తెలంగాణ ‘లోకల్ వార్‌’లో జనసేన.. గమనిక ‘గుర్తు’ మారింది

0

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల బరిలోకి దిగుతోంది జనసేన. రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధమవుతోంది. జనసేన తరపున అభ్యర్థుల్ని రంగంలోకి దింపుతోంది. స్థానిక నాయకత్వం ఇప్పటికే అభ్యర్థుల్ని ఎంపికచేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణవ్యాప్తంగా కసరత్తును మొదలు పెట్టినట్లు సమాచారం.

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ గుర్తులు కాస్త మారాయంటోంది జనసేన. ఈ మార్పును గమనించాలంటూ పార్టీ తరపున ట్విట్టర్ ద్వారా ప్రకటన చేశారు. జెడ్పీటీసీ ఎన్నికలకు గాజు గ్లాసు గుర్తుగా ఉంటుందని.. అయితే ఎంపీటీసీ ఎన్నికలకు మాత్రం బ్యాటు గుర్తు ఉంటుందని తెలిపింది. ఎంపీటీసీకి గ్లాస్ గుర్తు లేనందున బ్యాట్ గుర్తు కేటాయించారని తెలిపింది. గుర్తు విషయంలో మార్పును గమనించాలని జనసేన చెబుతోంది.

జనసేన ట్వీట్‌లో ‘ZPTC : Glass Tumbler ( గాజు గ్లాసు)

MPTC : Bat (బ్యాట్)

Note : MPTC లో గ్లాస్ గుర్తు లేనందున బ్యాట్ గుర్తు కేటాయించడం జరిగింది’ అని తెలిపారు.
Please Read Disclaimer