Srikaram Subhakaram 9th March 2014

0Srikaram Subhakaram 9th March 2014

రాశి ఫలాలు

9th Mar2014–15th Mar 2014 by Vakkantam Chandra Mouli, janmakundali.com

Weekly Horoscope (2014-03-09  –  2014-03-15)

మేషం…
—–
ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. కొత్త రుణాల అన్వేషణలో నిమగ్నమవుతారు.
సేవకార్యక్రమాలలో పాల్గొంటారు.
సోదరులు, మిత్రులతోకలహాలు.
ఆరోగ్యపరంగా చికాకులు తప్పవు. ఔషధసేవనం.
విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి.
ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు వాయిదా వేస్తారు.
శ్రమ తప్పదు.
ఇంతకాలం చేసిన కృషి ఫలించక నిరుద్యోగులు నిరాశ చెందుతారు.
వ్యాపారాలు మందకొడిగాసాగుతాయి.
ఉద్యోగులకు స్థానచలనం, పనిభారం.
పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనల్లో ఆటంకాలు.
కళాకారులకు చిక్కులు ఎదురవుతాయి.
మహిళలకు నిర్ణయాలలో తొందరపాటు వద్దు.
ఆది, సోమవారాలలో ఆకస్మిక ధనలాభం, యత్నకార్యసిద్ధి. భార్యాభర్తల మధ్య సఖ్యత.
తూర్పుదిశ ప్రయాణాలు సానుకూలం.
విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృషభం…
——
ఆర్థిక లావాదేవీలు అంతగా అనుకూలించవు.
వివాదాలకు,కోపతాపాలకు దూరంగా మెలగండి.
సోదరులతో విభేదాలు.
ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు.
ఆస్తి వివాదాలు నెలకొంటాయి.
బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.
కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
వ్యాపారులకు పెట్టుబడులు అందక ఇబ్బంది పడతారు.
ఉద్యోగులకు విధుల్లో చికాకులు.
పారిశ్రామిక, వైద్యరంగాల వారు నిదానం పాటించాలి.
కళాకారులకు అవకాశాలు తృటిలో తప్పిపోతాయి.
విద్యార్థులకు శ్రమాధిక్యం.
బుధ, గురువారాలలో శుభవర్తమానాలు. పాతబాకీలు వసూలవుతాయి. నిరుద్యోగులకు అనుకూల ప్రకటన.
ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.
ఆదిత్య హృదయం పఠించండి.

మిథునం…
——-
కొత్త విషయాలు తెలుసుకుంటారు.
పనులు చకచకా పూర్తి చేస్తారు.
ఆత్మీయుల నుంచి శుభవర్తమానాలు.
కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు.
జీవితాశయం నెరవేరుతుంది.
ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం.
తీర్థయాత్రలు చేస్తారు.
సంఘంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు.
ఆహ్వానాలు అందుతాయి.
వ్యాపారాలు పుంజుకుంటాయి.
ఉద్యోగులకు ఉన్నతహోదాలు.
రాజకీయవర్గాలకు నూతనోత్సాహం.
మహిళలకు భూ, గృహయోగాలు.
బుధ, గురువారాలలో వ్యయప్రయాసలు. ఖర్చులు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు.
దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.
వేంకటేశ్వరస్వామిని పూజించండి.

కర్కాటకం…
——-
వ్యవహారాలు ముందుకు సాగవు.
ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు.
కాంట్రాక్టులు చేజారతాయి.
ఆలోచనలు స్థిరంగా ఉండవు.
భూవివాదాలు నెలకొంటాయి.
కుటుంబసభ్యులతో అకారణంగా తగాదాలు.
ఇంటి నిర్మాణాలు మధ్యలో నిలిపివేస్తారు.
ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
బాకీలు వసూలుపై దృష్టి సారిస్తారు.
మహిళలకు మానసిక ఆందోళన.
వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు.
ఉద్యోగులకు స్థానమార్పులు ఉండవచ్చు.
పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు పెరుగుతాయి.
కళాకారులు అవకాశాలు కొంత అసంతృప్తి కలిగిస్తాయి.
బుధ, గురువారాలలో వ్యవహారాలలో విజయం. ఆసక్తికరమైన సమాచారం. భూలాభం. భార్యాభర్తల మధ్య అపార్ధాలు తొలగుతాయి.
పశ్చిమదిశ ప్రయాణాలు సానుకూలం.
విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

