కేసీఆర్‌కు చేతులెత్తి నమస్కరిస్తున్నా, జగన్.. మీ నాన్నలా మీరెందుకు నిలబడరు? పవన్

0

జాతీయ స్థాయి నాయకులు కొందరు మనల్ని కుక్కలతో పోలుస్తున్నారని జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రులు ద్రోహులా? పాలకులు చేసిన తప్పులకు ప్రజలకు శిక్ష వేస్తారా? అని ప్రశ్నించారు. బీజేపీ మనల్ని దెబ్బకొట్టిందన్న ఆయన.. అప్పుడు మనం భుజం మోస్తే.. దొడ్డి దారిన బీజేపీకి వైసీపీ అండగా ఉంటానంటే ఎలా? జగన్.. మీరు బీజేపీతో కలిసి ఉన్నారో లేదో చెప్పండి? అని పవన్ నిలదీశారు.

‘తెలంగాణ విడిపోతే.. హైదరాబాద్ వెళ్లడానికి మనకు పాస్ పోర్టులు కావాలని దివంగత రాజశేఖర రెడ్డి అన్నారు. మీ నాన్న ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం నిలబడ్డారు. మరీ మీరెందుకు నిలబడరు? తెలంగాణ నాయకులు మనల్ని ఛీకొట్టినప్పుడు మీరు కేసీఆర్‌ను ఇక్కిడికెలా ఎలా తీసుకొస్తారు? అని పవన్ ప్రశ్నించారు.

‘ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వ్యక్తులతో జగన్ చేతులు కలుపుతున్నారు. ఆయన బీజేపీ, టీఆర్ఎస్‌తో చేతులు కలుపుతున్నారు. ప్రధాని మోదీతో, కేసీఆర్‌తో నాకు సాన్నిహిత్యం ఉంది. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం వారితో విభేదించాను. జగన్ వారితో ఎందుకు కలుస్తున్నారని పవన్ పవన్ ప్రశ్నించారు.

కోట్ల మందిని ఏకతాటిపైకి తీసుకొచ్చిన ఉద్యమ నాయకులు కేసీఆర్ అంటే గౌరవమన్న పవన్.. కేసీఆర్ మా కుటుంబానికి కావాల్సిన వ్యక్తి అన్నారు. రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు మనల్ని ఛీకొట్టారు. విడిపోయాక కూడా ఇంకెందుకు గొడవలని పవన్ వ్యాఖ్యానించారు. రెండు చేతులెత్తి కేసీఆర్‌కు నమస్కరిస్తున్నా. దయచేసిన ఆంధ్రావాళ్లను వదిలేయండని ఆయన కేసీఆర్‌ను కోరారు.
Please Read Disclaimer