వివేకాందరెడ్డి మరణం..సీబీఐ దర్యాప్తునకు డిమాండ్

0

వివేకానందరెడ్డి మరణం వైయస్ కుటుంబ సభ్యుల్నీ – వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా కలచివేసింది. వైఎస్ విజయమ్మ – వైఎస్ అవినాష్ – సహా కుటుంబ సభ్యులు పులివెందుల ఆస్పత్రికి చేరుకొని శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా వివేకానందరెడ్డి హత్యపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు వైఎస్ కుటుంబ సభ్యులు. ఇది ముమ్మాటికీ హత్యేనని ఆరోపించారు.

గంటలు గడుస్తున్న కొద్దీ… ఈ ఘటనకు సంబంధించి కొత్త కొత్త సమాచారం అంతా బయటకు వస్తోంది. వివేకానందరెడ్డి ది సహజ మరణంకాదన్న అనుమానాలు గట్టిగా బలపడుతున్నాయి. ఘటన జరిగిన తీరు – అక్కడ నుంచి వస్తున్న సమాచారం చూస్తే దీని వెనుక చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు.

ఎన్నికల నేపథ్యంలో వివేకానందరెడ్డిగారు చాలా చురుగ్గా జిల్లాలో తిరుగుతున్నారని. జమ్మలమడుగు ఎన్నికల ఇన్ ఛార్జిగా కూడా ఆయన ఉన్నారని తెలిపారు. గత రాత్రి 930 గంటలకు ఆయన జమ్మలమడుగు నుంచి నేరుగా ఇంటికి వచ్చినట్టు సన్నిహితులు తెలిపారు.

వివేకానందరెడ్డిగారిని అడ్డు తొలగించుకోవడం ద్వారా – ప్రతిపక్ష వైసీపీ అధినేత జగన్ ని దెబ్బతీయాలన్న కుట్ర ఇందులో ఉందన్న అనుమానాలను వైసీపీ శ్రేణులు వ్యక్తం చేశాయి.

వైఎస్ వివేకానందరెడ్డి మరణంపై చంద్రబాబు సిట్ ఏర్పాటు చేశారని.. బాబు ప్రభుత్వంలో సిట్ లు ఎలా పనిచేస్తాయో – ఎలా పనిచేశాయో – ఈ రాష్ట్రంలో నిందితులను – దోషులను కాపాడే ప్రయత్నంలో అవి ఎలా నీరుగారిపోయాయో ఐదేళ్లుగా చూస్తూనే ఉన్నామని వైఎస్ కుటుంబ సభ్యులు – అభిమానులు ఆరోపిస్తున్నారు.

పార్టీనుంచి ఫిరాయించి – చంద్రబాబు వద్దకు చేరి.. – ఇప్పుడు మంత్రి పదవిలో ఉన్న వ్యక్తిపైనే తమకు అనుమానాలున్నాయని.. గడచిన కొన్ని రోజులుగా జమ్మలమడుగులో ఎంతటి అరాచకాలు చేస్తున్నాడో అందరికీ తెలుసని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. వివేకానందరెడ్డి మరణం వెనుక ఆయనే ఉండొచ్చని వైఎస్ అభిమానులు ముక్తకంఠంతో ఆరోపిస్తున్నారు.

ఈ మధ్యకాలంలో కడప – పులివెందులలో ఎలా గెలిచి తీరుతామో చూడాలని టీడీపీ మంత్రులు – నాయకుల నుంచి వచ్చాయంటే… దాని వెనుకున్న అసలు కుట్ర ఏంటో ప్రజలకు చెప్పాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు
Please Read Disclaimer