సాహో లో ప్రభాస్ వాడిన బ్లూటూత్ గురించి మీకు తెలియని సీక్రెట్స్!!

TV9 రవి ప్రకాశ్ అడుగులు.. కొత్త ఛానెల్‌ను ప్రారంభించే దిశగా?

0

టీవీ9 రవి ప్రకాశ్ వ్యవహరంలో గత కొద్ది రోజులుగా ఏం జరుగుతోందో అందరికీ తెలిసిందే. ఆయన్ను సీఈవో బాధ్యతల నుంచి తప్పించిన యాజమాన్యం.. కొత్త సీఈవోను ప్రకటించింది. ఫోర్జరీ, డేటా చోరీ కేసులను ఎదుర్కొంటున్న రవిప్రకాశ్ టీవీ9ను వీడే విషయమై స్పందించారు‌. టీవీ9 ఛానల్‌ను ఏ పార్టీకి కొమ్ముకాయని మీడియా సంస్థగా రూపుదిద్దామని తెలిపిన ఆయన.. ఇతర తెలుగు ఛానళ్లలా మేం మూఢనమ్మకాలను, జ్యోతిష్యాలను ప్రోత్సహించమన్నారు. టీవీ9 ఛానల్‌పై కన్నేసిన ‘మై హోం’ జూపల్లి రామేశ్వర్ రావు అలంద మీడియా సంస్థ ద్వారా దొడ్డిదారిన ప్రవేశించారని రవి ప్రకాశ్ ఆరోపించారు.

రామేశ్వర్ రావు టీవీ9 ఛానల్‌లో మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉందన్న రవి ప్రకాశ్.. మా 15 ఏళ్ల కృషి ఫలితమైన టీవీ9 ఛానల్ యథాతథంగా ఉంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నాపై మరిన్ని కేసులు పెట్టి జైలుకు పంపాలని కోరుకుంటున్నారని ఆయన ఆరోపించారు. జర్నలిస్టునైన తాను అసాధ్యమైన రీతిలో ఛానల్‌ను అభివృద్ధి చేశానని తెలిపారు. ఇప్పటికీ టీవీ9 ఛానల్‌లో షో నిర్వహించాలని బలంగా కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. ఒకవేళ వీలుపడని పక్షంలో మరో ఛానల్ ప్రారంభించి, మొదటి నుంచి అభివృద్ధి చేస్తానని ప్రకటించారు.

టీవీ9 కొత్త యాజమాన్యం రవి ప్రకాశ్‌ను బయటకు పంపేయడంతో ఆయన ఓ న్యూస్ ఛానెల్‌ను సొంతం చేసుకున్నారనే వార్తలు వెలువడిన సమయంలో ఆయన చేసిన తాజా ప్రకటన ఆసక్తికరంగా మారింది. ఛానెల్ వ్యవహారాల్లో నూతన యాజమాన్యం రవి ప్రకాశ్ జోక్యాన్ని కోరుకోవడం లేదు. దీంతో ఆయన కొత్త ఛానెల్‌ను ప్రారంభించే అవకాశాలే మెండుగా ఉన్నాయని భావించొచ్చు.
Please Read Disclaimer