ఇన్ఫోసిస్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్

0

ఏదైనా కంపెనీ స్థాపించి అది అందనంత ఎత్తుకు ఎదిగితే ఏం చేస్తారు.. ? ఆ లాభాలను పంచుకొని సదురు యజమానులు మరింత పైకి ఎదుగుతారు.. కొందరు కంపెనీని విస్తరిస్తారు. కానీ ప్రపంచ సాఫ్ట్ వేర్ దిగ్గజం.. ఇండియాకు చెందిన ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ మాత్రం సంచలన నిర్ణయం తీసుకుంది. కంపెనీ ఎదగడంలో పాటుపడ్డ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ను ప్రకటించింది.

ఉద్యోగుల పనితీరు ఆధారంగా షేర్లను కేటాయించి పారిశ్రామిక రంగాన్నే ఆశ్చర్యపరిచింది. రూ.10 కోట్ల విలువైన మార్కెట్ పరిమిత స్టాక్ యూనిట్లు (ఆర్ ఎస్ యూ)ను కంపెనీ సీఈవో మేనేజింగ్ డైరెక్టర్ సీల్ల్ పరేఖ్ కు గిఫ్ట్గ్ గా ఇన్ఫోసిస్ కేటాయించింది. ఇక సీఈవోకే కాదు.. మిగతా ఉన్నత ఉద్యోగులైన ఎగ్జిక్యూటివ్ సీఈవో యూబీ ప్రవీణ్ కు రూ.4కోట్ల విలువలైన షేర్లను కేటాయించింది. మిగతా ఉద్యోగులకు కలిపి రూ.5కోట్ల షేర్లను కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎంప్లాయి స్టాక్ ఓనర్ షిప్ ప్లాన్ కు బోర్డు ప్రతిపాదనలు పంపింది. దీనికి వాటాదారుల ఆమోదమే తరువాయి.

దేశంలోనే ఇన్ఫోసిస్ రెండో అతిపెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీ. ఉద్యోగుల పనితీరు వల్లే ఈ స్థాయికి కంపెనీ ఎదిగింది. అందుకే వారి వలసలను తగ్గించుకునేందుకు కంపెనీ షేర్లను వారికి ప్రోత్సాహకంగా కేటాయించి సంచలన నిర్ణయం తీసుకుంది. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు షేర్ల రూపంలో ఈ ప్రోత్సాహకాలు అందించింది. దీనికోసం 50 కోట్ల షేర్లను కేటాయించాలని బోర్డు ప్రతిపాదించడం విశేషం. వాటాదార్ల ఆమోదంతో ఈ పథకం అమల్లోకి రానుంది. అయితే ఇన్ఫోసిస్ మొత్తం మూలధన వాటాలో ఈ షేర్ల కేటాయింపు కేవలం 1.15శాతం మాత్రమే కావడం గమనార్హం.

కంపెనీ కోసం ధీర్ణకాలికంగా విజయానికి కృషి చేసిన ఉద్యోగులను యజమానులుగా చేయడం.. వారి శ్రమకు నిబద్దతకు ప్రతిఫలం అందించామని కంపెనీ సీఈవో ఫరేక్ అన్నారు. ఇది ఉద్యోగులను గౌరవించడం.. గుర్తించడం అని అన్నారు. మొత్తం కంపెనీలో 2.28లక్షల మంది ఉద్యోగులుండగా.. వలసల రేటు 19.5శాతంగా ఉంది. ఈసారి అది పెరిగి 20.4శాతమైంది. వలసలు తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.
Please Read Disclaimer