రాశి ఫలాలు 9 ఏప్రిల్ 2019

0

రాశి ఫలాలు 9 ఏప్రిల్ 2019

Daily Horoscope in Telugu 9th April 2019

మేషం
చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. పరిమళ గంధాన్ని అష్టములికా తైలంలో కొద్దిగా వేసి ఉదయం, సాయంత్రం దీపారాధన చేయండి. అమ్మవారి ఆశీస్సులు పొందండి.

వృషభం
చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆరావళి కుంకుమతో మహాలక్ష్మీదేవిని పూజించండి. ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఋణాలు కొంతవరకు తీరుస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సంగీత, సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు.

మిథునం

ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. బంధువులతో ఆనందంగా గడుపుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు. అష్టమూలికా తైలం, తెల్ల జిల్లేడు వత్తులతో విఘ్నేశ్వరునికి దీపారాధన చేయండి. మంచి ఫలితాలు కలుగుతాయి.

కర్కాటకం
కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. అనుకోని విధంగా ఆర్ధిక లాభాలు పొందుతారు. దూరప్రాంతాల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. సంఘంలో గౌరవం పొందుతారు. లక్ష్మీతామరవత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధనచేయండి.

సింహ
వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. స్వల్ప ఋణాలు కొంతవరకు తీరుస్తారు. కుటుంబసభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. ధనలాభం పొందుతారు. సుమంగళి పసుపు జలాలతో అమ్మవారికి అభిషేకం చేయండి.

కన్య
ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. ఆర్ధిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప మార్పులు ఉంటాయి. వాహన సౌఖ్యం పొందుతారు. నిత్యం సరస్వతి తిలకం నుదుటున ధరించండి.

తుల
కుటుంబసభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆరావళి కుంకుమతో మహాలక్ష్మీదేవిని పూజించండి. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి.

వృశ్చికం 
దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. నూతన వస్తులాభం పొందుతారు. గృహం, వాహనాలు, స్థలాలు కొనుగోలు యత్నాలు ప్రారంభిస్తారు. దైవచింతన కలిగి ఉంటారు. సిద్ధగంధంతో మీ ఇష్ట దైవానికి అభిషేకం చేయండి.

ధనుస్సు
సోదరులతో ఆనందంగా గడుపుతారు. కీలక నిర్ణయాలలో జీవితభాగస్వామి సలహాలు తీసుకుంటారు. పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తిచేస్తారు. స్వల్ప ధనలాభ సూచన. జువ్వాది పూజలలో ఉపయోగించండి.

మకరం
వృత్తి, వ్యాపారాలలో ఎదురైనా ఆటంకాలు తొలగిపోతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. చర్చాగోష్టులలో చురుకుగా పాల్గొంటారు. నూతన విద్యలపై ఆసక్తి కలిగి ఉంటారు. నిత్యం సరస్వతి తిలకం నుదుటున ధరించండి.

కుంభం
చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తిచేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ప్రయాణాలు లాభిస్తాయి. శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. రోజూ గృహం, వ్యాపార సంస్థలో అష్టములికా గుగ్గిలంతో ధూపం వేయండి. శుభ ఫలితాలు పొందుతారు.

మీనం
బంధువుల ద్వారా ధన, వస్తులాభాలు పొందుతారు. పరిమళ గంధాన్ని పూజలో ఉపయోగించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. ఆర్ధిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

 

రాశి ఫలాలు 9 ఏప్రిల్ 2019 , daily horoscope in telugu 9th Apr 2019, daily horoscope in telugu 9th April 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 9 ఏప్రిల్ 2019 ములుగు రాశి ఫలాలు, 9 ఏప్రిల్ 2019 పంచాంగం, April 9th 2019 astrology in telugu, April 9th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,April 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer