Templates by BIGtheme NET
Home >> LIFESTYLE >> Srikaram Subhakaram 18th May 2014

Srikaram Subhakaram 18th May 2014


రాశి ఫలాలు

by Vakkantam Chandra Mouli, janmakundali.com

Srikaram Subhakaram 18th May 2014

Weekly Horoscope (2014-05-18  –  2014-05-24)

మేషం…
—–
ఈ వారం మీ అంచనాలు, ఊహలు నిజమయ్యే సమయం.
ఆర్థికంగా కొంత నిలదొక్కుకుంటారు.
ఆలోచనలు అమలు చేస్తారు.
.చిరకాల ప్రత్యర్థులు అనుకూలంగా మారతారు.
కాంట్రాక్టులు పొందుతారు,
ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు.
సంఘంలో గౌరవం పెరుగుతుంది.
ఆలయాలు సందర్శిస్తారు.
పలుకుబడి పెంచుకుంటారు.
వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కుతాయి.
రాజకీయ, పారిశ్రామికరంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది.
కళాకారులకు నూతనోత్సాహం, అవార్డులు లేదా సన్మానాలు.
మహిళలకు ఒక వార్త సంతోషం కలిగిస్తుంది.
ఆది, సోమవారాలలో ధననష్టం. చికాకులు. మానసిక అశాంతి.
పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.
గణపతిని పూజించండి.

వృషభం…
——-
క్రమేపీ అనుకూల పరిస్థితులు నెలకొంటాయి.
చిరకాల ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు.
చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది.
ఇంటాబయటా మీకు ఎదురుండదు.
వివాదాల నుంచి బయటపడతారు.
చాకచక్యంగా సమస్యలు పరిష్కరించుకుంటారు.
వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు.
పాతబాకీలు కొన్ని వసూలవుతాయి.
ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి.
బంధువులు, మిత్రుల సంపూర్ణ సహకారం అందుతుంది.
వ్యాపారాలు విస్తరణలో ఆటంకాలు అధిగమిస్తారు.
ఉద్యోగులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి.
పారిశ్రామిక, వైద్యరంగాల వారికి విదేశీ పర్యటనలు ఉంటాయి.
కళాకారులకు అనుకున్న అవకాశాలు దగ్గరకు వస్తాయి.
మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
మంగళ, బుధవారాలలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు.
ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి.
శివాలయంలో అభిషేకం చేయించుకుంటే మంచిది.

మిథునం..
——
రాబడి కొంత పెరిగి ఊరట లభిస్తుంది.
ఒక సమస్య కుటుంబసభ్యుల సహకారంతో పరిష్కరించుకుంటారు.
ప్రతిభాపాటవాలకుతగిన గుర్తింపు పొందుతారు.
మీ అంచనాలు నిజం చేసుకునేందుకు చేసే యత్నాలు సఫలం.
ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి.
పలుకుబడి పెరుగుతుంది.
సన్నిహితులతో వివాదాలు తీరతాయి.
కొత్త కాంట్రాక్టులు పొందుతారు.
ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుతారు.
సేవాభావం పెరుగుతుంది.
వ్యాపారాలలో ఒడిదుడుకులు తగ్గుతాయి.
ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి.
పారిశ్రామిక, వైద్యరంగాల వారు రెట్టించిన ఉత్సాహంగా ముందుకుసాగి విజయాలుసాధిస్తారు.
కళాకారులకు కొత్త అవకాశాలు.
గురు, శుక్రవారాలు ఖర్చులు. మానసిక ఆందోళన.భార్యాభర్తల మధ్య విభేదాలు.
తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.
దుర్గామాతకు కుంకుమార్చన చేయించుకుంటే మంచిది.

కర్కాటకం…
———
ఇంటిలో శుభకార్యాల రీత్యా ఖర్చులు.
అదనపు ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి.
ఓర్పు, నేర్పుతో వివాదాల నుంచి గట్టెక్కుతారు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు.
జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లేదా ధనలాభ సూచనలు.
ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుతారు.
అందరిలోనూ గుర్తింపు రాగలదు.
పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు.
ఉద్యోగులకు ఉన్నత హోదాలు తథ్యం.
పారిశ్రామిక, వైద్యరంగాల వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది.
కళాకారులకు ఒక ప్రకటన సంతోషం కలిగిస్తుంది.
మహిళలకు ఆస్తిలాభం కలుగుతుంది.
గురు, శుక్రవారాలలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు.
దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.
విష్ణుసహస్రనామ పారాయణచేయండి.

