ఆ గ్యాంగ్ స్టర్ ఆస్తులేమయ్యాయి?

0

సినిమా .. రాజకీయం.. భూదందాలు.. మాపియా .. ఈ నాలుగింటికి ఉన్న లింకులు అంత తేలిగ్గా విడదీయలేనివి. సెలబ్రిటీల సొమ్ముల్ని ల్యాండ్ డీల్స్ లో పెట్టుబడులు పెట్టడం సహజం. ఆ క్రమంలోనే రకరకాల పరిచయాలు ఉంటాయి. ఇక భూదందాల్లో – కబ్జాల ఫర్వంలో ఫ్యాక్షన్ యాక్షన్ తప్పనిసరి. అయితే అప్పట్లో భారీ యాక్షన్ ఫ్యాక్షన్ మాఫియా హైదరాబాద్ లో సృష్టించిన కలకలం అంతా ఇంతా కాదు. ఈ ఫ్యాక్షన్ గ్యాంగ్ లతో సినిమావాళ్లకు చిక్కులొచ్చి పడ్డాయి. అప్పట్లో ఓ స్టార్ హీరోయిన్ ని మాఫియా వాళ్లు బెదిరించారని ప్రముఖంగా ప్రచారమైంది. ఆ క్రమంలోనే ఓ సినీనిర్మాత పై పోలీస్ విచారణ సాగిందని వార్తలొచ్చాయి.

అనంతర కాలంలో రకరకాల పరిణామాలు. సినీపరిశ్రమలో డ్రగ్స్ – వ్యభిచారం లాంటి వివాదాలు బయటపడ్డాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో గ్యాంగ్ స్టర్ యాక్టివిటీస్ కొంత నెమ్మదించాయి. అప్పట్లో సినిమా లింకులున్న గ్యాంగ్ స్టర్ ఒకరు హైదరాబాద్ లో పలు చోట్ల భారీగా ఆస్తుల్ని కూడగట్టారని – హైటెక్ సిటీ – గచ్చిబౌళి-కాజగూడ పరిసరాల్లో కొన్ని కొండల్ని ఆక్రమించారని చెప్పుకున్నారు. మాదాపూర్ – అయ్యప్ప సొసైటీ ఏరియాలో కొన్నిటిని ఆక్రమించారన్న వార్తలు వచ్చాయి. ప్రస్తుతం అక్కడ ఓ ఇంట్లో బంధువులు నివసిస్తున్నారన్న మాటా వినిపిస్తోంది. ఇక అయ్యప్ప సొసైటీలో చాలా భూముల్లో అక్రమ కట్టడాలు ఉన్నా ప్రభుత్వాలు- రాజకీయ నాయకుల పరిధిలో సెటిల్ మెంట్లు సాగాయన్న మాటా వినిపించింది. ప్రస్తుతం కాజగూడ- బయో పార్క్ పరిసరాల్లో పూర్తిగా టీఆర్ ఎస్ ప్రభుత్వం డెవలప్ మెంట్స్ చేసింది. ఇనార్బిట్ ఏరియాలో.. నగర పోలీసులకు హెడ్ క్వార్టర్స్ లాంటి ఈ ఏరియాలో నిర్మించారు. ఇక్కడే సిటీకి మణిహారం లాంటి ఐకియా మల్టీప్లెక్సు ఉంది. ఆ చుట్టుపక్కల కొన్ని ప్రైమ్ ఏరియాల్లో గ్యాంగ్ స్టర్స్ కి సంబంధించిన భూముల గొడవలపైనా జనాల్లో ఆసక్తికర చర్చ నిరంతరం సాగుతూనే ఉంటుంది. ఇక ఈ వివాదాలతో సంబంధం ఉన్న ఓ గ్యాంగ్ స్టర్ భూముల్ని ప్రభుత్వాలు లాక్కున్నాయని చెప్పుకోవడం కొసమెరుపు.
Please Read Disclaimer