రాశి ఫలాలు 19 నవంబరు 2018

0

రాశి ఫలాలు 19 నవంబరు 2018

మేషం
ఆర్థికపరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సోదరులు, మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వాహన సౌఖ్యం పొందుతారు. కప్పు సాంబ్రాణి, అష్టములికా గుగ్గిలం కలిపి వ్యాపార స్థలం, గృహంలో ధూపం వేస్తే శుభఫలితం ఉంటుంది.

వృషభం
కుటుంబ సమస్యలు తీరి ప్రశాంతత పొందుతారు. కొత్తమిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. నాగబంధం ఉపయోగించండి.

మిథునం

జీవితభాగస్వామితో ఏర్పడిన విభేదాలు పరిష్కారమవుతాయి. ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు. నిత్యం సరస్వతి తిలకం నుదుటున ధరించండి.

కర్కాటకం
ఊహించని అవకాశాలు లభిస్తాయి. మిత్రుల నుంచి ధనలాభం పొందుతారు. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం, వాహనాల పట్ల మెలకువ అవసరం. వస్తులాభం పొందుతారు. అష్టమూలికా తైలం వేసి, తెల్ల జిల్లేడు వత్తులతో విఘ్నేశ్వరునికి దీపారాధన చేస్తే శుభ ఫలితాలు ఉంటాయి.

సింహ
కుటుంబసభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సంగీత, సాహిత్యాలపై ఆసక్తి కలిగి ఉంటారు. ఆర్ధిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. లక్ష్మీచందనంతో ఇష్ట దైవానికి అభిషేకం చేయండి.

కన్య
ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. చర్చాగోష్టులలో చురుకుగా పాల్గొంటారు. సిద్ధగంధంతో ఇష్ట దైవానికి అభిషేకం చేయండి.ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. విలువైన వస్తువులు, వస్త్రాలు, వాహనాలు కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి.

తుల
రోజూ గృహం, వ్యాపార సంస్థల్లో అష్టములికా గుగ్గిలంతో ధూపం వేయండి. శుభ ఫలితాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో ఎదురైనా ఆటంకాలు తొలగిపోతాయి. మిత్రులు, బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

వృశ్చికం
కొత్త కార్యక్రమాలను విజయవంతంగా పూర్తిచేస్తారు. విలువైన వస్తువులు, వస్త్రాలు, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఆర్థికపరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. త్రిశూల్ పొగ వేయడం వల్ల అన్ని విషయాలలో విజయం ప్రాప్తిస్తుంది.

ధనుస్సు
స్థిరాస్తి వివాదాలు పరిష్కారమై లబ్ది పొందుతారు. సన్నిహితుల ద్వారా విలువైన సమాచారం అందుతుంది. బంధువులు, మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. సుమంగళి పసుపు జలాలతో అమ్మవారికి అభిషేకం చేయండి.

మకరం
స్వల్ప ధన, వస్తులాభాలు పొందుతారు. సన్నిహితులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమవుతాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. అనుకోని అవకాశాలు లాభిస్తాయి. సర్వరక్షా చూర్ణంతో ప్రతిరోజూ స్నానమాచరించండి.(తలస్నానం వద్దు).

కుంభం
ఆరోగ్య సమస్యలు తీరి ప్రశాంతత పొందుతారు. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. దూరపు బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. జువ్వాది పూజలలో ఉపయోగించండి.

మీనం
చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా తొలగిపోతాయి. బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. అనుకోని అవకాశాలు లాభిస్తాయి. సుగంధసిద్ధ గంధాక్షితలు పూజలో ఉపయోగించండి.

నవంబరు 19 సోమవారం- పంచాంగం

శుభకార్యాలు, పండగలు, వ్రతాలు లాంటి వాటి విషయానికి వస్తే భారతీయులు సంప్రదాయ కాలగణన సాధనం పంచాంగాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం.. ఈ ఐదింటి కలయికే పంచాంగం. ఇది దుర్ముహూర్తాలు, శుభముహూర్తాలు, వర్జ్యాలు, రాహుకాలం, సూర్యోదయం లాంటి విషయాల గురించి తెలియజేస్తుంది. పంచాంగం కాలగణనకు అనేక పద్దతులు ఉన్నా ప్రస్తుతం మాత్రం రెండు విధానాలే అమల్లో ఉన్నాయి. అవి సూర్యమానం’, చంద్రమానం’. చంద్రుని సంచరణతో అనుసంధానమైంది చాంద్రమాన పంచాగం, సూర్యుని సంచరణతో అనుసంధానమైంది సూర్యమాన పంచాంగం. తెలుగువారు చంద్రమానాన్నే అనుసరిస్తారు. కాబట్టి చంద్రమానం ప్రకారం తెలుగు సంవత్సరాది ఛైత్రంతో ప్రారంభమై, ఫాల్గుణంతో పూర్తవుతుంది. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో సంచరించే స్థితిని బట్టి దీన్ని చాంద్రమానం అంటారు.

ఇక తెలుగు రాష్ట్రాల్లో వివిధ జ్యోతిషశ్శాస్త్ర నిపుణులు పంచాంగాలు మార్కెట్‌లో లభించినా, ములుగు సిద్ధాంతిగారి పంచాంగానికి ఓ ప్రత్యేకత ఉంది. ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతిగారి పంచాంగంలో తిథి, వార, వర్జ్యాలు, శుభమూహూర్త, దుర్ముహూర్తాల గురించి సరైన సమాచారం ఉంటుంది. గ్రెగేరియన్ క్యాలెండర్‌తోపాటు చంద్రమానం అనుసరించి రోజువారీ, నెలవారీ, వార్షిక పంచాంగాన్ని రూపొందిస్తారు. ములుగు వారి నవంబరు 19 సోమవారం పంచాంగం.

 

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
నవంబరు 19 సోమవారం ఉదయం 6-10- సాయంత్రం 5-21

 

తిథి నక్షత్రం మాసం-పక్షం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం
ఏకాదశి మధ్యహ్నం 2.29 వరకు తదుపరి ద్వాదశి ఉత్తరాభాద్ర సాయంత్రం 5.55 వరకు తదుపరి రేవతి కార్తీక మాసం- శుక్లపక్షం ఉదయం 6.15 గంటల లగాయతు మధ్యాహ్నం 12.15- 12.59 వరకు, తిరిగి మధ్యాహ్నం 2.29-3.14 వరకు ఉ. 7-30 నుంచి 9-00 వరకు

 

అమృత ఘడియలు శుభసమయం సంవత్సరం కాలం రుతువు
ఉ. 11-01 నుంచి 12-44 వరకు ఉదయం 9.20- 10.15 వరకు, సాయంత్రం 5.30-6.30 వరకు విళంబినామ దక్షిణాయనం శరదృతువుPlease Read Disclaimer