Templates by BIGtheme NET
Home >> LIFESTYLE >> Srikaram Subhakaram 2nd March 2014

Srikaram Subhakaram 2nd March 2014


Srikaram Subhakaram 2nd March 2014

రాశి ఫలాలు

2nd Mar2014–8th Mar 2014 by Vakkantam Chandra Mouli, janmakundali.com

Weekly Horoscope (2014-03-02  –  2014-03-08)

 

మేషం…
—–
ఈవారం అనూహ్యమైన రీతిలో ధనప్రాప్తి.
సంఘంలో విశేషమైన గౌరవం లభిస్తుంది.
దూరమైన వారు సైతం దగ్గరకు చేరి సంతోషాన్ని పంచుతారు.
స్థిరాస్తి వివాదాలు తీరి ఉపశమనం లభిస్తుంది.
కాంట్రాక్టర్లు అనుకోనివిధంగా టెండర్లు దక్కించుకుంటారు.
వాహనాలు, ఆభరణాలు సమకూరతాయి.
వ్యాపారాలు విస్తరణలో ప్రతిబంధకాలు తొలగుతాయి.
ఉద్యోగులు అనుకున్న హోదాలు పొందుతారు.
పారిశ్రామిక, సాంకేతికవర్గాల వారికి చెప్పుకోతగ్గ ప్రగతి ఉంటుంది.
కళాకారులు సన్మానాలు, సత్కారాలు పొందుతారు.
మహిళలకు నూతనోత్సాహం.
సోమ, మంగళవారాలలో ఆకస్మిక ప్రయాణాలు. భార్యాభర్తల మధ్య కొద్దిపాటి వివాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది.
ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.
దత్తాత్రేయుని పూజించండి.

 

వృషభం..
—–
మీ ఊహలు, అంచనాలు నిజం కాగల సమయం.
ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి.
రావలసిన సొమ్ము సైతం అందుతుంది.
వాహన, కుటుంబసౌఖ్యం.
సంతానపరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.
విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది.
అందరికీ ఆదర్శవంతంగా ఉంటారు.
ఇంటి నిర్మాణాల్లో అవరోధాలు తొలగుతాయి.
పలుకుబడి పెరుగుతుంది.
వ్యాపారాలలో ముందుకు సాగి లాభాలు పొందుతారు.
పారిశ్రామిక, వైద్యరంగాల వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది.
కళాకారులకు గౌరవ పురస్కారాలు అందుతాయి.
మహిళలకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
బుధ, గురువారాలలో ప్రయాణాలలో ఆటంకాలు. చర్మ సంబంధిత రుగ్మతలు. ఆస్తి వివాదాలు.
పశ్చిమదిశ ప్రయాణాలు సానుకూలం.
ఈశ్వరారాధన మంచిది.

 

మిథునం..
——
పనులు చాకచక్యంగా పూర్తి చేస్తారు.
బంధువులు, మిత్రుల నుంచి అందిన సమాచారంతో ఊరట చెందుతారు.
కొన్ని వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి.
ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది.
స్థిరాస్తి విషయంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు.
ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు.
భవిష్యత్పై భరోసా ఏర్పడుతుంది.
భాగస్వామ్య వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి.
ఉద్యోగవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. కొందరికి బదిలీలు.
పారిశ్రామిక, సాంకేతికవర్గాల వారు పోగొట్టుకున్న అవకాశాలు తిరిగి దక్కించుకుంటారు.
కళాకారులకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు.
మహిళలకు సోదరులతో విభేదాలు తొలగుతాయి, మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
శుక్ర, శనివారాలలో అనుకోని ప్రయాణాలు. భార్యాభర్తల మధ్య కలహాలు. రుణాలు చేస్తారు.
దక్షిణదిశప్రయాణాలు సానుకూలం.
ఆదిత్యుని పూజించండి.

