కాంగ్రెస్ లిస్టులో ఇన్ని సర్ ప్రైజులా?

0

ఒకే ఒక్కరోజు నామినేషన్‌కు మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఇక పార్టీలకు అభ్యర్థుల మల్లగుల్లాలను సాగదీసే అవకాశమే లేదు. ఏమైతే అది కానీ అన్నట్టు ఆలోచించి చించి అన్ని పార్టీలు ఫైనల్ లిస్టును ఇచ్చేశాయి. అలాగే మహాకూటమి పెద్దన్న కూడా కాంగ్రెస్ ఫైనల్ లిస్టును విడుదల చేసింది. వీరంతా రేపు నామినేషన్ వేయనున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ మిగిలిన ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఆరుగురు అభ్యర్థులతో ఈ తుది జాబితా వెలువడింది. ఇందులో షాక్‌లు సర్ప్రైజులు రెండూ ఉన్నాయి. పార్టీలో అనేక మంది సీఎం అభ్యర్థులున్నా… జనం కూడా అర్హుడిగా ఆమోదించగలుగుతున్న వ్యక్తుల్లో జానారెడ్డి ముఖ్యమైన వారు. మిర్యాలగూడ సీటు తన కొడుకుకు ఇప్పించడానికి ఆయన చేయని ప్రయత్నమే లేదు. పైగా సీనియర్ నేత పార్టీకి చాలా ముఖ్యుడు కాబట్టి ఆయన కల నెరవేరుతుంది ఆయన మాట నెగ్గుతుంది అనుకున్నారు. ఆయనకు భారీ షాక్ ఇస్తూ చివరి జాబితా వెలువండి. ఆయన కొడుక్కి టిక్కెట్ ఇవ్వకపోగా అనూహ్యంగా ఆ సీటును బీసీ సంఘాల నేత ఆర్.కృష్ణయ్య దక్కించుకున్నారు. బీసీలకు అన్యాయం చేస్తారా అంటూ బంద్ ప్రకటించిన కృష్ణయ్య మొత్తానికి తన వ్యూహంతో కాంగ్రెస్ మెడలు వంచి టిక్కెట్ తెచ్చుకున్నారు. చివరకు జానారెడ్డికి రెండు వైపులా ఝలక్ తగిలినట్టయ్యింది.

ఈ జాబితాలో మరో సర్ప్రైజ్ కాసాని జ్ఞానేశ్వర్. హైదరాబాదు శివార్లలో వేల కోట్ల రూపాయలు విలువైన ఆస్తులున్న నేత. మనిషిలో విద్వత్తు తక్కువే అయినా ఫాలోయింగ్ పరంగా ఆర్థికంగా చాలా బలమైన వ్యక్తి. గతంలో తను స్వంతంగా ఓ పార్టీ పెట్టి ఒక వ్యూహమంటూ లేక 500 కోట్లు వృథా చేసుకున్నారు. అందులో పావు వంతుఖర్చు పెట్టినా ఎంపీ అయ్యే వారు కానీ అతనికి ఉన్న లోపమే అతనితో ఆ పనిచేయించింది. నిజానికి ఈయన కాంగ్రెస్‌లో ఉన్నా… లెక్కల్లో లేరు. ఏ ముఖ్యమైన మీటింగ్‌కు అతనికి ఆహ్వానం లేదు. పొత్తు పొడవక ముందే ఆయనను పక్కనపెట్టారు. కానీ… అసలు ప్రపోజల్స్‌లో లేని వ్యక్తికి టికెట్ రావడానికి కారణం చంద్రబాబు అఖిలేష్ యాదవ్. కాసానికి ఉత్తరప్రదేశ్ నేతలతో మంచి కుల సంబంధాలు ఉన్నాయి. చంద్రబాబు హైటెక్ సిటీ భవంతి చుట్టుపక్కల ఐటీ వ్యవహారాన్ని నడుపుతున్న హయాంలో కాసానిని క్యాష్ డిపాజిట్ బినామీగా వాడినట్లు చెబుతుంటారు. అలా వచ్చిన డబ్బును ఊరికే పెట్టకుండా భూములు మీద పెట్టి వేల కోట్లకు అతను పడగలెత్తారని ఆరోణలు ఉన్నాయి. కాసాని గురించి చంద్రబాబుకు బాగా తెలుసు. అయితే అయినా ఏ ప్రయోజనం లేకుండా చంద్రబాబు అఖిలేష్ ఎందుకు అతడిని రెకమెండ్ చేసుంటారని మీ అనుమానానికే పైనే సమాధానం ఉంది. తీవ్ర ఆర్థిక లోటుతో ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్‌కు ఓ నాలుగైదు నియోజకవర్గాలకు సర్దగలిగిన సత్తా ఉన్నోడు కాసాని. అతనిలో ఆ బలం గుర్తించే చివరిగా టిక్కెట్ ఇచ్చింది. దీనికి అటు జాతీయ స్థాయిలో కూటమి రెఫరెన్సులు ఇక్కడ చంద్రబాబు రెఫరెన్సులు ఉన్నాయి. ఏదైతేనేం… కాసాని కల నెరవేరింది. గెలవడం మాట తరువాత.

ఇక ఈ చివరి జాబితాలో అటు దేవరకద్ర టికెట్ కోసం కూడా సీనియర్ నేతలు జైపాల్‌రెడ్డి డీకె అరుణ పోటీ పడగా… డీకే అరుణ అనుచరుడైన పవన్ కుమార్‌రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం టిక్కెట్ కేటాయించింది. అరుణ కూతురికి ఇవ్వనందుకు ఇది ఒక ఉపశమన చర్య. కోరుట్ల సీటు జువ్వాది నర్సింగరావుకు నారాయణఖేడ్ సీటు సురేష్‌కుమార్ షెట్కర్‌కు నారాయణపేట్ సీటు వి.కృష్ణకు దక్కాయి.


Please Read Disclaimer