సాహో లో ప్రభాస్ వాడిన బ్లూటూత్ గురించి మీకు తెలియని సీక్రెట్స్!!

రవిప్రకాశ్ కు షాకిచ్చిన హైకోర్టు!

0

ఎక్కడున్నాడో తెలీదు. పోలీసులు నోటీసులు ఇస్తే స్పందించరు. కనిపించకుండా.. రహస్య ప్రాంతంలో ఉంటూ తనకు నచ్చిన వారికి స్పెషల్ ఇంటర్వ్యూలు ఇస్తున్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై సైబర్ క్రైం పోలీసులు పెట్టిన కేసులు రాజ్యాంగ విరుద్ధమంటూ ఆయన లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

తన పిటిషన్ పై అత్యవసర విచారణ జరపాలన్న ఆయన వినతిని కోర్టు నో చెప్పింది. అంత అర్జెంట్ గా విచారణ జరపాలన్న అవసరం లేదని కోర్టు కొట్టేసింది. ఇదిలా ఉంటే.. మూడు రోజులుగా రవిప్రకాశ్ అజ్ఞాతంలో ఉండటం తెలిసిందే. మోసం.. ఫోర్జరీ.. డేటా చౌర్యం లాంటి పలు ఆరోపణలు చేసిన టీవీ9 యాజమాన్యం ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు రవిప్రకాశ్ కు ఇప్పటికే రెండు నోటీసులు జారీ చేశారు.

రెండో నోటీసు గడువు ఈ రోజు (బుధవారం)తో ముగియనుంది. అయినప్పటికీ ఆయన పోలీసుల ఎదుట హాజరు కాలేదు. ఆయన ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తనపై సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసులు సరికాదని.. రాజ్యాంగ విరుద్ధంగా పేర్కొంటూ హైకోర్టును ఆశ్రయించారు.

రవిప్రకాశ్ తో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నటుడు శివాజీపైనా కేసులు నమోదు చేసి.. నోటీసులు జారీ చేశారు. ఇప్పటివరకూ ఆయన కూడా పోలీసుల విచారణకు హాజరు కాలేదు. ఇదిలా ఉంటే.. రవిప్రకాశ్ ఎక్కడ ఉన్నారు? అన్నది ప్రశ్నగా మారింది. కొందరు ఏపీలో ఉన్నారని చెబుతుంటే.. మరికొందరు మాత్రం ముంబయిలో ఉన్నట్లుగా చెబుతున్నారు. పోలీసులకు పెద్ద ఫజిల్ గా మారిన రవిప్రకాశ్ ఉదంతం రానున్న రోజుల్లో ఏ దిశగా ప్రయాణిస్తుందో చూడాలి.
Please Read Disclaimer