బాబుపై ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలు.. టీడీపీ కౌంటర్

0

రెండు రోజుల కిందట నెల్లూరు జిల్లాలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జేడీయూ నేత, వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌పై వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయనను ‘బిహార్‌ బందిపోటు దొంగ’గా అభివర్ణిస్తూ విమర్శలు చేయడంపై ట్విట్టర్ వేదికగా ప్రశాంత్‌ కిశోర్‌ ట్విటర్‌ ఏపీలో టీడీపీకి ఓటమి తప్పదన్న భయాన్ని, బిహార్‌ రాష్ట్రంపై ఆయనకున్న విద్వేషం, ఈర్ష్యలను చంద్రబాబు తన వ్యాఖ్యల ద్వారా బహిర్గతం చేసుకున్నారని ఆరోపించారు. ‘ఎంత అనుభవజ్ఞుడైన రాజకీయవేత్త అయినా ఓటమి తప్పదని తెలిసినప్పుడు గందరగోళానికి గురవుతారు. ఇతరులపై నిందలు మోపడం మాని ఏపీ ప్రజలు తనకు మళ్లీ ఎందుకు ఓటు వేయాలనే విషయంపై చంద్రబాబు దృష్టి సారించాలి’ అని ప్రశాంత్‌ కిశోర్‌ ట్వీట్‌ చేశారు.

దీనికి టీడీపీ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓటమితో ఆ పార్టీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌కు మిగిలేది నిరుద్యోగమేనని టీడీపీ ఐటీ అకాడమీ ఛైర్మన్‌ కరణం వెంకటేశ్‌ ఎద్దేవా చేశారు. టీడీపీకి ఎందుకు ఓటెయ్యాలో, వైసీపీకి ఎందుకు వేయకూడదో ఆంధ్రప్రదేశ్ ప్రజలను అడిగితే సమాధానం చెబుతారని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేదెవరో.. మరికొద్ది రోజులు ఆగితే తెలుస్తుందని వెంకటేశ్ పేర్కొన్నారు. ఏజెంట్లను నియమించుకుని డిజిటల్‌ విధానంలో వందల కోట్ల పంపిణీకి కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు.
Please Read Disclaimer