పవన్ కళ్యాణ్ మౌనం దేనికి సంకేతం

0

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నఫళంగా రాజకీయాలలో స్పీడ్ తగ్గించారు. దాదాపుగా కొత్త సంవత్సరం ప్రారంభం నుండే ఆయన జనసేన పోరాట యాత్ర పేరుతో చేస్తున్న యాత్రలు ఆపేశారు. పూర్తిగా పార్టీ కార్యక్రమాలకే పరిమితం అవుతున్నారు. మరోవైపు స్క్రీనింగ్ కమిటీ అని ఒకటి పెట్టి అభ్యర్థుల నుండి దరఖాస్తులు తీసుకుంటున్నారు. వస్తున్న వారంతా కొత్త మొహాలే. ఇవాళా రేపు ఉండే ధన రాజకీయాలలో వీరు నెగ్గుకురాగలరా అనేది అందరికీ అనుమానమే.

ఈ నిర్లిప్తత కారణంగా సహజంగా వేరే పార్టీల నుండి వచ్చే నాయకులు కూడా జనసేన వైపు చూడటం మానేశారు. ముందు పార్టీ లో చేరదాం అనుకున్న నేతలు కూడా ఇప్పుడు వేరే దారులు వెతుక్కునే పరిస్థితి. దీనితో అసలు జనసేన మొత్తం 175 నియోజకవర్గాలలో అభ్యర్థులను పెట్టగలదా? అనే అనుమానాలు లేకపోలేదు. అదే పార్లమెంట్ నియోజకవర్గాల పరిస్థితి అయితే చెప్పుకోనవసరం లేదు. ఈ క్రమంలో కొన్ని వదంతులు రాజకీయ వర్గాలలో జనసేన మీద వినిపిస్తున్నాయి.

కేవలం ఉత్తరాంధ్రా, గోదావరి జిల్లాలు, కృష్ణ, గుంటూరులో మాత్రమే ఆ పార్టీ పోటీ చేస్తుంది అని ప్రచారం జరుగుతుంది. మరొక వర్గం జనసేన ఉన్నట్టుండి పొత్తుల గురించి ఆలోచన చేస్తుందని, తెరవెనుక మంతనాలు కూడా జరుగుతున్నాయని…. 25-30 సీట్లకు మించి పోటీ చేసే అవకాశం లేదని కూడా వదంతులు వినిపిస్తున్నాయి. జనసేనాని మౌనం మరింత శ్రేణులలో ఒకింత గందరగోళనికి గురి చేస్తుంది. ఇటువంటి పరిస్థితిలు ముందు కూడా కొనసాగితే పార్టీకి ఓటు వేద్దాం అనుకున్న వారు కూడా తమ ఓటు మురిగిపోకుండా పక్కకు చూడటం మొదలు పెడతారు.
Please Read Disclaimer