కేసీఆర్ గాలి ఇంతలా ఎవరూ తీయలేదేమో?

0

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇబ్బందికర పరిస్థితి మరోసారి ఎదురైంది. ఎప్పుడైనా.. ఎక్కడైనా తనదే పైచేయి ఉండేలా వ్యవహరించే ఆయన.. తాజాగా ఆయన జరిపిన చెన్నై ట్రిప్ ఇప్పుడాయన ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేసేలా మారిందని చెప్పక తప్పదు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో వివిధ రాష్ట్రాల్లో పర్యటించే కేసీఆర్.. తాజాగా డీఎంకే అధినేత స్టాలిన్ తో గంటకు పైనే భేటీ కావటం తెలిసిందే.

స్టాలిన్ అపాయింట్ మెంట్ విషయంలో ఇబ్బంది పడిన ఆయన పరువు దక్కించుకున్న చందంగా.. ఒకసారి కాదని.. మరోసారి అవుననిపించుకున్న వెంటనే స్పెషల్ ఫ్టైట్ లో వెళ్లిన కేసీఆర్.. నిన్న సాయంత్రం వేళలో స్టాలిన్ తో భేటీ కావటం తెలిసిందే. మర్యాదపూర్వక భేటీగా మూడు ముక్కల్లో విషయాన్ని తేల్చేసిన డీఎంకే.. తాజాగా తమ సమావేశంపై స్టాలిన్ చేసిన వ్యాఖ్య కేసీఆర్ ను ఇబ్బంది పెట్టేలా మారిందని చెప్పకతప్పదు.

తాజాగా మాట్లాడిన స్టాలిన్.. చెన్నైకి కేసీఆర్ వచ్చింది ఫెడరల్ ఫ్రంట్ కు మద్దతు కోరేందుకు కాదని.. కేవలం దైవ దర్శనాల కోసమే వచ్చినట్లుగా పేర్కొన్నారు. కూటమిని ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ రాలేదని.. ఆలయాల దర్శనం కోసం తమిళనాడుకు వచ్చారని చెప్పటం ద్వారా.. గులాబీ బాస్ బడాయిగా చెప్పుకున్న ఫ్రంట్ మాటలు ఉత్తవన్నట్లు తేలిపోయింది. సీరియస్ గా ఫ్రంట్ కోసం చర్చలకు వెళితే.. స్టాలిన్ తన మాటలతో సారును మరీ ఇంతలా చిన్నబుచ్చటమా?
Please Read Disclaimer