రాశి ఫలాలు 12 జనవరి 2019

0

రాశి ఫలాలు 12 జనవరి 2019

Daily Horoscope in Telugu 12th Jan 2019

మేషం 
పలుకుబడి, హోదా పెరుగుతాయి. అలవాట్లలో మార్పులు చోటుచేసుకుంటాయి. గోప్యతకు ప్రాధాన్యతనిస్తారు. రహస్య ఋణాలను చేస్తారు. క్రయవిక్రయాలో మధ్యవర్తులను ఆశ్రయిస్తారు. కీళ్ళనొప్పులు బాధిస్తాయి.

వృషభం 

చిన్న చిన్న విషయాలపై కూడా శ్రద్ధ కనబరుస్తారు. సన్నిహితుల సహాయసహకారాలను అందుకుంటారు. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. 

మిథునం

ఎలక్రానిక్ మీడియా పట్ల అమితంగా ఆకర్షితులవుతారు. బాధ్యతలకు ప్రాధ్యాతనిచ్చి కుటుంబ అవసరాలపైన దృష్టిని సారిస్తారు. పరధ్యానంగా ఉంటారు. విదేశీయాన ప్రయత్నాలు కలిసొస్తాయి. 

కర్కాటకం
 

ఉద్యోగయత్నాలు కలిసొస్తాయి. వ్యవహారాలలో ప్రత్యక్ష పర్యవేక్షణ అవసరమవుతుంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా ముందుకెళ్తారు. ఆర్ధిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. 

సింహ 
శత్రువర్గం నుంచి పరోక్షంగా చికాకులను ఎదుర్కొంటారు. ఆలోచనలు పలురకాలుగా ఉంటాయి. బకాయిలు కొంతవరకు వసూలవుతాయి. సౌందర్య సాధక చిట్కాల పట్ల ఆకర్షితులవుతారు. 

కన్య 
సహోదరవర్గానికి మీ వంతు సహాయసహకారాలను అందిస్తారు. అధికంగా శ్రమిస్తారు. ఆత్మసాక్షికి విరుద్ధంగా ఏపనీ చేయరు. వ్యాపారులకు అనుకూలంగా ఉంది. 

తుల 
చేసే మంచిపనికి ప్రోత్సాహం లభిస్తుంది. పరోపకార బుద్ధిని కలిగి ఉంటారు. వ్యవహారాలలో ఆశించిన లాభాలు చేతికందుతాయి. పెట్టుబడులకు అనుకూలమైన రోజు కాదు. 

వృశ్చికం 
తప్పుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నవిధంగా వ్యవహరిస్తారు. రాజకీయాలు అమితంగా ఆకర్షిస్తాయి. కుటుంబ సమస్యలు తీరి ఊరట చెందుతారు. వాహనయోగ సూచన. 

ధనుస్సు 
ముఖ్యమైన వ్యవహారాలను సాఫీగా పూర్తిచేస్తారు. ప్రత్యేకతను సంతరించుకోగలుగుతారు. భూముల కొనుగోలు వ్యవహారాలపై చర్చలు సాగిస్తారు. అహంభావ ధోరణిని కనబరుస్తారు. 

మకరం 
ఊహించని అతిథుల రాక ఆనందాన్ని కలిగిస్తుంది. ఓర్పు, సహనాలను కనబరిచి పనులను చక్కదిద్దుకుంటారు. అసూయాద్వేషాలు కలిగినవారితో వాదనలకు దూరంగా ఉండండి. 

కుంభం 
ఆరంభశూరత్వం కలిగి ఉంటారు. భూ, గృహ, వాహన సంబంధితమైన విషయాలకు సంబంధించిన లావాదేవీలు సానుకూల పడతాయి. ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు పాటించడం మంచిది. 

మీనం 
ముఖ్యమైన వారు అందుబాటులో ఉండరు. ఖర్చులు అంచనాలకు మించి ఉంటాయి. వ్యతిరేక వర్గంతో తాత్కాలిక చెలిమి ఏర్పడుతుంది.. వృత్తి-ఉద్యోగ, వ్యాపారాలపరంగా అనుకూలంగా ఉంటుంది. 

 

Tags : రాశి ఫలాలు 12 జనవరి 2019 , daily horoscope in telugu 12th Jan 2019, daily horoscope in telugu 12th January 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 12 జనవరి 2019 ములుగు రాశి ఫలాలు, 112 జనవరి 2019 పంచాంగం, January 12th 2019 astrology in telugu, january 12th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu,
Please Read Disclaimer