తుఫాన్ లకు పేరు ఎలా వచ్చిదంటే?

0

బంగాళాఖాతంలో ఏర్పడ్డ ‘ఫొని’ తుఫాన్ తీరం దాటింది. ఈ తుఫాన్ ప్రచండ భీకరంగా ఒడిషా ఉత్తర ఆంధ్రాలో భారీ వర్షాలు పెను గాలులతో బీభత్సం సృష్టిస్తోంది. అయితే ఈ ఫొని తుఫాన్ పేరు ఎలా వచ్చింది. దీనికి అసలు ఎవరు పేరు పెట్టారు.? ఈ తుఫాన్ల పేర్లకు కారణమేంటన్న సందేహం తాజాగా చాలా మందికి వస్తోంది.

మొన్న వచ్చిన పెథాయ్ హుద్ హుద్ తిత్లీ ఇలా అన్ని తుఫాన్ లకు పేరున్నట్టే నేటి ‘ఫొని’కూడా పేరు పెట్టారు. దీనికోసం ఓ ప్రత్యేక సంస్థ కూడా దక్షిణ ఆసియాలో పనిచేస్తుంటుంది.

దక్షిణా ఆసియా మధ్యప్రాచ్య దేశాల్లో వచ్చే తుఫాన్ లకు పేరు పెట్టే సంప్రదాయం 2004 నుంచి మొదలైంది. హిందూ బంగాళాఖాతం ఆరేబియా సముద్రంలో పుట్టిన తుఫాన్లకు ఈ పేర్లు పెడుతుంటారు. ఆరేబియా సముద్రంలో వచ్చే తుఫాన్లకు మాత్రం 1953 నుంచే పేర్లు పెడుతుండడం విశేషం.

తుఫాన్లకు ఇన్నాళ్లు పేర్లు పెట్టకపోవడంతో ఇబ్బందులు తలెత్తేవి. వాటి గురించి వార్తలు న్యూస్ లో రాయలన్నా.. చర్చించాలన్నా.. ప్రజలను అప్రమత్తం చేయాలన్నా సమస్యలు వచ్చాయి. దీంతో 2004లో ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో)’ ఆధ్వర్యంలో దక్షిణా ఆసియా దేశాలైన భారత్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ మయన్మార్ శ్రీలంక థాయిలాండ్ మల్దీవులు ఓమన్ దేశాలు సమావేశమై.. దేశానికి 8 చొప్పున 64 పేర్లు సూచించాయి. ఈ ‘ఫొని’ తుఫాన్ పేరు 56వది. మిగిలిన పేర్లన్నీ అయిపోయాక మళ్లీ ఈ దేశాలు సమావేశమై మరో 64 పేర్లు ఇస్తాయి. అదీ ఈ తుఫాన్ ల పేర్ల వెనుకున్న చరిత్ర..
Please Read Disclaimer