నామినేషన్ దాఖలు చేసిన సుహాసిని

0

కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన దివంగత నేత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం ఆమె బాబాయ్ బాలకృష్ణ, పెదనాన్న తదితర కుటుంబ సభ్యులతో ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకున్న సుహాసిని, ఎన్టీఆర్ సమాధిపై పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.

అనంతరం బాలకృష్ణ, మాజీ మంత్రి పెద్దిరెడ్డి తదితర నేతలతో కలిసి కూకట్‌పల్లి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందించారు. ఆమె వెంట టీడీపీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు.

ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ మాట్లాడుతూ.. కూటమి తరఫున తాను కూడా ప్రచారం చేస్తానని, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు తమ వీలును బట్టి ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు. షూటింగ్ నిమిత్తం విదేశాలకు వెళ్లిన కళ్యాణ్ రామ్, జూ.ఎన్టీఆర్‌లు ట్విట్టర్ ద్వారా తన సోదరిని సంయుక్తంగా అభినందించారు.
Please Read Disclaimer