సింహం…
——-
ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.
సన్నిహితుల సాయం అందుతుంది.
వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి.
చిన్ననాటి మిత్రుల కలయిక.
ఇంటాబయటా మీకు ఎదురులేని పరిస్థితి.
అనుకున్న విజయాలు సొంతమవుతాయి.
జీవితాశయం నెరవేరుతుంది.
వాహనాలు, ఆభరణాలు కొంటారు.
పలుకుబడి పెరుగుతుంది.
వ్యాపారాలు విస్తరిస్తారు.
ఉద్యోగులకు ఉన్నతహోదాలు.
రాజకీయవర్గాలకు పదవీయోగం.
కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.
విద్యార్థులకు అనుకూల ఫలితాలు.
మహిళలకు మానసిక ప్రశాంతత.
మంగళ, బుధవారాలలో ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. అనారోగ్యం. బంధువిరోధాలు.
ఉత్తరదిశ ప్రయాణాలు సానుకూలం.
నవగ్రహస్తోత్రాలు పఠించండి.

కన్య…
——
ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది.
సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు.
విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి.
బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.
చిన్ననాటి మిత్రులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు.
నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది.
మహిళలకు కుటుంబంలో విశేష గౌరవం.
ప్రత్యర్థులు అనుకూలంగా మారతారు.
వ్యాపారాలు విస్తరణలో ముందడుగు వేస్తారు.
ఉద్యోగులకు ఉన్నతహోదాలు రాగలవు.
కళాకారులు మరింత ఉత్సాహంగా గడుపుతారు.
విద్యార్థులకు అనుకున్న ఫలితాలు దక్కుతాయి.
రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కే అవకాశం.
శుక్ర, శనివారాలలో దూరప్రయాణాలు. రాబడి తగ్గుతుంది. పనులు వాయిదా. భార్యాభర్తల మధ్య వివాదాలు.
దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.
శివాలయంలో అభిషేకం చేయించుకుంటేమంచిది.

తుల…
—-
రావలసిన సొమ్ము అందుతుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి.
పరిచయాలు పెరుగుతాయి.
గత సంఘటనలు నెమరువేసుకుంటారు.
పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం.
ఆహ్వానాలు, గ్రీటింగ్లు అందుకుంటారు.
వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు.
భవిష్యత్పై భరోసా ఏర్పడుతుంది.
వాహనాలు, ఆభరణాలు కొంటారు.
శత్రువులు సైతం మిత్రులుగా మారి చేయూతనందిస్తారు.
వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.
ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.
పారిశ్రామిక, వైద్యరంగాల వారికి నూతనోత్సాహం.
కళాకారులకు కొత్త అవకాశాలు.
మహిళలకు కుటుంబసమస్యలు తీరతాయి.
ఆది, సోమవారాలలో దూరప్రయాణాలు. బాధ్యతలు పెరుగుతాయి. సోదరులతో తగాదాలు.అనారోగ్యం.
ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.
ఆదిత్య హృదయం పఠించండి.

