పాల్వంచలో ఘనంగా లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం

0

భద్రాద్రి కొత్తగూడెంలో లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. పాల్వంచలోని నవభారత్ ప్రాంతంలో కొలువైన లక్ష్మీ నరసింహ స్వామి వారికి శుక్రవారం (మే 17) నిర్వహించిన కళ్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహించిన అనంతరం భక్తులందరికీ ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ చేశారు. ఇందుకు ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

సుమారు 2 వేల మంది భక్తులు స్వామి వారి సేవలో పాల్గొన్నట్లు ఆలయ ఛైర్‌పర్సన్ రావుల ఆదిలక్ష్మీ నర్సయ్య తెలిపారు. ఈ కళ్యాణ మహోత్సవానికి టైమ్స్ నౌ జర్నలిస్టు ఆర్ ఉప్పల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న వారందరికీ సిబ్బంది ధన్యవాదాలు తెలిపారు.
Please Read Disclaimer