకార్యాలు నిర్వహిస్తారు.
అందరిలోనూ ప్రత్యేకత చాటుకుంటారు.
ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు.
పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు.
కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు.
విద్యార్థులు, నిరుద్యోగులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.
ఇతరులకు సాయపడి దాతృత్వాన్ని చాటుకుంటారు.
వ్యాపారాలలో అనుకున్న విధంగా లాభాలు దక్కుతాయి.
ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.
పారిశ్రామిక, వైద్యరంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది.
కళాకారులకు ఉత్సాహవంతమైన కాలం.
మహిళలకు కుటుంబంలో విశేష గౌరవం లభిస్తుంది.
సోమ, మంగళవారాలలో చర్చలు విఫలం. చర్మసంబంధిత రుగ్మతలు.
భార్యాభర్తల మధ్య అపోహలు.
తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.
హనుమాన్ చాలీసా పఠించండి.

కుంభం…
—–
ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు.
అనుకున్న విధంగా డబ్బు చేతికందుతుంది.
కుటుంబ, సంతానపరమైన నిర్ణయాలు తీసుకుంటారు.
కొత్త ఆశలతో ముందుకు సాగుతారు.
నిరుద్యోగులు అనుకున్న ఉద్యోగాలుసాధిస్తారు.
పలుకుబడి పెరుగుతుంది.
భూములు, వాహనాలు కొంటారు.
వ్యాపారులు మరింతగా లాభపడతారు.
ఉద్యోగులు కొత్త హోదాలు దక్కించుకుంటారు.
పారిశ్రామికవర్గాలకు అనుకోని ఆహ్వానాలు.
కళాకారులు అవార్డులు పొందుతారు.
మహిళలకు వివాదాలు తీరి ఊరట లభిస్తుంది.
బుధ, గురువారాలలో అనుకోని ఖర్చులు,
గొంతు, ఉదర సంబంధిత రుగ్మతలు, బంధువిరోధాలు.
పశ్చిమదిశ ప్రయాణాలు సానుకూలం.
ఆదిత్య హృదయం పఠించండి.

మీనం..
—–
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
అనుకున్న సమయానికి కార్యక్రమాలు పూర్తి చేస్తారు.
సంఘంలో విశేషమైన గౌరవం పొందుతారు.
ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి.
ప్రముఖుల నుంచి కీలక సందేశం.
ఆశ్చర్యకరమైన విషయాలు గ్రహిస్తారు.
కోర్టు వ్యవహారాలు అనుకూలంగా పరిష్కారం.
వ్యాపారులు కొత్త పెట్టుబడులు అంది ఉత్సాహంగా సాగుతారు.
ఉద్యోగులు విధుల్లో ప్రతిబంధకాలు అధిగమిస్తారు.
పారిశ్రామిక, వైద్యరంగాల వారికి సన్మానాలు.
విద్యార్థులు ఇంటర్వ్యూలు అందుకుంటారు.
కళాకారులకు కొన్ని సమస్యలు తీరతాయి.
మహిళలు అనుకున్నది సాధించాలన్న తపనతో ముందడుగు వేస్తారు.
శుక్ర, శనివారాలలో దుబారా ఖర్చులు,
గొంతు సంబంధిత రుగ్మతలు. సోదరులు, సోదరీలతో విభేదాలు.
ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.
శివస్తోత్రాలు పఠించండి.

Tags : Srikaram Subhakaram Episodes, Srikaram Subhakaram Weekly Astrology Predictions, Vakkantam Chandra Mouli Srikaram Subhakaram, Telugu Astrology, TeluguAstrology, Free Astrology in Telugu, janmakundali.com, Srikaram Subhakaram 9th March 2014

Srikaram Subhakaram 9th March 2014