కూతురింట్లో అత్త గిల్లుడు.. సాలీడుతో ఆటకట్టించిన అల్లుడు!

0

కూతురింటికి పదే పదే వస్తూ తమ ప్రైవసీకి భంగం కలిగిస్తున్న అత్తకు అల్లుడు తగిన బుద్ధి చెప్పాలనుకున్నాడు. సాలీడు పురుగులతో సాలీడ్‌గా ఆమె ఆటకట్టించాడు. ఈ ఘటన యూకేలో చోటుచేసుకుంది. కూతురి ఇంట్లో తిష్టవేసి.. అల్లుడి జీవితంతో ఆటలాడే అత్తలు ఇండియాలోనే కాదండోయ్ ఇంగ్లాండ్‌లో కూడా ఉంటారు.

‘రెడిట్’ అనే సోషల్ మీడియా సైటులో ఓ అత్త బాధితుడు పేరు వెల్లడించకుండా తన బాధను వెల్లడించాడు. ‘‘నా అత్త ఏం చెప్పినా మా మామ తలాడిస్తాడు. పిల్లలను చూడాలనే వంకతో రోజు ఇంటికి వస్తూ నాకు ప్రైవసీ లేకుండా చేస్తున్నారు. పైగా కూతురికి సలహాలు ఇవ్వడం, నన్ను తిట్టించడం అలవాటైపోయింది. దీంతో ఆమెను ఇంటికి రాకుండా ఏం చేయాలా అని ఆలోచించాను. మా అత్తకు అరక్నాఫోబిక్ (arachnophobic) ఉందని తెలుసుకున్నా. ఈ ఫొబియా ఉన్నవారు సాలీడు పురుగు కనిపిస్తే చాలు.. భయంతో పరుగులు తీస్తారు. మా అత్త కూడా అంతే.. సాలీడు పురుగు ఏదో మూలన తన పని తాను చేసుకుంటే.. ఆమె మాత్రం ఎగిరి గంతేసి అదేదో దాడి చేస్తున్నంత బిల్డప్ ఇస్తుంది’’ అని తెలిపాడు.

ఈ నేపథ్యంలో మనోడికి చాకులాంటి ఐడియా వచ్చింది. మాంచి దిట్టంగా.. ఒళ్లంతా వెంట్రుకలతో భయానకంగా కనిపించే సాలీడు (Tarantula) తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. అయితే, ఇక్కడ సేఫ్ సైడ్‌గా మరో ప్లాన్ వేశాడు. తాను అరుదైన సాలీడు పురుగును పెంచాలనుకుంటున్నా అని, అది చాలా బాగుంటుందని చెప్పి భార్యను ఒప్పించాడు. భార్యకు అతడి బుర్రలో ఉన్న కన్నింగ్ ఐడియా గురించి అస్సలు తెలియకపోవడం ప్లస్ అయ్యింది. అప్పటి నుంచి సాలీడును హాల్లో చిన్న ఎన్‌క్లోజర్‌లో పెట్టి పెంపుడు జంతువులా సాకడం మొదలుపెట్టాడు.

మొత్తానికి అతగాడి ప్లాన్ కత్తిలా పనిచేసింది. ఆ సాలీడుకు భయపడి అత్త ఇంటికి రావడం తగ్గించింది. అప్పుడప్పుడు అతడి మామయ్య మాత్రమే వస్తున్నాడు. దీంతో అతడికి ఫుల్ ప్రైవసీ దొరికింది. అత్త రాక తగ్గిన రోజు నుంచి భార్య పోరు కూడా తగ్గింది. నొప్పి లేకుండానే అత్త గిల్లుడుకు షాకిచ్చాడు అల్లుడు. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి చిలిపి పనిచేశారా??
Please Read Disclaimer