రాశి ఫలాలు 9 జనవరి 2019

0

రాశి ఫలాలు 9 జనవరి 2019

Daily Horoscope in Telugu 9th Jan 2019

మేషం 
వైజ్ఞానిక విషయాలు ఆకర్షిస్తాయి. కొన్ని సమస్యలను దైవానుగ్రహంతో అధిగమిస్తారు. ఋణం ఇవ్వడం, తీసుకోవడం రెండూ మంచిది కాదు. 

వృషభం 
మిత్రబృందాలతో జరిపే చర్చలు ఆహ్లాదకరంగా సాగుతాయి. కాలానుగుణంగా మార్పులు అవసరమని భావిస్తారు. కీలక విషయాల్లో తగిన నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరుల సలహాలు విసుగుపుట్టిస్తాయి. 

మిథునం

శుభకార్యాలకు సంబంధించిన విషయంలో మధ్యవర్తులను ఆశ్రయిస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆహార, ఆరోగ్య నియమాల పట్ల ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తారు. ధబలాభ సూచన. 

కర్కాటకం
 

రచన, వ్యాసంగాల పట్ల ఆసక్తిని కనబరుస్తారు. ఆరంభశూరంభత్వంతో కొత్త పనులను ప్రారంభించే అవకాశాలున్నాయి. మాటతీరులో కొద్దిపాటు మార్పులను చేస్తే అధికంగా లాభపడతారు. 

సింహ 
సమాజంలో ఉన్నతస్థాయి వారు కూడా మీ సలహాలను స్వీకరిస్తారు. స్వయంఉపాధి పథకాల కోసం ప్రభుత్వ సహాయం లభిస్తుంది.. ప్రజాసంబంధాలు విస్తృత పరచుకోగలుగుతారు. 

కన్య 

గోప్యంగా వ్యవహరిస్తారు. ఆలోచనలు మెరుగైనవే అయినా పనులలో జాప్యం ఏర్పడుతుంది. అసూయాద్వేషాలకు కారణం అంతుపట్టదు. 

తుల 
పంతానికి పోయి ప్రయోజనాలను వదులుకుంటారు. అన్యభాషలు నేర్చుకోవాలనే కుతూహలం పెరుగుతుంది. ఆర్ధిక అంశాలలో అప్రమత్తంగా ఉండాలి. 

వృశ్చికం 
పొదుపు పథకాలకు శ్రీకారం చుడతారు. కార్యాలయంలో పనులు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఒకానొక సమయంలో మానసికోద్రేకాన్ని కలిగి ఉంటారు. మంచి అవకాశాలు లభిస్తాయి. 

ధనుస్సు 
క్రయవిక్రయాలకు సంబంధించిన అంశాలు సానుకూల పడతాయి. వక్రభాష్యాలు చెప్పేవారు అధికమవుతారు. ఇతరులకు అనాలోచితంగా వాగ్ధానాలను చేయడం మంచిది కాదు. 

మకరం 
విజయానికి ఐకమత్యమే పునాదని బలంగా నమ్ముతారు. ఆత్మస్థైర్యం, మనోబలం అధికంగా కలిగి ఉంటారు. వ్యక్తిగత విషయాలకన్నా వృత్తి-ఉద్యోగాలకు ప్రాముఖ్యతనిస్తారు. 

కుంభం 
నూతనోత్సాహాంతో ముందుకు సాగుతారు. ఇతరులు చెప్పేది ఓర్పుగా వింటారు. సంఘంలో గౌరవమర్యాదలు పెంపొందుతాయి. బంధువర్గంతో ఏర్పడిన వివాదాలు సమసిపోతాయి. 

మీనం 
పనులు నెమ్మదిగా సాగినా తుది ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. పనిభారం అధికంగా ఉంటుంది. నిష్ణాతుల నుంచి తీసుకునే సూచనల వల్ల లాభపడతారు.

జనవరి 9 బుధవారం పంచాంగం.

 

తేదీ వారం సూర్యోదయం- సూర్యాస్తమయం
జనవరి 9 బుధవారం ఉదయం 6.37- సాయంత్రం 5-38

 

సంవత్సరం కాలం మాసం-పక్షం రుతువు యోగం-కరణం తిథి
విళంబినామ దక్షిణాయనం-శీతాకాలం పుష్యమాసం-శుక్లపక్షం హేమంత రుతువు సిద్ధి రాత్రి 3.55 వరకు తదుపరి వ్యతీపాతం- గరజి ఉదయం 11.57 వరకు తదుపరి 
వణిజ రాత్రి1.01 అనంతరం తదుపరి భద్ర/విష్ఠి
తదియ మధ్యాహ్నం 2.30 వరకు తదుపరి చవితి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత ఘడియలు శుభసమయం
ధనిష్ఠ రాత్రి రాత్రి 2.50 వరకు తదుపరి శతభిష లేదు ఉదయం 11.52 నుంచి 12.36 వరకు మధ్యాహ్నం 12.00 నుంచి 1.30 వరకు మధ్యాహ్నం 1.04 నుంచి 2.50 వరకు ఉదయం 7.15 నుంచి 7.45 వరకు, మధ్యాహ్నం 3.00 నుంచి 4.00 వరకు

Tags : రాశి ఫలాలు 9 జనవరి 2019 , daily horoscope in telugu 9th Jan 2019, daily horoscope in telugu 9th January 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 9 జనవరి 2019 ములుగు రాశి ఫలాలు, 9 జనవరి 2019 పంచాంగం, January 9th 2019 astrology in telugu, january 9th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu,
Please Read Disclaimer