 

కర్కాటకం…
——-
ఈవారం ఆశ్చర్యకరమైన రీతిలో కొన్ని వ్యవహారాలు పూర్తి కాగలవు.
స్థిరాస్తి విషయంలో కొద్దిపాటి చికాకులు నెలకొన్నా నైపుణ్యంతో పరిష్కరించుకుంటారు.
సంఘంలో గౌరవమర్యాదలకు లోటు ఉండదు.
విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు ఫలించే సమయం.
గృహ నిర్మాణాల్లో ముందడుగు వేస్తారు.
ఇతరులకు సైతం సహాయపడి దాతృత్వాన్ని చాటుకుంటారు.
ఆలయాలు సందర్శిస్తారు.
వ్యాపారాలలో ఒడిదుడుకులు క్రమేపీ తొలగుతాయి.
ఉద్యోగులకు పదోన్నతి సూచనలు.
పారిశ్రామిక, సాంకేతిక వర్గాలకు విదేశీయానం.
కళాకారులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి.
మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.
సోమ, మంగళవారాలలో దూరప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. బంధువిరోధాలు.
తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.
విష్ణుసహస్రనామ పారాయణచేయండి

 

సింహం…
——
ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ కలిగిస్తుంది.
కొత్తరుణాలు చేయాల్సివస్తుంది.
ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి.
విద్యార్థుల యత్నాలు నిదానంగా సాగుతాయి.
భూముల కొనుగోలు యత్నాలు వాయిదా వేస్తారు.
ఆలయాలు సందర్శిస్తారు.
పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు.
వ్యాపారాలు లాభనష్టాలు సమానంగా ఉంటాయి.
ఉద్యోగులకు అనుకోని బదిలీలు ఉంటాయి.
పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా.
కళాకారులకు ఒత్తిడులు ఉండవచ్చు.
మహిళలు కుటుంబసభ్యుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు.
శుక్ర, శనివారాలలో శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. ఆహ్వానాలు అందుతాయి. భార్యాభర్తల మధ్య వివాదాలు తీరతాయి.
ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.
గణపతిని పూజించండి.

 

కన్య…
—–
కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు.
సంఘంలో గౌరవమర్యాదలకు లోటు ఉండదు.
భూములు, గృహోపకరణాలు కొంటారు.
శుభకార్యాలలో పాల్గొంటారు.
జీవితాశయం నెరవేరుతుంది.
కొత్త కాంట్రాక్టులు పొందుతారు.
బంధువులతో సంబంధబాంధవ్యాలు మెరుగుపడతాయి.
పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
వ్యాపారాలలో అనుకున్న పెట్టుబడులు అందుతాయి.
ఉద్యోగులకు హోదాలు దక్కే ఛాన్స్.
పారిశ్రామిక, సాంకేతికవర్గాలకు సంతోషకరమైన వార్తలు.
కళాకారులు అవకాశాలు అప్రయత్నంగా దక్కి ముందుకు సాగుతారు.
మహిళలకు కుటుంబంలో చికాకులు తొలగుతాయి.
బుధ, గురువారాలలో ధననష్టం. మానసిక అశాంతి. సోదరులు, సోదరీల మధ్య వివాదాలు.
దక్షిణదిశ ప్రయాణాలు సానుకూలం.
హనుమాన్కు అర్చన చేయించుకుంటే మంచిది.

 

తుల…
—–
పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.
కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు.
ఆలోచనలు అమలు చేస్తారు.
చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహకరిస్తారు.
కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు.
పరిచయాలు పెరుగుతాయి.
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
బాకీలు వసూలవుతాయి.
వ్యాపారాలు విస్తరిస్తారు.
ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది.
సాంకేతికవర్గాలకు అనుకోని ఆహ్వానాలు రాగలవు.
కళాకారులు ఉత్సాహంగా గడుపుతారు.
మహిళలు సమస్యల నుంచి బయటపడతారు.
శుక్ర,శనివారాలలో దూరప్రయాణాలు. అనారోగ్యం,ఔషధసేవనం. చోర భయం.
ఉత్తరదిశ ప్రయాణాలు సానుకూలం.
గణపతిని పూజించండి.

 

వృశ్చికం..
——-
మొదట్లో పనులు నెమ్మదించినా క్రమేపీ పుంజుకుంటాయి.
రావలసిన సొమ్ము అంది అవసరాలు తీర్చుకుంటారు.
వ్యతిరేకులను సైతం అనుకూలంగా మార్చుకుంటారు.
ఆహ్వానాలు, గ్రీటింగ్లు అందుతాయి.
స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు.
ఇంటి నిర్మాణాలు చేపడతారు.
సంఘంలో గౌరవం లభిస్తుంది.
వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి.
ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.
పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి.
కళాకారులకు అవార్డులు లభిస్తాయి.
మహిళలు శుభకార్యాలు నిర్వహిస్తారు.
సోమ,మంగళవారాలలో ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్యసమస్యలు. భార్యాభర్తల మధ్య విభేదాలు.
తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.
సూర్యారాధన చేయండి.

 

ధనుస్సు..
——
ఆదాయం కొంత తగ్గినా అవసరాలు తీరతాయి.
పనులు నిదానంగా కొనసాగుతాయి.
బంధువులతో విభేదాలు.
చర్మ, ఉదర సంబంధిత రుగ్మతలు.
ఇంటాబయటా చికాకులు పెరుగుతాయి.
జీవిత భాగస్వామి నుంచి ఒత్తిడులు.
దేవాలయాలు సందర్శిస్తారు.
కాంట్రాక్టులు ఎట్టకేలకు దక్కించుకుంటారు.
విలువైన వస్తువులు భద్రంగా చూసుకోండి.
భాగస్వామ్య వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
ఉద్యోగులకు స్థానచలనం.
పారిశ్రామిక, వైద్యరంగాల వారికి నిరుత్సాహమే.
మహిళలకు మానసిక అశాంతి.
శుక్ర,శనివారాలలో శుభవార్తలు. ధన, వస్తులాభాలు. యత్నకార్యసిద్ధి.
పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.
వేంకటేశ్వరస్వామిని పూజించండి.

 

మకరం…
——
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.
ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.
బాధ్యతలు పెరుగుతాయి.
వివాదాలకు దూరంగా ఉండండి.
విలువైన వస్తువులు జాగ్రత్త.
ఆలోచనలు స్థిరంగా ఉండవు.
కాంట్రాక్టులు చేజారి నిరాశ కలిగిస్తాయి.
బంధువులతో తగాదాలు.
వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది.
పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు రద్దు కాగలవు.
మహిళలకు మానసిక ఆందోళన తప్పదు.
సోమ,మంగళవారాలలో విందువినోదాలు. ఆధ్యాత్మిక చింతన. భూములు, వాహనాలు కొంటారు.
దక్షిణదిశ ప్రయాణాలు సానుకూలం.
విష్ణుసహస్రనామపారాయణ చేయండి.

 

కుంభం…
——-
రావలసిన సొమ్ము అందుతుంది.
వ్యవహారాలలో విజయం.
శుభకార్యాలలో పాల్గొంటారు.
పాతమిత్రులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు.
మీసేవలకు గుర్తింపు లభిస్తుంది.
ఆలయాలు సందర్శిస్తారు.
కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి.
బంధువులతో వివాదాలు తీరతాయి.
వ్యాపారాలు విస్తరణలో ముందడుగు వేస్తారు.
ఉద్యోగులకు ఉన్నత స్థితి దక్కుతుంది.
పారిశ్రామికవర్గాలకు నిరాశ తొలగుతుంది. విదేశీ ఆహ్వానాలు అందుతాయి.
కళాకారులకు సన్మానాలు.
శుక్ర,శనివారాలలో దూరప్రయాణాలు. రుణభారం. ఒప్పందాలు రద్దు. భార్యాభర్తల మధ్య ఆపార్ధాలు.
తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.
ఆదిత్య హృదయం పఠించండి.

 

మీనం…
—–
కొత్త పనులు ప్రారంభిస్తారు.
అనుకున్న విధంగా ఆప్తులు సహాయపడతారు.
మీ అంచనాలు నిజంచేసుకుంటారు.
వ్యతిరేక పరిస్థితులను సైతం అనుకూలంగా మార్చుకుంటారు.
ప్రతిభ వెలుగులోకి వస్తుంది.
జీవితాశయం నెరవేరుతుంది.
చాకచక్యంగా వ్యవ హరించి సమస్యలు పరిష్కరించుకుంటారు.
పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. పెట్టుబడులు అందుతాయి.
ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి.
పారిశ్రామిక, రాజకీయవర్గాలకు అరుదైన సత్కారాలు. ఆహ్వానాలు.
కళాకారులకు కొత్త అవకాశాలు.
మహిళలకు ఆస్తి, ధనలాభం.
బుధ, గురువారాలలో చికాకులు. కుటుంబసమస్యలు. ఆరోగ్య సమస్యలు. ఒత్తిడులు పెరుగుతాయి.
ఉత్తరదిశ ప్రయాణాలు సానుకూలం.
హనుమాన్ చాలీసాపఠించండి.

 

Tags : Srikaram Subhakaram Episodes, Srikaram Subhakaram Weekly Astrology Predictions, Vakkantam Chandra Mouli Srikaram Subhakaram, Telugu Astrology, TeluguAstrology, Free Astrology in Telugu, janmakundali.com, Srikaram Subhakaram 2nd March 2014