వృశ్చికం..
——
ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. కొత్త రుణాలు చేస్తారు.
ఆకస్మిక ప్రయాణాలు, వ్యయప్రయాసలు.
ఆలోచనలు స్థిరంగా ఉండవు.
విద్యార్థులకుకృషి ఫలించే అవకాశం తక్కువ.
బంధువులు మీపై నిందలు మోపే అవకాశం.
విలువైన వస్తువులు జాగ్రత్త.
తీర్థయాత్రలు చేస్తారు.
ఒక ప్రకటన నిరుద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేస్తుంది.
ఇంటి నిర్మాణయత్నాలు మందగిస్తాయి.
గొంతు, చర్మ సంబంధిత రుగ్మతలు.
వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
ఉద్యోగులకు మార్పులు సంభవం.
రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి.
కళాకారులు నిర్ణయాలలో అప్రమత్తత పాటించాలి.
మహిళలకు నిరుత్సాహం.
శుక్ర,శనివారాలలో ధన, వస్తులాభాలు. యత్నకార్యసిద్ధి. పరపతి పెరుగుతుంది. ఆహ్వానాలు అందుతాయి.
తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.
గణేశ్ స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు…
——-
రాబడి తగ్గుతుంది.
అనుకున్న కార్యక్రమాలలో అవాంతరాలు.
ఆస్తి వివాదాలు పరిష్కారం.
వాహనాలు, ఆరోగ్య విషయాలలో నిర్లక్ష్యం తగదు.
సోదరులతో విభేదాలు.
చర్చలు విఫలమవుతాయి.
ఆలయాలు సందర్శిస్తారు.
కాంట్రాక్టులు కొంత అసంతృప్తి కలిగిస్తాయి.
మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది.
వ్యాపారాలు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది.
ఉద్యోగులకు పనిభారం తప్పదు.
రాజకీయవర్గాలకు నిరుత్సాహం.
విద్యార్థులు అనుకున్న ఫలితాలు రాక నిరాశ చెందుతారు.
ఆది, సోమవారాలలో శుభవార్తలు. ధనలాభం. వివాదాల పరిష్కారం.
పశ్చిమదిశ ప్రయాణాలు సానుకూలం.
దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

మకరం…
——
ఆర్థిక పరిస్థితి ఆశాజన కంగా ఉంటుంది.
సన్నిహితులు, శ్రేయోభిలాషులు దగ్గరవుతారు.
దూరప్రాంతాల నుంచి శుభవార్తలు.
కొత్త కాంట్రాక్టులు పొందుతారు.
వివాహ యత్నాలు సానుకూలం.
విచిత్రమైన సంఘటనలు.
దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి.
విద్యార్థులకు అనుకున్న ర్యాంకులు తథ్యం.
వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. లాభాలు అందుతాయి.
ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు.
పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి.
కళాకారులకు సన్మానాలు జరుగుతాయి.
ఆలయాలు సందర్శిస్తారు.
శుక్ర, శనివారాలలో అనుకోని ప్రయాణాలు. ఖర్చులు. అనారోగ్య సూచనలు.
దక్షిణదిశ ప్రయాణాలు సానుకూలం.
విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కుంభం…
——
ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు.
విలువైన వస్తువులు సేకరిస్తారు.
నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది.
ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది.
పండితులు, స్వామీజీలను కలుసుకుంటారు.
ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి.
ఇంటి నిర్మాణయత్నాలు ఫలిస్తాయి.
వాహనాలు, ఆభరణాలు కొంటారు.
వ్యాపారులకు లాభాలు అందుతాయి.
ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి.
రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు ఖాయం.
కళాకారులకు అవార్డులు దక్కుతాయి.
విద్యార్థులకు శ్రమ ఫలిస్తుంది.
మహిళలకు కుటుంబంలో విశేష గౌరవం.
ఆది, సోమవారాలలో దూరప్రయాణాలు. అనారోగ్యం. భార్యాభర్తల మధ్య విభేదాలు.
పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.
ఆదిత్య హృదయం పఠించండి.

మీనం…
——-
ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి.
బంధువులతో తగాదాలు.
ఆలోచనలు స్థిరంగా ఉండవు.
ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి.
బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.
ఒక సంఘటన ఆకట్టుకుంటుంది.
ఆభరణాలు, డాక్యుమెంట్లు జాగ్రత్త.
ఆలయాలు సందర్శిస్తారు.
నిరుద్యోగుల శ్రమ ఫలించదు.
మహిళలకు మనోవేదన.
వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలు.
ఉద్యోగులకు అనుకోని మార్పులు.
పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనల్లో మార్పులు.
ఆరోగ్యపరంగా చికాకులు. ఔషధసేవనం.
శని, ఆదివారాలలో శుభవార్తలు, ధన,వస్తులాభాలు. యత్నకార్యసిద్ధి. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు.
ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.
ఆదిత్య హృదయం పఠించండి.