రాశి ఫలాలు 22 జనవరి 2019

0

రాశి ఫలాలు 22 జనవరి 2019

Daily Horoscope in Telugu 22nd Jan 2019

మేషం 
చేపట్టిన పనిలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. మిత్రులతో ఏర్పడిన విభేదాలు సమసిపోతాయి. సన్నిహితుల నుంచి సాయం అందుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. 

వృషభం 

కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. దూర ప్రాంతాల నుంచి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. విందు, వినోదాలలో పాల్గొంటారు. కీలక వ్యవహారాల్లో సొంత ఆలోచనలే శ్రేయస్కరం. అనారోగ్య సమస్యలను అధిగమిస్తారు. 

మిథునం

ప్రారంభించిన పనులు నిదానంగా సాగుతాయి. ఇంటి నిర్మాణ ఆలోచనలు అంతగా అనుకూలించవు. బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్వల్ప ధనలాభ సూచన. 

కర్కాటకం 
కొత్త విషయాలను తెలుసుకుంటారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన పనులు సాఫీగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. వాహన సౌఖ్యం ఉంది. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. 

సింహ 
ప్రారంభించిన పనుల్లో జాప్యం జరిగినా పూర్తిచేస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు పదోన్నతులు పొందుతారు. వ్యాపారాలలో అప్రమత్తంగా ఉండాలి. 

కన్య 
నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇంటి నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. చిన్ననాటి స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఆర్ధిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. 

తుల 
నూతన ఉద్యోగ ప్రాప్తి ఉంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విలువైన వస్తువులు కానుకగా పొందుతారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. వాహనసౌఖ్యం ఉంది. 

వృశ్చికం 
ఆర్ధిక సమస్యల నుంచి బయటపడతారు. రుణాలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు. చేపట్టిన పనులలో ఆటంకాలను అధిగమిస్తారు. శ్రమ అధికంగా ఉంటుంది. బంధువుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. వృత్తి-ఉద్యోగాలపరంగా సానుకూల ఫలితాలు ఉంటాయి. 

ధనుస్సు 
శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. చేపట్టిన పనులు సాఫీగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. సంతానానికి నూతన ఉద్యోగ, విద్యావకాశాలు లభిస్తాయి. సోదరుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. 

మకరం 
నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విద్య, ఉద్యోగవకాశాలు లభిస్తాయి. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. కాంట్రాక్టులు లాభసాటిగా ఉంటాయి. వస్తులాభం పొందుతారు. కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు. 

కుంభం 
సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఇంటి నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. 

మీనం 
ప్రారంభించిన పనులలో చికాకులు ఎదురవుతాయి. జీవిత భాగస్వామి సలహాతో కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తిచేస్తారు. బాధ్యతలు పెరిగినా సమర్ధవంతంగా నిర్వహిస్తారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు. షేర్ల క్రయ విక్రయాల్లో లాభాలు గడిస్తారు. 

జనవరి 22 మంగళవారం పంచాంగం

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
జనవరి 22 మంగళవారం ఉదయం 6.38- సాయంత్రం 5.45

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
విళంబినామ ఉత్తరాయణం-శీతాకాలం హేమంత రుతువు పుష్యమాసం-బహుళపక్షం ప్రీతి ఉదయం 8.56 వరకు తదుపరి ఆయుష్మాన్ తెల్లవారి 5.46 వరకు-
కౌలువ ఉదయం 9.28 తదుపరి తైతుల రాత్రి 8.16 వరకు తదుపరి గరజి
పాడ్యమి ఉదయం 7.04 వరకు తదుపరి విదియ

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత ఘడియలు శుభసమయం
ఆశ్లేష రాత్రి 11.36 వరకు తదుపరి మఖ మధ్యాహ్నం 1.42 నుంచి 3.06 వరకు ఉదయం 8.57 నుంచి 9.42 వరకు తిరిగి రాత్రి 11.02 నుంచి 11.53 వరకు మధ్యాహ్నం 3.00 నుంచి 4.30 వరకు రాత్రి1.32 నుంచి 3.02 వరకు ఉదయం 7.45 నుంచి 8.10 వరకు తిరిగి సాయంత్రం 4.45 నుంచి 5.10 వరకు

Tags: రాశి ఫలాలు 22 జనవరి 2019 , daily horoscope in telugu 22nd Jan 2019, daily horoscope in telugu 22nd January 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 22 జనవరి 2019 ములుగు రాశి ఫలాలు, 22 జనవరి 2019 పంచాంగం, January 22nd 2019 astrology in telugu, january 22nd 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu,
Please Read Disclaimer