వల్లభనేని వంశీనా.? ఆయనెవరు.?

0

ఎన్నికల ప్రచారంలో పార్టీలన్నీ తలమునకలైపోయాయి. ఆరోపణలు ప్రత్యారోపణలు ప్రతీ రోజు మనం వింటూనే ఉన్నాం. అయితే.. ఇలాంటి ఆరోపణల్లో అందర్ని బాగా అట్రాక్ చేసిన అంశం మాత్రం ఒక్కటే. హైదరాబాద్లో ఆస్తులున్న ఏపీ నాయకుల్ని టీఆర్ ఎస్ లీడర్లు భయపెడుతున్నారని. చంద్రబాబు కూడా తన ప్రసంగాల్లో పదే పదే ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ కోణంలో.. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పార్టీ మారమని కేటీఆర్ నుంచి బెదిరింపు ఫోన్ వచ్చిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలు ఇప్పుడు తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ వరకు వెళ్లాయి. దీంతో. తనపై వస్తున్న పుకార్లపై ఆయన స్పందించారు. అసలు తనకు వల్లభనేని వంశీ అంటే ఎవరో కూడా తెలియదని అన్నారు. అలాంటప్పుడు వంశీతో తాను ఫోన్ లో ఎలా మాట్లాడతానని అన్నారు కేటీఆర్.

“నేను వల్లభనేని వంశీ పేరు ఇంతవరకు వినలేదు.నేను వినని పేరుకి నేను ఫోన్ చేసి బెదిరించానని వార్తలు వచ్చేసరికి షాక్ అయ్యా. అందుకే అందరికి క్లారిటీ ఇవ్వదలిచా. నాపై ఏపీలో ఇలా దుష్ప్రచారం ఎందుకు జరుగుతుందో అస్సలు అర్థం కావడం లేదు. ఇంకా చెప్పాలంటే మిగిలిన లీడర్ల కంటే హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడికే ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. మేం ఏనాడైనా ఆయన్ను ఏమైనా అన్నామా. ఈ మధ్యే ఆయన కొత్త ఇల్లు కట్టుకున్నారు. ఈ విషయంలో మా నుంచి ఆయనకు ఎలాంటి ఇబ్బందులు జరగలేదు. మా రాష్ట్రానికి సంబంధించి మాకున్న తలనొప్పులు మాకున్నాయి. మాకు వాటితోనే సరిపోతుంది తప్ప.. ఇలాంటి ఫోన్స్ కాల్స్ చేయాల్సిన అవసరం మాకు లేదు” అని అన్నారు కేటీఆర్.
Please Read Disclaimer