ఎన్నో ఏళ్లగా టీడీపీతో ఉన్న బంధాన్ని తెంచుకుని వస్తే జగన్ మోసం చేసారు

0

ఎన్నో ఏళ్లగా టీడీపీతో సన్నిహితంగా మెలిగిన దాసరి కుటుంబం ఇటీవలే వైఎస్సాఆర్ కాంగ్రెస్ లో చేరింది. దాసరి జై రమేష్ కు విజయవాడ పార్లమెంట్ సీటు ఇస్తానని జగన్ హామీ ఇవ్వడంతో ఆయన,, ఆయన సోదరుడు దాసరి బలవర్ధన్ రావు వైకాపా కండువా కప్పుకున్నారు. ఐతే ఇప్పుడు వారికి ఆ పార్టీలో మొండి చెయ్యి చూపిస్తున్నట్టు సమాచారం. దీంతో ఆయన భవిష్యత్‌ డోలాయమానంలో పడింది. జైరమేశ్‌ను పక్కనబెట్టడంపై ఆయన వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.

ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్‌(పీవీపీ) వైకాపా అధినేత జగన్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. విజయవాడ పార్లమెంట్‌ స్థానానికి వైకాపా అభ్యర్థిగా పీవీపీ పోటీ చేసే అవకాశం ఉంది. ఈ నెల 23న ఆయన నామినేషన్‌ వేస్తారని ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లోనే వైకాపా తరఫున పీవీపీ విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించారు. అయితే అప్పట్లో ఆయనకు సీటు దక్కలేదు. ఆ తరువాత ఆయన పవన్ కళ్యాణ్ కు దగ్గరగా చేరి టీడీపీలో టిక్కెట్ కోసం ప్రయత్నం చేశారు.

అయితే అది కూడా కుదరలేదు. దీనితో 2014లో ఆయన పోటీ చెయ్యలేదు. జగన్ కేసులలో ఒకటి రెండు కేసులలో పీవీపీ కూడా నిందితుడు కావడం విశేషం. విజయవాడ సిట్టింగు ఎంపీ కేశినేని నానికి ప్రజలలో మంచి పేరు ఉంది. ఆర్ధికంగా కూడా గట్టి అభ్యర్థి. ఆయనను ఢీకొట్టడానికి అదే సామజిక వర్గానికి చెందిన పీవీపీని తెర మీదకు తెచ్చారు జగన్. నానిని పీవీపీ అడ్డుకోగలరేమో చూడాలి. నాని ఇప్పటికే విజయవాడలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. రోడ్ షోలు, ఇంటింటి ప్రచారం కూడా మొదలు పెట్టేశారు.
Please Read Disclaimer