టీ ఎన్నికలు.. మోహన్ బాబు సపోర్ట్ వీరికే

0

ముక్కుసూటి తనానికి పెట్టింది పేరైనా సినీ నటుడు డాక్టర్ మోహన్ బాబు మరోసారి తన నైజాన్ని చాటుకున్నారు. తెలంగాణ ఎన్నికల విషయంలో తాను చెప్పదలుచుకున్నదని కుండబద్దలు కొట్టారు.

తెలంగాణ ఎన్నికల వేళ మోహన్ బాబు కే సీ ఆర్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2014లో కేసీఆర్ కు విలన్ లా కనిపించిన నేను 2018వరకు కేసీఆర్ కు అనుకూలంగా మాట్లాడుతానని అనుకోలేదని.. ఇందుకు కారణం ఒకటేనని స్పష్టం చేశారు. కే సీ ఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజలు కష్టపడి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారని తెలిపారు. అద్భుత పాలన కేసీఆర్ అందిస్తున్నాడన్నారు.

తెలంగాణ కు జరుగుతున్న ముందస్తు ఎన్నికల్లో తెలంగాణను మరోమారు కాపాడుకోవాలని మోహన్ బాబు పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఆంధ్ర విషయంలో కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రా రాయలసీమ లో ఎలాగో కుల జాడ్యం తప్పదని.. తెలంగాణ వారైనా కుల జాడ్యానికి లోనుకావద్దని కోరారు..

ఆంధ్రాకు చెందిన లగడపాటి లాంటి వాళ్లు కేసీఆర్ కు వ్యతిరేకంగా సర్వే వస్తుందని చెబుతున్నప్పటకీ మోహన్ బాబు లాంటి వాళ్లు అలాంటి సర్వేలను లెక్క చేయకుండా కే సీ ఆర్ కు అనుకూలంగా మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుకు కేసీఆర్ ను వ్యతిరేకించిన మోహన్ బాబు లాంటి వాళ్లు కూడా ఇప్పుడు కేసీఆర్ కు అనుకూలంగా మాట్లాడటం చూస్తే .. కేసీఆర్ పాలన పై ఆంధ్రా మేధావుల్లోనూ సంతృప్తి స్థాయి ఉందని అర్థమవుతోంది.. మొత్తంగా చూసినట్లయితే కేసీఆర్ పాలన పై తెలంగాణ ప్రజలే కాదు.. ఆంధ్రా రాయలసీమ ప్రజలు కూడా సానుకూలంగా ఉండటం విశేషంగా చెప్పొచ్చు.
Please Read Disclaimer