దేశీయ విపణిలోకి కొత్త బెంజ్ ‘సీఎల్‌ఎస్’ కారు

0

జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్-బెంజ్.. దేశీయ విపణిలోకి సరికొత్త ‘బెంజ్ – సీఎల్‌ఎస్’ మోడల్‌ను శుక్రవారం (నవంబరు 16) లాంచ్ చేసింది. ఈ కారు ప్రారంభ ధరను రూ.84.70 లక్షలుగా నిర్ణయించింది. మూడోతరంగా రూపొందించిన ఈ సీఎల్‌ఎస్ మోడల్.. బీఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా డీజిల్ ఇంజిన్‌తో తయారు చేసింది. ప్రస్తుతానికి మెర్సిడెస్ బెంజ్ సీఎల్ఎస్ 300డి వేరియంట్ మాత్రమే వినియోగదారులకు లభ్యం కానుంది. వచ్చే ఏడాదిలో మరిన్ని వాహనాలను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సంస్థ ప్రకటించింది.

బెంజ్ – సీఎల్‌ఎస్ ప్రత్యేకతలివే..
◆ కొత్త మెర్సిడెస్ బెంజ్ సీఎల్ఎస్ 300డీలో కొన్ని నెలల క్రితం వచ్చిన ‘ఫేస్ లిఫ్టెడ్’ సీ 300డి సెడాన్ 2.0 లీటర్ ఇంజిన్‌ను అమర్చారు. ఈ ఇంజిన్ 245 పీఎస్ పవర్, 500 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది.
◆ ఈ కారులో 9-స్పీడ్ ఆటో ట్రాన్స్ మిషన్ ఇచ్చారు.
◆ ఈ కారు 6.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే సామర్థ్యం ఉందని కంపెనీ చెబుతోంది. దీని గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లుగా ఉండనుంది.

బెంజ్ సీఎల్‌ఎస్
◆ కొత్త సీఎల్ఎస్ కారు ఈ-క్లాస్ ప్లాట్ ఫామ్ ఆధారంగా తయారైంది. దీని పొడవు, వెడల్పు, ఎత్తు ఎక్కువగా ఉంటాయి.

◆ స్టైలిష్ రూఫ్ లైన్, ఫ్రేమ్ లెస్ డోర్ ఈ కారు ప్రత్యేకం.
◆ ఇంటీరియర్ పరంగా కారును అద్భుతంగా రూపొందించారు.
◆ ఈ కారులో 12.3 అంగుళాల ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ అమర్చారు. యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో‌లకు కూడా సపోర్ట్‌ చేస్తుంది.
◆ కారులో సన్ రూఫ్ సౌకర్యాన్ని కూడా పొందుపరిచారు.
◆ 13 స్పీకర్ బర్మెస్టర్ ఆడియో సిస్టమ్
◆ బెంజ్ – సీఎల్‌ఎస్ ప్రత్యేకతలివే.. ఎయిర్ బాడీ కంట్రోల్ ఎయిర్ సస్పెన్షన్, 18 అంగుళాల అలాయ్ వీల్స్, మల్టీబీమ్ ఎల్ఈడీ హెడ్ లైట్స్ ఈ కారులో అమర్చారు.




Please Read Disclaimer