సింహం…
——
కొత్త పనులకు శ్రీకారం చుడతారు.
మీ అంచనాలు నిజం చేసుకుంటారు.
అనుకున్న రీతిలో బంధువులు, మిత్రులు సహకరిస్తారు.
విలువైన వస్తువులు కొంటారు.
ప్రత్యర్థులు సైతం అనుకూలంగా మారతారు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
అనుకున్నది సాధించే వరకూ విశ్రమించ రు.
విద్యార్థులు అనుకూల ఫలితాలు సాధించి సంతోషంగా గడుపుతారు.
మీ సేవలకు తగిన గుర్తింపు రాగలదు.
పలుకుబడి కలిగిన వారిని కలుసుకుంటారు.
వ్యాపారాలు విస్తరిస్తారు, కొత్త పెట్టుబడులు అందుతాయి.
ఉద్యోగులకు కొత్త హోదాలు, ఇంక్రిమెంట్లు రాగలవు.
రాజకీయ, పారిశ్రామికరంగాల వారికి విదేశీ పర్యటనలు ఉంటాయి.
కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.
మహిళలకు తండ్రితరఫు నుంచి ధన, ఆస్తిలాభాలు.
శని, ఆదివారాలలో అనుకోని ఖర్చులు. వివాదాలు, చర్మ సంబంధిత రుగ్మతలు.
ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.
గణేశ్ స్తోత్రాలు పఠించండి.

కన్య…
——-
చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు.
మీ సత్తా పదిమందీ గుర్తించే సమయం.
ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.
ప్రత్యర్థులు సైతం అనుకూలంగా మారి సహకరిస్తారు.
ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం.
విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి.
కొన్ని సమస్యలు ఓర్పుతో పరిష్కరించుకుంటారు.
విద్యార్థులకు అనుకూల ర్యాంకులు తథ్యం.
వాహనాలు, స్థలాలు కొంటారు.
వ్యాపారాలు పుంజుకుంటాయి. పెట్టుబడులకు తగిన లాభాలు.
ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.
కళాకారులకు ఆహ్వానాలు అందుతాయి.
మహిళలకు నూతనోత్సాహం.
శని, ఆదివారాలలో ఆస్తి వివాదాలు. బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యసమస్యలు.
పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.
దుర్గామాతకు పూజ చేయించుకుంటే మంచిది.

తుల…
——
ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ కలిగిస్తాయి.
బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.
సంఘంలో గౌరవం పెరుగుతుంది.
సన్నిహితులు, స్నేహితులతో ఉత్తరప్రత్యుత్తరాలు.
చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు.
పరపతి కలిగిన వారితో పరిచయాలు.
కాంట్రాక్టులు పొందుతారు.
వాహనాలు, ఆభరణాలు సమకూర్చుకుంటారు.
జీవితాశయం నెరవేరడంలో కుటుంబసభ్యుల చేయూత లభిస్తుంది.
వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు ఎదురైనా సర్దుబాటు కాగలవు.
ఉద్యోగులకు మార్పులు సంభవం.
పారిశ్రామిక, వైద్యరంగాల వారు నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించండి.
కళాకారులకు అవకాశాలు కొంత నిరుత్సాహపరుస్తాయి.
మహిళలకు కుటుంబంలో విమర్శలు.
సోమ, మంగళవారాలలో ఖర్చులు. మానసిక ఆందోళన. వివాదాలు.
తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.
హనుమాన్ చాలీసా పఠించండి.

వృశ్చికం…
——
ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.
మీ శ్రమ వృథా కాగల సూచనలు.
భవిష్యత్పై కొంత ఆదుర్దా చెందుతారు.
ఎంతగా కష్టపడ్డా ఫలితం ఉండదు.
వివాదాలకు దూరంగా ఉండండి.
వాహనాలు, ఆభరణాలు జాగ్రత్తగా చూసుకోండి.
ఒక సంఘటన ఆకట్టుకుంటుంది.
బంధువులతో అకారణంగా తగాదాలు.
కాంట్రాక్టులు చివరిలో చేజారతాయి.
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
వ్యాపారాలు అంతగా లాభించవు.
ఉద్యోగులు మరింత శ్రమపడాల్సిన సమయం.
పారిశ్రామిక, రాజకీయరంగాల వారికి ఒడిదుడుకులు తప్పవు.
కళారంగం వారికి అవకాశాలు చే జార తాయి..
మహిళలకు కొంత ఆందోళన తప్పదు.
సోమ, మంగళవారాలలో శుభవార్తలు, ఆర్థిక ప్రగతి. వస్తులాభాలు.
పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.
ఆదిత్య హృదయం పఠించండి.

ధనుస్సు…
——
ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు.
కొత్త కాంట్రాక్టులు పొందుతారు.
జీవితాశయం నెరవేరుతుంది.
కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
సంఘంలో గౌరవం పెరుగుతుంది.
చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు.
ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.
అందరిలోనూ గుర్తింపు రాగలదు.
విచిత్రమైన సంఘటనలు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
వ్యాపారాలు పుంజుకుంటాయి. కొత్త పెట్టుబడులు తద్వారా లాభాలు.
ఉద్యోగులు విధుల్లో ఉత్సాహంగా గడుపుతారు.
పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు.
కళాకారులకు అవార్డులు.
మహిళలకు కుటుంబంలో చికాకులు అధిగమిస్తారు.
గురు, శుక్రవారాలలో వ్యయప్రయాసలు. కుటుంబంలో చికాకులు.
దక్షిణదిశ ప్రయాణాలు సానుకూలం.
లక్ష్మీగణపతిని పూజించండి.

మకరం…
——
కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు.
సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు.
ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి.
ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు.
విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది.
భూములు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది.
ఇంతకాలం పడిన శ్రమ ఫలించే సమయం.
అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు.
పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు.
వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. అనుకున్న పెట్టుబడులు అందుతాయి.
ఉద్యోగులకు కొత్త హోదాలు లభించే సూచనలు.
పారిశ్రామిక వైద్యరంగాల వారికి నూతనోత్సాహం,
కళాకారులకు అరుదైన అవకాశాలు దక్కుతాయి.
మహిళలకు కుటుంబసమస్యల నుంచి బయటపడతారు.
ఆది, సోమవారాలలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబంలో ఒడిదుడుకులు.
ఉత్తరదిశ ప్రయాణాలు సానుకూలం.
హనుమాన్ చాలీసా పఠించండి.

కుంభం…
——
ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది.
దీర్ఘకాలిక సమస్యలు తీరి లబ్ధి పొందుతారు.
పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు.
శత్రువులు సైతం మిత్రులుగా మారి చేయూతనందిస్తారు.
వాహనాలు, స్థలాలు కొనుగోలు చేసే వీలుంది.
ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి.
ఆపన్నులకు సైతం సహాయం అందిస్తారు.
జీవితాశయం నెరవేర్చుకునేందుకు కుటుంబసభ్యులు సహకరిస్తారు.
వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి.
ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు.
రాజకీయవర్గాలకు పదవులు దక్కే ఛాన్స్.
కళాకారులు ఊహించని రీతిలో సన్మానాలు అందుకుంటారు.
మహిళలకు సమస్యలు తీరి మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
సోమ, మంగళవారాలలో ఇంటాబయటా విమర్శలు, ఆరోగ్యసమస్యలు. ఆస్తి వివాదాలు.
తూర్పుదిశ ప్రయాణాలు సానుకూలం.
ఆదిత్య హృదయం పఠించండి.

మీనం….
——
ఎంతటి వారినైనా మాటల చాతుర్యంతో ఆకట్టుకుంటారు.
శత్రువులు కూడా మీకు అనుకూలంగా మారతారు.
ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు.
చిన్ననాటి మిత్రుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది.
కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు.
దూరపు బంధువులతో ఆనందంగా గడుపుతారు.
సేవలకు గుర్తింపు రాగలదు.
ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి.
నిలిచిపోయిన ఇంటి నిర్మాణాలు పునరుద్ధరిస్తారు.
వాహనయోగం.
వ్యాపారులకు అధిక లాభాలు. కొత్త పెట్టుబడులు సమకూరతాయి.
ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కే అవకాశం.
పారిశ్రామిక, వైద్యరంగాల వారికి పురస్కారాలు.
కళాకారులకు అంచనాలు నిజమవుతాయి.
మహిళలకు కుటుంబసభ్యుల నుంచి సహాయం అందుకుంటారు.
గురు, శుక్రవారాలలో ధననష్టం. కుటుంబంలో చికాకులు.
పశ్చిమదిశ ప్రయాణాలు సానుకూలం.
గణపతిని పూజించండి.

Tags; Srikaram Subhakaram Episodes, Srikaram Subhakaram Weekly Astrology Predictions, Vakkantam Chandra Mouli Srikaram Subhakaram, Telugu Astrology, TeluguAstrology, Free Astrology in Telugu, janmakundali.com, Zee Telugu Srikaram Subhakaram 18th May 2014,